...
...
Next Story

Peddi Ending Explained: రామ్ చరణ్ ‘పెద్ది’ ఎండింగ్ ఏంటి? సీక్వెల్ ఉంటుందా?.. ఏడిపించేస్తున్న క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే

Peddi Ending Explained: డైరెక్టర్ బుచ్చిబాబు సానా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘పెద్ది’ (Peddi) సినిమా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్, ఊహించని ట్విస్ట్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. మరి అవేంటో ఇక్కడ చూసేయండి.

Published on: Jun 4, 2026, 17:29:14 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Peddi Ending Explained: 'ఉప్పెన' సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న (ఈరోజే) వరల్డ్‌వైడ్‌గా భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా, నిన్న పడిన పెయిడ్ ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Peddi Ending Explained: రామ్ చరణ్ ‘పెద్ది’ ఎండింగ్ ఏంటి? సీక్వెల్ ఉంటుందా?.. ఏడిపించేస్తున్న క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే
Peddi Ending Explained: రామ్ చరణ్ ‘పెద్ది’ ఎండింగ్ ఏంటి? సీక్వెల్ ఉంటుందా?.. ఏడిపించేస్తున్న క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే

ఉత్తరాంధ్ర (విజయనగరం) బ్యాక్‌డ్రాప్‌లో ఒక సామాజిక పోరాటానికి స్పోర్ట్స్‌ను ముడిపెట్టి బుచ్చిబాబు ఈ కథను అద్భుతంగా తీశారు. అసలు 'పెద్ది' కథేంటి? క్లైమాక్స్‌లో ఏం జరిగింది? ఆ గుండెల్ని పిండేసే ముగింపు ఏంటో డీకోడ్ చేద్దాం. ఇందులో కొన్ని స్పాయిలర్స్ ఉన్నాయి. చదివే ముందే ఇది తెలుసుకోండి.

అసలు 'పెద్ది' కథేంటి?

విజయనగరం జిల్లా పరిసరాల్లోని కొండల కింద ఉండే ఒక చిన్న ఊరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ పెద్ది సినిమా నడుస్తుంది. ఆ ఊరికి కనీసం ఒక పేరు కూడా ఉండదు. అందుకే చుట్టుపక్కల జనాలు దాన్ని ‘కొండ కింద ఊరు’ అని పిలుస్తుంటారు. స్వతంత్ర భారత దేశంలో ఉన్నా.. ఆ ఊరి జనాలకు కనీస ఆరోగ్య సదుపాయాలు, స్కూల్స్, తాగునీరు, రైల్వే స్టేషన్ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ ఏవీ ఉండవు.

తమ ఊరికి ఒక గుర్తింపు తేవాలని, ప్రభుత్వ సాయం అందేలా చేయాలని అప్పలసూరి (జగపతిబాబు) ఎన్నేళ్లుగానో పోరాటం చేస్తాడు. ఆయన ఆశయాలను, ఆ పోరాటాన్ని పెద్ది (రామ్ చరణ్) తన భుజాలపై వేసుకుంటాడు. ఆటల్లో మంచి టాలెంట్ ఉన్న పెద్ది, తన ఊరి జనాల గొంతుకను ప్రభుత్వానికి వినిపించడానికి క్రీడలను ఒక ఆయుధంగా వాడుకోవాలని ఫిక్స్ అవుతాడు.

విజయం వైపు ప్రయాణం.. అనుకోని విపత్తు

కుస్తీ పోటీల్లో పెద్ది వరుస విజయాలు సాధిస్తుంటే, అప్పటివరకు స్టార్‌గా వెలిగిన వీరభద్ర (తారక్ పొన్నప్ప) తట్టుకోలేడు. పెద్ది బలహీనతను పసిగట్టిన వీరభద్ర, ఫైనల్స్ మ్యాచ్‌లో అతని కాలును దారుణంగా విరగ్గొడతాడు. నరాలు పూర్తిగా డ్యామేజ్ అవ్వడంతో పెద్ది ఇకపై ఎప్పటికీ ఆటల్లో పాల్గొనలేడని డాక్టర్లు తేల్చేస్తారు. తన కాలు పోయినా ఊరి కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ అధికారులు అతని మాటను అస్సలు పట్టించుకోరు.

గుండెల్ని పిండేసే క్లైమాక్స్ ట్విస్ట్

సర్వస్వం కోల్పోయి డిప్రెషన్‌లో ఉన్న టైమ్‌లో.. పెద్ది కన్ను పారా అథ్లెట్ల (దివ్యాంగ క్రీడాకారులు) మీద పడుతుంది. తన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇదొక్కటే దారి అని ఫీల్ అయి, ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. అత్యంత పెయిన్‌ఫుల్ రీతిలో తన కాలును తనే స్వయంగా కోల్పోయి, బ్లేడ్ రన్నర్‌గా మారతాడు. ఇక్కడే డైరెక్టర్ రామ్ చరణ్ యాక్టింగ్‌ను పీక్స్‌లో చూపించారు. కఠోరమైన ట్రైనింగ్ తర్వాత 1996 పారా ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని ఇండియా తరఫున గోల్డ్ మెడల్ సాధిస్తాడు.

ఇక్కడే డైరెక్టర్ బుచ్చిబాబు కథకు ఒక అద్భుతమైన ముగింపు ఇచ్చారు. మెడల్ గెలిచిన తర్వాత స్టేజ్ మీద నిలబడి పెద్ది మాట్లాడే మాటలు థియేటర్లలో ప్రతి ఒక్కరినీ ఏడిపిస్తాయి. తాను ఉండే ఊరికే కనీసం ఒక పేరు లేనప్పుడు, నన్ను భారతీయుడిగా ఎలా పిలుస్తారు? అంటూ సిస్టమ్‌ను నిలదీస్తాడు.

ఒక సామాన్య ఓటరుగా వెళ్లినప్పుడు వినని ప్రభుత్వం, దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన ఛాంపియన్ మాట వినక తప్పదు. చివరికి ప్రభుత్వం దిగివచ్చి ఆ ఊరికి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఆ గ్రామానికి 'అప్పలవలస' (అప్పలసూరి జ్ఞాపకార్థం) అని పేరు పెట్టి, రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అలా పెద్ది అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు.

'పెద్ది'కి పార్ట్ 2 ఉందా?

ముగింపులో ఒలింపిక్ కమిటీ మెంబర్‌గా కనిపించే బోమన్ ఇరానీ.. పెద్ది స్టోరీ చూసి ఇన్‌స్పైర్ అయి దేశవ్యాప్తంగా ‘ఖేలో ఇండియా’ స్టార్ట్ చేస్తారు. మరోవైపు క్రాస్‌ఓవర్ అథ్లెట్‌గా ఎదిగిన పెద్ది, తన సొంత ఊరు అప్పలవలసలో తను కలలుగన్న ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు.

క్లైమాక్స్‌లో రామ్ చరణ్ కెమెరా వైపు చూస్తూ తన మార్క్ డైలాగ్ "మళ్ళీ పుడతామా ఏంటి?" అని అనడంతో పార్ట్ 2 ఉంటుందా అని ఆడియన్స్‌కు డౌట్ వస్తుంది. కానీ ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా బుచ్చిబాబు ఈ కథను ఇక్కడితోనే పర్ఫెక్ట్‌గా ఎండ్ చేశారు. పార్ట్ 2 లేదని ఎండింగ్ కార్డ్స్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe