గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు గాయమైందన్న వార్త నిన్నటి నుంచి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' షూటింగ్‌లో చరణ్ గాయపడ్డాడు. మంగళవారం (మార్చి 24) ఈ న్యూస్ బయటకు రాగానే.. అతని కంటికి తీవ్ర గాయమైందని పుకార్లు షికార్లు చేయడంతో మెగా అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. కానీ చరణ్ టీమ్ ఈ వార్తలపై వెంటనే స్పందించి అసలు నిజం ఏంటో హిందుస్థాన్ టైమ్స్‌కు క్లారిటీ ఇచ్చింది.
గాయం ఎలా జరిగిందంటే..

యాక్షన్ సీక్వెన్స్ తీస్తుండగా రామ్ చరణ్ కంటికి కాదు, కంటి పైభాగంలో చిన్న గాయమైందని అతని టీమ్ నుంచి ఒకరు స్పష్టం చేశారు. "మంగళవారం ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు చరణ్‌కు గాయమైంది. దానికి ఏకంగా నాలుగు కుట్లు వేయాల్సి వచ్చింది. అయితే జనాలు కంగారు పడుతున్నట్లు ఆయన కంటికి ఏమీ కాలేదు, కంటి పైన మాత్రమే చిన్న గాయమైంది, కన్ను సురక్షితంగానే ఉంది" అని వాళ్లు చెప్పారు.
ఇది చాలా చిన్న గాయమే అని, భయపడాల్సిన పనేమీ లేదని, చరణ్ ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా మళ్లీ వెంటనే షూటింగ్‌లో జాయిన్ అయిపోయాడని కూడా వాళ్లు వెల్లడించారు. పుకార్లను నమ్మొద్దని పెద్ది చిత్ర బృందం కూడా సోషల్ మీడియాలో ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది.
"పెద్ది సెట్స్‌లో జరిగిన చిన్న సంఘటన గురించి వస్తున్న వార్తలపై మేం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. రామ్ చరణ్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఎడమ కంటి దగ్గర చిన్న గాయమైంది, దానికి ఒక చిన్న ట్రీట్‌మెంట్ జరిగింది. రేపటినుంచి ఆయన ఎలాంటి బ్రేక్ లేకుండా యధావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారు. మీ ప్రేమకు, ఆందోళనకు థ్యాంక్స్, కానీ కంగారు పడాల్సిన పనేమీ లేదు. అంతా కంట్రోల్‌లోనే ఉంది, సినిమా షూటింగ్ స్మూత్‌గా ముందుకు వెళ్తోంది" అని ఆ నోట్‌లో రాసుకొచ్చారు.
పెద్ది సినిమా విశేషాలు..
బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ పెద్ది సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, ఐవీవై ఎంటర్‌టైన్మెంట్ కింద ఇషాన్ సక్సేనా కో-ప్రొడ్యూస్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ సినిమాను సమర్పిస్తున్నాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు లాంటి స్టార్లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
{{/usCountry}}బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ పెద్ది సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, ఐవీవై ఎంటర్‌టైన్మెంట్ కింద ఇషాన్ సక్సేనా కో-ప్రొడ్యూస్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ సినిమాను సమర్పిస్తున్నాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు లాంటి స్టార్లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
{{/usCountry}}ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. నవంబర్ 2024లో మళ్లీ మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక మార్చి 2025లో ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ధురంధర్ 2 పై చరణ్ ప్రశంసలు.. రిలీజ్ డేట్స్ మార్పు
ఇదిలా ఉంటే ఈ వారం మొదట్లో రామ్ చరణ్.. ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ మూవీ 'ధురంధర్ ద రివెంజ్' సినిమా చూసి తన రివ్యూను ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు.
"ధురంధర్ ద రివెంజ్ చాలా సహజంగా, గ్రిప్పింగ్‌గా ఉంది. ఆదిత్య ధర్ ఈ సినిమా స్కేల్, ఎమోషన్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. రణ్‌వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఫినామినల్, సినిమా అంతా మన అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటాడు. మాధవన్ సార్, సంజయ్ దత్ సార్, అర్జున్ రాంపాల్ సార్ తమ సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. సారా అర్జున్ రోల్ టెర్రిఫిక్ గా ఉంది, మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది" అని చరణ్ పొగడ్తలతో ముంచెత్తాడు. జియో స్టూడియోస్, జ్యోతి దేశ్‌పాండేలతో పాటు టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెప్పాడు.
నిజానికి ఈ పెద్ది సినిమా ముందుగా మార్చి 27న థియేటర్లలోకి రావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ముందుగా మార్చి 26న రావడం ఖాయమవ్వడంతో, ధురంధర్ 2 తో క్లాష్ ఎందుకులే అని పెద్ది సినిమాను ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ఆ తర్వాత ఊహించని విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ముందుకు జరిపి, సరిగ్గా ధురంధర్ 2 రిలీజ్ అయిన మార్చి 19వ తేదీనే థియేటర్లలోకి తీసుకురావడం విశేషం.