...
...
Next Story

PEDDI Ki AAWAZ: మోత మోగిపోయేలా పెద్ది కి ఆవాజ్.. ఇవాళే ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్.. స్పెషల్ సాంగ్ లాంఛ్ టైమ్ ఇదే

PEDDI Ki AAWAZ: పెద్ది మోతతో దేశమంతా మార్మోగేలా మూవీ టీమ్ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఇవాళ ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సెర్ట్ ఉంది. ఈ సందర్భంగా స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్నారు. ఈ కాన్సెర్ట్ టైమింగ్, పాడే సింగర్స్ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: May 23, 2026, 14:26:01 IST
Advertisement

PEDDI Ki AAWAZ: ఇప్పటికే ట్రైలర్ తో పెద్ది మేనియా ఇండియా మొత్తం విస్తరించింది. ఇప్పుడా జోష్ ను మరో లెవల్ కు తీసుకెళ్లేందుకు, మూవీని దేశంలోని ప్రతి ఆడియన్ కు చేరవ చేసేందుకు పెద్ది టీమ్ మరో ఈవెంట్ కు రెడీ అయింది. ఈ మూవీకి మ్యూజిక్ అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సెర్ట్ నేడు జరగనుంది.

పెద్ది కి ఆవాజ్

పెద్ది మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సెర్ట్ (x/MythriOfficial)
పెద్ది మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సెర్ట్ (x/MythriOfficial)

ఏఆర్ రెహమాన్ శనివారం నిర్వహించనున్న లైవ్ కాన్సెర్ట్ కు ‘పెద్ది కి ఆవాజ్’ అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్ తో పాటు హీర్, మోహిత్ చౌహాన్, రక్షిత సురేష్ లైవ్ పర్ఫార్మెన్స్ చేయనున్నారు. పెద్ది పాటలతో మార్మోగించనున్నారు. బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో దేశాన్ని ఊపేయబోతున్నారు.

టైమ్ ఇదే

పెద్ది మ్యూజిక్ కాన్సర్ట్ ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న బీహెచ్ఈఎల్ దసరా మైదాన్ లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ ఆల్రెడీ హైదరాబాద్ నుంచి బయల్లేరి వెళ్లాడు. యూట్యూబ్ లోని వృద్ధి సినిమాస్‌ ఛానెల్ లో ఈ ఈవెంట్ ను లైవ్ చూడొచ్చు.

స్పెషల్ సాంగ్

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ సందర్భంగా పెద్ది సినిమాలోని స్పెషల్ సాంగ్ ను లాంఛ్ చేయనున్నారు. ‘హల్లల్లల్లో’ అంటూ సాగే ఈ పాట ప్రోమో ఇప్పటికే అదరగొడుతుంది. ఇందులో బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్ తో రామ్ చరణ్ స్టెప్పులేశాడు. ఈ స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

పెద్ది మేనియా

పెద్ది మూవీ కోసం రామ్ చరణ్ తనలోని బీస్ట్ మోడ్ ను ఆన్ చేశాడనే కామెంట్లు వస్తున్నాయి. ఈ చిత్రంలో క్రికెటర్, రెజ్లర్, రన్నర్ గా రామ్ చరణ్ కనిపించనున్నాడు. దీని కోసం చాలా కష్టపడ్డాడు. తన బాడీని క్యారెక్టర్ కు తగ్గట్లుగా మార్చుకున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న పెద్ది మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks