...
...
Next Story

Podarillu November 14 Episode: పొదరిల్లు.. మనీషాకు నారాయణ కొత్త పేరు.. చక్రిని పట్టించుకోని మహా..ప్రాణాలతో బయటపడ్డ కన్నా

Podarillu Serial November 14th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 14 ఎపిసోడ్ లో బృందావనానికి దీపావళి కళ వస్తుంది. ఇంట్లో వాళ్లందరినీ చూసి నారాయణ ఎమోషనల్ అవుతాడు. అదే సమయంలో మనీషాకు కొత్త పేరు పెడతాడు. అటు చక్రి స్టేటస్ ని మహా అస్సలు పట్టించుకోదు.

Published on: Nov 14, 2026, 07:07:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ బృందావనంలో దీపావళి వేడుకల చుట్టూ తిరిగింది. ఈ క్రమంలో కన్నా ప్రమాదంలో పడగా.. నారాయణ కాపాడే సీన్ తో ఎపిసోడ్ ముగిసింది. అయితే చక్రి తన స్టేటస్ విషయంలో ఒక అనుకుంటే మరొకటి జరుగుతుంది.

చక్రి స్టేటస్.. భయపెట్టిన కన్నా, కేశవ

పొదరిల్లు సీరియల్ నవంబర్ 14 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ నవంబర్ 14 ఎపిసోడ్

మహాతో ఉన్న ఫొటోను చక్రి స్టేటస్ లో పెట్టి నా భార్యతో తొలి దీపావళి అని క్యాప్షన్ పెట్టే సీన్ తో సీరియల్ శనివారం (నవంబర్ 14) ఎపిసోడ్ మొదలైంది. అది చూసి తానే మురిసిపోతుంటాడు. తర్వాత మాధవకు చూపిస్తాడు. తాను ఏం రాశానో కూడా అతనికి వివరిస్తాడు. అది విని కన్నా, కేశవ షాకవుతారు.

ఇంటి గోడలు బలంగానే ఉన్నాయి కదా.. ఆ స్టేటస్ చూసి మహా ఎగిరి తంతే వీడు బయటికెళ్లి పడతాడు అని కేశవ భయపెడతాడు. అటు కన్నా కూడా ఆ స్టేటస్ వదిన చూడకుండా హైడ్ చేశావా అని అడుగుతాడు. లేదు.. ఆమె కూడా చూస్తుంది.. చూసి చాలా సంతోషిస్తుంది చూస్తూ ఉండండి అని చక్రి అంటాడు.

మహా రియాక్షన్ చూసి అందరూ షాక్

తర్వాత మహా బయటకు వస్తుంది. ఫోన్ చూశారా అని కన్నా అడిగితే.. వెంటనే వెళ్లి చూస్తుంది. ఫోన్ చూడగానే ఆమె రియాక్షన్ మారిపోతుంది. దీంతో అందరూ ఆమె స్టేటస్ చూసేసిందేమో అనుకుంటారు. బయటకు వచ్చి చక్రిని తిట్టడంతో అదే జరిగిందేమో అని ఫిక్సవుతారు.

గదిలో అందరి స్టేటస్ లు చూస్తూ ఉంటుంది మహా. బయట చక్రితోపాటు కన్నా, కేశవ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అది చూసి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని అనుకుంటారు. వరుసగా స్టేటస్ లు చూస్తూ సరిగ్గా చక్రి స్టేటస్ వచ్చే సరికి ఫోన్ అలాగే పక్కన పెట్టి బయటకు వస్తుంది. ఇటు చక్రికి ఆమె తన స్టేటస్ చూసేసినట్లుగా చూపిస్తుంది.

నిజానికి ఆమె చూడకుండా పక్కన పెడుతుంది. బయటకు వచ్చి చక్రికి ఓ సీరియస్ లుక్ ఇచ్చి కిచెన్ లోకి వెళ్తుంది. తిరిగి వెళ్తుండగా కన్నా పిలుస్తాడు. అందరి స్టేటస్ లు చూశారా అని అడిగితే.. చూశాను కొన్నింటికి లైక్ కూడా కొట్టాను అని అంటుంది. అది విని చక్రి తెగ సంతోషిస్తాడు. ఆమె వెళ్లిపోగానే చూశారా.. ఆమె తన స్టేటస్ చూసి కూడా ఏమీ అనలేదు అని చక్రి మురిసిపోతాడు.

బృందావనంలో దీపావళి.. మనీషాకు కొత్త పేరు.. నారాయణ ఎమోషనల్

ఆ తర్వాత బృందావనానికి దీపావళి కళ వస్తుంది. ఇల్లంతా దీపాలతో మెరిసిపోతూ ఉంటుంది. ఇంటి బయట మనీషా పూలతో అందంగా అలంకరించి మధ్యలో దీపాలు పెడుతుంది. అది చూసిన నారాయణ చాలా సంతోషిస్తాడు. ఈ ఇంటికి వచ్చిన తొలి కోడలివి నువ్వు.. అందుకే నీ పేరు ఇక నుంచి ఒకటి అని అంటాడు. అది విన్న మనీషా పేరు బాగుంది అని అంటుంది.

ఇంట్లో వెళ్లి చూస్తే అందరూ కొత్త బట్టలు వేసుకొని ఆనందంగా ఉండటం చూస్తాడు నారాయణ. ఎమోషనల్ అవుతాడు. ఇంటికి నిజమైన పండగ వచ్చినట్లుంది అని మాధవతో అంటాడు. మహా వచ్చినప్పటి నుంచే ఇల్లు ఇలా కళకళలాడుతోంది అని మాధవ చెబుతాడు.

కన్నా కోసం మాధవ టపాసులు.. ఫ్యామిలీ సంబరాలు

ఆ తర్వాత కన్నా డల్లుగా కూర్చొంటాడు. అతన్ని చూసి ఏం జరిగిందని చక్రి అడుగుతాడు. దీపావళి రోజు టపాసులు ఎక్కడ అని అడుగుతాడు. నీకోసం అన్నయ్య తీసుకొచ్చాడు కదా.. అన్నీ అప్పుడే కాల్చేశావా అని అనడంతో కన్నా ఎగిరి గంతేస్తాడు. మాధవ తీసుకొచ్చిన పటాకులను బయటకు తీసుకెళ్తాడు. ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషంగా వాటిని కాలుస్తూ పండగ చేసుకుంటుంది. అది చూసిన నారాయణ చాలా మురిసిపోతాడు.

చక్రిని లోనికి లాక్కెళ్లిన మహా.. కన్నా, నారాయణను కలిపే ప్లాన్

అందరూ టపాసులు కాలుస్తుండగా.. చక్రిని మహా లోనికి తీసుకెళ్తుంది. ఆమె చక్రిని చేయి పట్టుకొని లాక్కెళ్లడం చూసిన మాధవ, కేశవ, నారాయణ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. వాళ్లు ఇలాగే ఉంటే ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని మాధవ అంటాడు. లోనికి వెళ్లిన తర్వాత చక్రి సిగ్గు పడుతుంటాడు. ఆమె దేనికోసం లోనికి తీసుకొస్తుందో అర్థం కాదు. కానీ చేయి పట్టుకొని తీసుకు రావడంతో చక్రి ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఇప్పటికే చాలా టైమ్ వేస్ట్ చేశారు.. సుపుత్రుడిని, కన్నాను కలుపుతా అన్నారు కదా.. ఏమైంది అని చక్రిని అడగడంతో అతడు ఉసూరు మంటాడు. దీనికోసమేనా తీసుకొచ్చింది అంటాడు. తన ప్లాన్ చెబుతాడు. కానీ మహాకు అది నచ్చదు. అతన్ని తిడుతుంది.

కన్నాను కాపాడిన నారాయణ

ఇటు బయట అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అవుతారు. కన్నా ఒక్కడే టపాసులు కాలుస్తూ ఉంటాడు. జాగ్రత్త అని నారాయణ చెప్పినా పట్టించుకోడు. షాట్స్ కాలుస్తూ ఉంటే.. అది కాస్తా కింద పడుతుంది. పైకి వెళ్లాల్సినవి కన్నా మీదికి దూసుకొస్తాయి. అది చూసి నారాయణ వెంటనే అతనికి అడ్డుగా వెళ్లి కన్నాను గట్టిగా పట్టుకుంటాడు.

అవన్నీ నారాయణ వీపుకు గుచ్చుకొని అతడు గాయపడినా కన్నాను వదలడు. దీంతో కన్నా ప్రమాదం నుంచి బయటపడతాడు. అందరూ బయటకు వచ్చే చూసే సరికి కన్నాను నారాయణ కాపాడుతూ ఉంటాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజుఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks