...
...
Next Story

Podarillu November 17 Episode: పొదరిల్లు- శైలు డేంజర్ ప్లాన్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కేశవ- నారాయణకు షాకిచ్చిన మహా

Podarillu Serial November 17th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 17వ ఎపిసోడ్‌‌లో నారాయణ అండ్ సన్స్ షాప్ చూస్తూ మురిసిపోతాడు కేశవ. శైలు వచ్చి ఓవర్ చేస్తుంది. చోటును పనోడు అంటుంది. అధిపతిని అని దురుసుగా మాట్లాడుతుంది. మహాను పెళ్లి చేసుకుని కిచెన్‌లో రొమాన్స్ చేస్తున్నట్లు ఊహల్లో తేలిపోతాడు చక్రి.

Published on: Nov 17, 2026, 08:49:37 IST
Advertisement

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నారాయణ అండ్ సన్స్ మెకానిక్ షాప్ పేరుతో షాప్ చూస్తూ కేశవ సంతోషపడతాడు. ఈరోజు నుంచి బాధ్యత కొత్తది కదరా. ఇదంతా మా వాళ్ల నమ్మకం. వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలంటే ఇంకా గొప్పగా పని చేయాలని చోటుతో కేశవ అంటాడు.

పనోడివి పనోడిలా ఉండు

పొదరిల్లు సీరియల్ నవంబర్ 17 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ నవంబర్ 17 ఎపిసోడ్

ఇంతలో శైలు వచ్చి ఓవర్ చేస్తుంది. చోటు పార్టనర్ అని పిలిస్తే నేను మీ ఓనర్‌కి కాబోయే భార్యను. పనోడివి పనోడిలా ఉండు. ఈ సామ్రాజ్యానికి అధిపతి మనమే. నేను మీ అన్న జీవితంలోకి రాబట్టే ముంగీస గాడి జీవితం మారిపోయింది. ఈరోజు షాప్‌కి, స్థలానికి యజమాని అయ్యానంటే నేనేగా అని దురుసుగా మాట్లాడుతుంది శైలు. అవును అని చోటు అంటుంది.

నాలాంటి అదృష్టలక్ష్మి నీ జీవితంలోకి వచ్చిందని శైలు అంటే.. నువ్వు అదృష్టలక్ష్మా.. ఇదివరకు ఒసారి అన్నందుకే బైక్ పంక్చర్ అయిందని కేశవ గుర్తు చేస్తాడు. చోటు నవ్వుతాడు. ఏంట్రా నేను ఐరన్ లెగ్గా. షాప్‌కు కస్టమర్స్ రారు అంటున్నావా అని గోల చేస్తుంది శైలు. కస్టమర్స్ నీ షాప్‌కి పరుగులు పెడతారని వెళ్లిపోతుంది శైలు.

మరోవైపు చక్రి పైకి చూస్తూ ఊహల్లో తేలిపోతాడు. మాధవ, కన్నా విచిత్రంగా చూస్తారు. తన రేఖలు చూసుకుని మొహం మూసుకుని మురిసిపోతాడు. స్మశానం దాటి వచ్చి ఉంటాడని కన్నా అంటాడు. ఏదైనా గాలి సోకిందంటావా అని భయపడిపోతారు మాధవ, కన్నా. దెయ్యానికి బలం ఎక్కువ అన్నయ్య అని కన్నా భయపడిపోతాడు.

అన్నదమ్ముల డ్రీమ్స్

అవునురా ఆ తర్వాత మనీషా నన్ను కూడా పెళ్లి చేసుకుంటుందని మాధవ ఊహల్లో తేలిపోతాడు. ఆ తర్వాత బుస్సు కేశవను చేసుకుంటుందని చక్రి అంటాడు. అందరం సంతోషంగా ఉంటామని అంటారు. ఎహే ఆపండి.. మీ ముగ్గురు పెళ్లి చేసుకుని భార్యలతో సంతోషంగా ఉంటే నేను ఇంటిముందు కాపలా ఉండాలా అని కన్నా కోప్పడతాడు.

రేయ్ దొండకాయ్ నువ్వు ఇంకా చిన్నోడివిరా అని చక్రి అంటాడు. అయ్యో నేనింకా చిన్నోడినా. నాకు పెళ్లి వయసు ఎప్పుడెస్తుందో అని బాధపడతాడు కన్నా. మహాను పెళ్లి చేసుకుని ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటాడు చక్రి. వంటింట్లో మహాతో చక్రి రొమాన్స్ చేసినట్లు ఊహించుకుంటాడు. మరోవైపు ఒకావిడి రెండుసార్లు బైక్ రిపేర్‌కి వస్తుంది.

డబ్బులు ఇవ్వకుంటే అది ఒప్పుకోదు

పక్క వీధిలో బైక్ పార్క్ చేసి వచ్చేసరికి పాడైపోయిందని చెబుతుంది. డబ్బులు ఇస్తే కేశవ వద్దంటాడు. నువ్వు మా బుస్సు ఫ్రెండువే కదా అని అంటాడు. బిజినెస్ బిజినెసే ఫ్రెండ్ ఫ్రెండే అని తీసుకోమ్మని బలవంతం చేస్తుంది. మీకు డబ్బులు ఇవ్వకుండా వెళ్తే అది ఒప్పుకోదంటుంది. అదా అని అడిగితే.. అదే మనసాక్షి అని చెబుతుంది.

తర్వాత ఇంకోకతను వచ్చి రిపేర్ చేయించుకుంటాడు. డబ్బులు డబ్బాలో వేస్తాడు. అన్న బ్రో ఈరోజు మన షాపులో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. చూడు ఎన్ని డబ్బులో అని చూపిస్తాడు చోటు. తర్వాత కస్టమర్స్ వస్తూనే ఉంటారు. ఇన్ని బైకులు ఒకేసారి వస్తున్నాయని కేశవ షాక్ అవుతాడు. అందరి బైక్‌లు ఎలా పాడయ్యాయని అడిగితే పక్క వీధిలో పార్క్ చేసి వచ్చేసరికి ఇలా అయ్యాయని చెబుతారు.

మరోవైపు పార్క్ చేసిన బైకుల వైర్స్ కట్ చేస్తుంది శైలు. విజయవంతంగా 18 బైకులు పాడు చేశాను అనుకుంటుంది. ఈరోజు ముంగిస గాడికి డబ్బులే డబ్బులు. లేకుంటే నన్నే దురదృష్ట దేవత అంటాడా. ఇంకో 20 బైకులు పాడు చేద్దామని అంటుంది శైలు. మళ్లీ శైలు ఫ్రెండ్ వచ్చి రిపేర్ చేయించుకుని డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంది.

కేశవకు తెలిసిన శైలు ప్లాన్

ఈరోజు ఏంటీ ఇన్ని బైకులు వచ్చాయని చోటు అడుగుతాడు. ఏదో జరిగిందిరా అని కేశవ అంటాడు. శైలు ఫ్రెండ్ వస్తుంది. మళ్లీ పాడు చేద్దామంటుంది శైలు. అస్తమానం వెళ్తే డౌట్ వస్తుందే అని ఫ్రెండ్ అంటే.. ఈసారి బ్రేక్ వైర్ కట్ చేద్దామే అని శైలు అంటుంది. ఎందుకు అని కేశవ ఎంట్రీ ఇస్తాడు. కేశవను చూసి శైలు, ఫ్రెండ్ షాక్ అవుతారు.

ఫ్రెండ్ జంప్ అవుతుంది. ఇందాకటి నుంచి బైకులు ఎక్కువగా వస్తుందే ఏంటో అనుకుంటే నీ పనా అని కేశవ అంటాడు. నీకు డబ్బులు ఎక్కువ రావాలిగా అని శైలు అంటే.. అలా అని దగ్గరుండి బ్రేక్ వైర్స్ కట్ చేసి నా షాప్‌కి పంపిస్తావా. డబ్బు కోసం ఇలా చేస్తావా. వాళ్లకు ఏవేవే పనులు ఉంటాయి. పేదవాళ్లు ఉంటారు. నీ వల్ల ఎంత నష్టం. దీనికంటే అడుక్కోవడం నయం కదే తిక్కలదానా అని శైలును తిడతాడు కేశవ. శైలు డేంజర్ ప్లాన్ వేస్తే కేశవ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు.

చక్రికి మహా విడాకులు

మరోవైపు తనే గురించి ఆలోచిస్తున్నట్లు మహాను చక్రి అంటాడు. నేను ఆలోచిస్తుంది విడాకుల గురించి. రేపు కోర్టులో కౌన్సిలింగ్ ఉంది. మనం వెళ్లాలి. డివోర్స్ తీసుకోడానికి సిద్ధంగా ఉండండి అని మహాలక్ష్మి కోపంగా గట్టిగా చెబుతుంది. దాంతో చక్రి షాక్ అవుతాడు. బాధపడతాడు. విడాకుల విషయం చెప్పి నారాయణకు కూడా షాక్ ఇస్తుంది మహా. అక్కడితో పొదరిల్లు సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks