Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో చక్రి పంట పండుతుంది. మహా ల్యాప్‌టాప్ ఆటోలో మరచిపోవడం చక్రి పాలిట వరంగా మారుతుంది. అదే సమయంలో అటు విక్కీని కూడా మహాకు దూరం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
చక్రిని గెంటేసిన మహా

మహా అర్ధరాత్రి వరకూ పని చేస్తుండటంతో ఆమె దగ్గరికి చక్రి వెళ్లి విక్కీని తిట్టే సీన్ తో సీరియల్ మంగళవారం (నవంబర్ 24) ఎపిసోడ్ మొదలైంది. మా విక్కీ చాలా మంచోడు.. మీరెవరు అతన్ని తిట్టడానికి అని మహా అంటుంది. అతన్ని గదిలో నుంచి గెంటేస్తుంది. వెళ్లి మ్యాట్రిమొనిలో మరో అమ్మాయిని చూసుకోండి అని అంటుంది. దీంతో చక్రి బాధతో నారాయణ దగ్గరికి వెళ్తాడు.
నువ్వన్నట్లే నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. ఆమెకు ఏమీ బాధ లేనట్లుంది అని అంటాడు. నారాయణ కూడా చక్రి మాట వినకుండా అతన్ని వెళ్లిపొమ్మంటాడు. అందరూ గెంటేస్తున్నారంటూ చక్రి మరింత బాధపడతాడు.
నారాయణ ఆశీర్వాదం తీసుకున్న మహా
మరుసటి రోజు ఉదయం మహా తన కొత్త ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కోసం సిద్ధమవుతుంది. అందరూ ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతారు. చక్రిని మాత్రం ఆమె పట్టించుకోదు. దేవుడికి దండం పెట్టుకొని వెళ్లు.. అంతా మంచే జరుగుతుందని పెద్ది చెబితే ఆమె వెళ్లి హారతి ఇస్తుంది. ఆ హారతిని అందరికీ ఇచ్చి చక్రికి మాత్రం ఇవ్వదు.
ఆ తర్వాత నారాయణ కూడా లోపలికి రావడంతో అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. దీంతో నారాయణ ఆమెను ఆశీర్వదించి ఖర్చులకు ఉంచుకో అంటూ డబ్బులు ఇస్తాడు. తాను డ్రాప్ చేస్తానని చక్రి అంటున్నా కూడా వద్దన్న మహా.. కన్నాను తీసుకొని వెళ్తుంది.
మహా భయం పోగొట్టిన కన్నా
{{/usCountry}}ఆ తర్వాత నారాయణ కూడా లోపలికి రావడంతో అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. దీంతో నారాయణ ఆమెను ఆశీర్వదించి ఖర్చులకు ఉంచుకో అంటూ డబ్బులు ఇస్తాడు. తాను డ్రాప్ చేస్తానని చక్రి అంటున్నా కూడా వద్దన్న మహా.. కన్నాను తీసుకొని వెళ్తుంది.
మహా భయం పోగొట్టిన కన్నా
{{/usCountry}}రోడ్డుపై నడుస్తూ కూడా మహా ప్రాజెక్ట్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె కంగారు పడటం గమనించిన కన్నా ఏం జరిగిందని అడిగితే.. పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పాను కదా.. అందుకే కాస్త కంగారుగా ఉందని మహా అంటుంది. మీ భయాన్ని నేను పోగడతానంటూ కన్నా పాము పాము అంటూ అరుస్తాడు. ఎక్కడ అంటూ మహా భయంతో పరుగెత్తుతుంది. ఏమీ లేదు కావాలనే అలా అన్నాను అని కన్నా అంటాడు. దీంతో కన్నా చెవి పట్టుకొని మహా మెలేస్తుంది.
కానీ ఆమెలో టెన్షన్ పోతుంది. నువ్వు చెప్పిన విషయం నిజమే అని కన్నాను మెచ్చుకుంటుంది. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంతకంటే పెద్ద సమస్య వస్తే అంతకుముందుది అసలు సమస్యే కాదన్నట్లుగా అనిపిస్తుంది.. చిన్న గీత పక్కన పెద్ద గీత అంటూ కన్నా ఫిలాసఫీ చెప్పడంతో మహా మురిసిపోతుంది. కన్నా ఫ్రెండ్ రావడంతో అతడు బైకుపై వెళ్లిపోతాడు.
ఆటోలో ల్యాప్‌టాప్ మరచిపోయిన మహా
తర్వాత మహా ఆటోలో ఆఫీసుకు వెళ్తుంది. ఇంతలో దివ్య ఫోన్ చేసి ఎంత వరకూ వచ్చావని అడుగుతుంది. వస్తున్నానని, విక్కీ వచ్చాడా అని మహా అడుగుతుంది. ఇంకా రాలేదని, ప్రెజెంటేషన్ కు అంతా రెడీగా ఉందా అని దివ్య ఆరా తీస్తుంది. అంతా రెడీ అని, ప్రతి పాయింట్ ల్యాప్‌టాప్ లో పెట్టుకున్నానని చెప్పి మహా ఫోన్ పెట్టేస్తుంది.
ఆ తర్వాత ల్యాప్‌టాప్ తీసి మరోసారి ప్రెజెంటేషన్ గురించి మొత్తం చూసుకుంటుంది. తర్వాత ల్యాప్‌టాప్ పక్కన పెట్టి ఫోన్ చూస్తుంది. ఆఫీసు రాగానే ల్యాప్‌టాప్ మరచిపోయి దిగేస్తుంది. ఆటో అతడు తన దగ్గర స్కానర్ లేదని, క్యాష్ ఇవ్వాలని అంటాడు. అతనికి క్యాష్ ఇచ్చి వెళ్లిపోతుంది.
లక్కీపై మండిపడిన విక్కీ
ఆఫీసులోకి వెళ్లగానే లక్కీని పిలుస్తాడు విక్కీ. ప్రెజెంటేషన్ అంతా రెడీనే కదా అని అడిగితే.. రెడీగా ఉంది.. నేను చూసుకుంటాను అని అతనికి నమ్మకంగా చెబుతుంది. ఒకసారి చూద్దాం అని విక్కీ అడిగితే.. ల్యాప్‌టాప్ తీసుకురావడానికి వెళ్తుంది లక్కీ. కానీ అది బ్యాగులో కనిపించదు. దీంతో టెన్షన్ పడుతుంది. ఆటోలో మరచిపోయినట్లు తెలుస్తుంది. విక్కీ వచ్చి లక్కీ టెన్షన్ పడటం గమనిస్తాడు. ఏం జరిగిందని అడిగితే ఉన్న విషయం చెబుతుంది.
దివ్యకు ఫైల్ పంపలేదా, బ్యాకప్ లేదా అని అడుగుతాడు. కానీ అది కేవలం తన దగ్గరే ఉందని మహా అనడంతో ఆమెకు విక్కీ క్లాస్ పీకుతాడు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా.. నువ్వు ఏం చేస్తావో తెలియదు.. గంటలోగా ల్యాప్‌టాప్ నీ దగ్గర ఉండాలి.. క్లైంట్ మీటింగ్ పోస్ట్‌పోన్ చేయడం కుదరదు అని తేల్చి చెబుతాడు విక్కీ.
చక్రికి ఫోన్ చేసిన మహా
దీంతో మహాకు ఏం చేయాలో తోచదు. వెంటనే చక్రికి ఫోన్ చేస్తుంది. జరిగిన విషయం చెబుతుంది. ఆటో వివరాలు, డ్రైవర్ వివరాలు ఏమైనా ఉన్నాయా అని చక్రి అడుగుతాడు. కానీ అవేవీ లేవని మహా చెబుతుంది. ఆటో ఎక్కడ ఎక్కారు అని అడుగుతాడు. యూసుఫ్‌గూడ అని చెప్పడంతో సరే నేను చూసుకుంటాను.. మీరేమీ కంగారు పడకండి అని మహాకు ధైర్యం చెబుతాడు.
లక్కీని అవమానించిన విక్కీ
తర్వాత లక్కీ మళ్లీ ఆఫీసులోకి వెళ్తుంది. ల్యాప్‌టాప్ దొరికిందా అని విక్కీ అడిగితే.. వెతకడానికి పంపించాను అని లక్కీ చెబుతుంది. దీంతో విక్కీ మరింత కోప్పడతాడు. గంటలో ప్రెజెంటేషన్ పెట్టుకొని ఇప్పుడు వెతకడానికి పంపించడమేంటి.. అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావ్ అని మరోసారి తిడతాడు. మీటింగ్ పోస్ట్ పోన్ చేసే చాన్స్ ఉంటే చూడాలని లక్కీ అడిగినా.. అది కుదరదనే కదా నేను ఇంత కంగారు పడుతున్నాను అని విక్కీ అంటాడు.
అప్పుడే అతనికి క్లైంట్ కాల్ చేస్తాడు. అంతా రెడీగా ఉంది.. వచ్చేయమని విక్కీ చెబుతాడు. క్లైంట్ కూడా వచ్చేస్తున్నాడు.. అతడు చాలా పెద్ద క్లైంట్.. ఒకవేళ నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వకపోతే మన కంపెనీ పరువు పోతుంది అని లక్కీని అందరి ముందూ తిడతాడు. అతనికి మరో కొలీగ్ జత చేరి రెచ్చగొడతాడు. ఆమెను లక్కీ ఛార్మ్ అని అంటుంటావు కదా.. అందుకే కొమ్ములు వచ్చినట్లున్నాయని అంటాడు. దీంతో మహా కంటతడి పెడుతుంది.
మహా ల్యాప్‌టాప్ కోసం చక్రి తంటాలు
మరోవైపు మహా ల్యాప్‌టాప్ కోసం చక్రి తంటాలు పడుతుంటాడు. ఆమె ఆటో ఎక్కిన చోటుకి వెళ్లి ఆరా తీస్తాడు. కానీ ఆటో వివరాలు, డ్రైవర్ వివరాలు లేకపోవడంతో వెతకడం కష్టమవుతుంది. అతనికి మహా మళ్లీ ఫోన్ చేస్తుంది. ఇంకా దొరకలేదని చక్రి అంటాడు. ఆటో రోజు ఎక్కినట్లే ఫ్రూట్ షాపు ముందే ఎక్కారా అని అడుగుతాడు. అవును అని మహా చెప్పడంతో ఆ షాపులో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి.. వాటిని చూస్తే ఆటో నంబర్ తెలుసుకోవచ్చు అని చక్రి అనుకుంటాడు.
మహాను కాపాడిన చక్రి.. మహా హగ్
సరిగ్గా సమయానికి ల్యాప్‌టాప్ తీసుకొచ్చి మహా చేతుల్లో పెడతాడు చక్రి. ఆమె వెంటనే వెళ్లి ప్రెజెంటేషన్ ఇస్తుంది. అది చాలా బాగా రావడంతో క్లైంట్ మెచ్చుకుంటాడు. విక్కీ కూడా కంగ్రాట్స్ చెబుతాడు. కానీ లక్కీ అతన్ని దూరం పెట్టేస్తుంది. విక్కీని పట్టించుకోకుండా బయటకు వెళ్లి చక్రికి హగ్ ఇస్తుంది. దీంతో అతని ముఖం వెలిగిపోతుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHOR
హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.