...
...
Next Story

Podarillu November 2 Episode: పొదరిల్లు- చక్రికి 50 శాతం డిస్కౌంట్ టార్చర్-గుడిలో పాప ప్రక్షాళన-అరచేతిలో హారతితో ప్రమాణం

Podarillu Serial November 3rd Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 3వ ఎపిసోడ్‌‌లో చక్రిని భర్తగా స్వీకరిస్తున్నట్లు, ఐ లవ్యూ అని ప్రపోజ్ చేస్తుంది మహాలక్ష్మి. కారులో వెళ్తుంటే ఇద్దరు అమ్మాయిలు ఎక్కుతారు. చక్రి పులిహార విషయాలు బయటపెడతారు. సత్యను కలిసిన కన్నా కసురుకున్నందుకు క్షమించమంటాడు.

Published on: Nov 3, 2026, 08:46:21 IST
Advertisement

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీరే నా భర్త అని ఫిక్స్ అయ్యాను. ఇకపై మీరే నా సర్వస్వం అండి. మిమ్మల్ని నా భర్తగా అంగీకరిస్తున్నాను. ఐ లవ్యూ చక్రి అని మహాలక్ష్మి ప్రపోజ్ చేస్తుంది. దాంతో చక్రి ఊహల్లో తేలిపోతాడు. ఇకనుంచి చక్రి హస్పండ్ ఆఫ్ మహాలక్ష్మి అయిపోయాడోచ్ అని మహాను సంతోషంగా హగ్ చేసుకుంటాడు.

చక్రికి ఐ లవ్యూ చెప్పిన మహాలక్ష్మి

పొదరిల్లు సీరియల్ నవంబర్ 3 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ నవంబర్ 3 ఎపిసోడ్

ఇంతలో విక్కీ వచ్చి నాకు కదా ఐ లవ్యూ చెప్పాలని లాక్కెళ్తాడు. అది నా పిల్లరా అంటూ చక్రి అరుస్తాడు. అదంతా డ్రీమ్ అని గిల్లి చూసుకుంటాడు చక్రి. విక్కీ, లక్కీ కలిసి వస్తారు. విక్కీ హాయ్ అంటే బై అని చక్రి అంటాడు. అలా చెబుతారేంటని మహా అంటే.. శత్రువులకు అలాగే చెప్పాలని చక్రి అంటాడు. ఏంటని మహా అడిగితే.. సూట్ వేసుకున్నవాళ్లకని చక్రి కవర్ చేస్తాడు.

స్కూటి పాడైపోయింది, క్యాబ్ బుక్ కావట్లేదు. అందుకే అర్జంట్‌గా రమ్మన్నాను అని మహాలక్ష్మి చెబుతుంది. దాంతో అనుకుంది జరగలేదని చక్రి నిరాశపడతాడు. మహా, చక్రి కారులో వెళ్లిపోతారు. దారిలో ఇద్దరు అమ్మాయిలు లిఫ్ట్ అడుగుతారు. వాళ్లను చూసి చక్రి మనం వేసిన బిస్కెట్లు బయటపడతాయని భయపడతాడు. హాయ్ చెర్రీ, హ్యాండ్సమ్ లిఫ్ట్ కావాలి. కావాలంటే పే చేస్తామని అంటారు.

చక్రి కుదరదని అంటాడు. మహా కుదురుతుంది అంటుంది. ఇద్దరు అమ్మాయిలు కారు ఎక్కుతారు. ఇంతకుముందు చక్రి మాట్లాడిన రొమాంటిక్ మాటల గురించి చెబుతారు. మీ పక్కన కూర్చుంది మీ వైఫ్ కాదుగా అని వాళ్లు అడిగితే.. ఛీ ఛీ అతను నా హస్పండ్ ఏంటీ, నాకు అంత బ్యాడ్ టేస్ట్ లేదు అని మహా చీదరించుకుంటుంది.

రెండు షిఫ్టులతో ప్రేమించుకోండి

అదేంటీ ఇంతకుముంది పెళ్లి కానీ అమ్మాయిలకు 50 శాతం డిస్కౌంట్ ఉండేది కదా. 150 రూపాయలేగా అని వాళ్లు అంటారు. దాంతో చక్రి కారు ఆపి నేను వెళ్లేది వేరే రూట్. నా రూట్ మారితే ఫేట్ మారుతుందని ఆ అమ్మాయిలను దించేస్తాడు చక్రి. మహాతో మాట్లాడుదామని చక్రి చూస్తే మీరు నోరు.. అని ఆపుతుంది. సగమే తిట్టారేంటని చక్రి అడిగితే.. 50 శాతం డిస్కౌంట్ అని మహా అంటుంది.

తిట్లలో కూడా మహా 50 శాతం డిస్కౌంట్ పెట్టిందన్నమాట. మరోవైపు బస్టాప్ దగ్గర సత్యను కన్నా పలకరిస్తే పట్టించుకోదు. డ్రెస్ చాలా బాగుందని, ఏది మాట్లాడిన సత్య మాట్లాడదు. కన్నా అలిగి వెళ్లినపోయినప్పుడు కోప్పడిన విషయం చెప్పి అలగుతుంది సత్య. ఇంకా ఎవరిని జీవితంలో సాయం చేస్తానని అడగను. అన్న మాటలకు రాత్రి నిద్ర కూడ పట్టలేదని సత్య అంటుంది.

సత్యను నవ్వించిన కన్నా

కన్నా సారీ చెబుతాడు. అయిన హర్ట్ అయిన సత్య కాలేజ్‌లో కూడా మాట్లాడకు అని సత్య అంటుంది. కన్నా చాక్లెట్ ఇస్తాడు. సత్య తీసుకోదు. నీలా కసురుకునేవాళ్లతో ఫ్రెండ్షిప్ చేయనని సత్య అంటుంది. నేనేమైనా ఆంగ్రీ బర్డ్‌నా ప్రతిసారి మూతి ఇలా పెట్టుకుని ఉండటానికి అని కన్నా అంటాడు. దాంతో సత్య నవ్వుతుంది. కోపం పోయిందా అని కన్నా అడిగితే లేదు.. కానీ, అడుగుతుంటే జాలేస్తుందని సత్య అంటుంది.

పోనీ ఫ్రెండ్స్‌లా ఉందామా. ఇంకెప్పుడైనా నేను బ్యాడ్ మూడ్‌లో ఉంటే కసురుకోకుండా ఉండేందుకు, నేనేమైనా అన్నా నువ్వు ఫీల్ అవ్వకుండా ఉండేందుకు అని కన్నా అంటాడు. దానికి సరేనని చాక్లెట్ తీసుకుంటుంది సత్య. అలా కన్నా, సత్య ఫ్రెండ్స్ అవుతారు. ట్యాక్సీలో వచ్చినందుకు చక్రికి రూ. 150 డబ్బు ఇస్తుంది. క్యాబ్ డ్రైవర్‌లా చూస్తుంది.

మీరు 50 శాతం డిస్కౌంట్ ఇస్తారుగా. ఇంకేమైనా ఉన్నాయా అని సెటైర్లు వేస్తుంది మహా. నేను పెళ్లి కోసం చూశాను కానీ రిలేషన్ కోసం కాదండని చక్రి అంటాడు. అయినా వినకుండా కోపంగా వెళ్తుంది మహా. చక్రి, కేశవ ఉంటారు. కోపంగా చూసి వెళ్తుంది. రేయ్ ఏంట్రా కంటిచూపుతోనే మసి చేసేంతలా చూసి వెళ్లిందని కేశవ అడుగుతాడు.

చక్రికి 50 శాతం డిస్కౌంట్ నరకం

జరిగింది అంతా చెబుతాడు చక్రి. అంతా భోజనానికి కూర్చుంటారు. చపాతి వేయనా చక్రి అని మాధవ అంటే.. చ అంటే చాలు పెద్ది అని మహా అంటుంది. అదేంటమ్మా 50 శాతం డిస్కౌంట్ అని తనకు తెలియకుండానే సెటైర్ వేస్తాడు మాధవ. చక్రికి సగం చపాతి వేసి 50 శాతం డిస్కౌంట్ అని మహా అంటుంది. అమ్మాయిలతో చక్రి వేసే వేశాల గురించి మహా చెబుతుంది.

మీకెవరికి ట్రైనింగ్ ఇవ్వలేదా అని మహా అంటే.. కేశవ అన్నయ్యకు ఇచ్చినట్టు ఉన్నాడని కన్నా అంటాడు. కేశవ బెదిరిస్తే.. కేశవను మహా బెదిరిస్తుంది. చక్రికి కూర కూడా 50 శాతం డిస్కౌంట్‌తో వేయిస్తుంది మహా. చక్రికి 50 శాతం డిస్కౌంట్‌తో టార్చర్ చూపిస్తుంది మహా. తర్వాతి రోజు చక్రికి పూజ ఉందని మహా అంటే.. బడిత పూజ అని మాధవ అంటాడు.

చక్రి పాప ప్రక్షాళన

చక్రికి పంచెకట్టి, బొట్టు పెట్టి గుడికి తీసుకెళ్తారు. చక్రికి పాప ప్రక్షాళన పూజ చేయించాలని, అలాగే ప్రమాణం చేయించాలని తీసుకొచ్చామని పంతులుకు చెబుతుంది మహాలక్ష్మి. చక్రి చేతిలో హారతి కర్పూరం పెట్టి హారతి వెలిగించుకుని ప్రమాణం చేయాలని పంతులు అంటాడు. దాంతో చక్రి భయపడిపోతాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks