Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నారాయణ బీడులు తీసుకుని వెళ్తుంటే కన్నా ఆపి మా అమ్మ ఏదని అడుగుతాడు. నాకేం తెలుసు. ఏమైందని నారాయణ అడుగుతాడు. పొద్దున్నుంచి కనిపించట్లేదని మాధవ చెబుతాడు. పొద్దున్నుంచి కాదు. నాలుగు గంటలకే నిద్రలేచాను. అప్పటినుంచి కనిపించట్లేదని మహా అంటుంది.
అమ్మను దొంగ అంటున్నావా

రేయ్ ఇంట్లో ఏమైనా పోయాయేమో చూడండ్రా. రేయ్ నీ డబ్బు ఎక్కడ పెట్టావని కేశవను అంటాడు నారాయణ. అంటే ఏంటీ మా అమ్మను దొంగ అంటున్నావా అని కన్నా కోప్పడతాడు. అది పోతే దరిద్రం పోయినట్లే కానీ పోతు పోతూ ఏమైనా తీసుకెళ్లిందో చూడండి అని నారాయణ అంటాడు. మర్యాదగా మాట్లాడు. నువ్వే ఏదో చేశావ్. అమ్మను ఏం చేశావ్ అని నారాయణ పీక పట్టుకుంటాడు కన్నా.
అంతా ఆపుతారు. నీకేమైనా తెలుసా అని చక్రి అడుగుతాడు. అది ఒకచోట కుదురుగా ఉండే ఆడదే కాదు. ఇంటి ఇల్లాలిగా, బిడ్డకు తల్లిగా గౌరవంగా బతికే ఆడది కానేకాదు. దాని గురించి వదిలేసి మీ పని మీరు చూసుకోండని నారాయణ అంటాడు. దాంతో నారాయణ కాలర్ పట్టుకుని ఏం చేశావ్ రాత్రి అని నిలదీస్తాడు. చంపాలనుకుంటే వచ్చిన రోజే చంపేవాన్నని నారాయణ అంటాడు.
దాంతో మరింత కోప్పడతాడు కన్నా. మహా వచ్చి ఆపుతుంది. ఇందులో ఆయనకు ఏం సంబంధం లేదని మహా అంటే.. ఇతని గురించి నీకు తెలియదని కన్నా అంటాడు. నీకు మీ అమ్మ గురించి తెలుసా. పాలు తాగే వయసులోనే వెళ్లిపోయింది. ఇప్పుడు వెళ్లిపోదా. అంత సెంటిమెంట్ ఉన్న తల్లి ఇదే ఊరిలో ఉండి నిన్ను చూసేందుకు ఎందుకు రాలేదు. ఇందులో మీ నాన్నకు ఎలాంటి సంబంధం లేదని మహాలక్ష్మి అంటుంది.
పగిలిన కన్నా గిఫ్ట్
అన్నయ్య అమ్మ లేకపోవడం ఏంటి. అమ్మ వెళ్లిపోవడం ఏంటని కన్నా ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతాడు. ఈసారి కన్నా మనసు ముక్కలు చేసి వెళ్లిపోతే వాడు తట్టుకోగలడా అని నారాయణ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది మహా. తల్లికి తను ఇచ్చిన గిఫ్ట్ ముక్కలవడం చూసి కన్నా షాక్ అవుతాడు. ముక్కలైన గిఫ్ట్ తీసుకుని మరింత కుమిలిపోతాడు.
{{/usCountry}}అన్నయ్య అమ్మ లేకపోవడం ఏంటి. అమ్మ వెళ్లిపోవడం ఏంటని కన్నా ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతాడు. ఈసారి కన్నా మనసు ముక్కలు చేసి వెళ్లిపోతే వాడు తట్టుకోగలడా అని నారాయణ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది మహా. తల్లికి తను ఇచ్చిన గిఫ్ట్ ముక్కలవడం చూసి కన్నా షాక్ అవుతాడు. ముక్కలైన గిఫ్ట్ తీసుకుని మరింత కుమిలిపోతాడు.
{{/usCountry}}దాన్ని తీసుకురాడానికి మళ్లీ ప్రయత్నించకండని నారాయణ వెళ్లిపోతాడు. తర్వాత కన్నాతో చక్రి, మహా కారులో వెళ్తారు. కన్నాను నవ్వమంటే ఏడవాలనుందని అంటాడు. వీళ్ల అమ్మ వేరు మా అమ్మ వేరు అనేది జీర్ణించుకోడానికే నాకు చాలా రోజులు పట్టింది. నాకోసం అమ్మ వచ్చిందనగానే మాటల్లో చెప్పలేని సంతోషం. గదిలోకి వెళ్లి డ్యాన్సు చేశాను. కాలేజీలో నా ఫ్రెండ్స్ అందరికి అమ్మ వచ్చింది. నన్ను వదిలి వెళ్లలేదు. కాలేజీకి అమ్మను తీసుకొస్తాను అని పందెం కూడా వేశానని కన్నా చెబుతాడు.
ఇప్పుడు ఎవరిని తీసుకెళ్లాలి వదినా. ఎవరినిపడితే వాళ్లను అమ్మ అనలేనుగా. చాలా ఏడుపొస్తుంది వదినా. అమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోయింది అని ఏడుస్తుంటాడు కన్నా. చక్రి, మహా ఓదార్చడానికి ప్రయత్నించినా కన్నా వినడు. నారాయణను నిందిస్తాడు. తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా అని మహా అంటుంది. అమ్మ పాతిల్లు అడ్రస్ తెలుసుగా నీకు. అక్కడికి వెళ్లి చూద్దామా అని కన్నా అంటాడు.
కన్నా తల్లి పెద్ద మోసగత్తే
నాకు తెలియదురా. బయట మాత్రమే చూశాను అని మహా అంటుంది. చక్రిని అడుగుతాడు కన్నా. చక్రి చెప్పబోతుంటే మహా ఆపి అతనికి కూడా తెలియదురా అని కవర్ చేస్తుంది. కన్నాను కాలేజీలో డ్రాప్ చేస్తారు. ఏం ఆలోచించకుండా చక్కగా చదువుకోమ్మని మహా చెబుతుంది. కన్నా వెళ్లిపోతాడు. కన్నా ఇంటి అడ్రస్ తెలియదని అబద్ధం ఎందుకు చెప్పారని చక్రి అడుగుతాడు.
వాళ్ల అమ్మ కన్నాగాడి కోసం రాలేదు. డబ్బుకోసం వచ్చింది. పెద్ద మోసగత్తే. కన్నావాళ్ల అమ్మ పెద్ద దొంగ అని రాత్రి జరిగింది అంతా చెబుతుంది మహాలక్ష్మి. నాకెందుకు చెప్పలేదని చక్రి అడిగితే.. కన్నా తల్లి మోసగత్తే అని తెలిస్తే వాడు తట్టుకోగలడా అని మహా అంటుంది. సుపుత్రుడు ఆవిడను అసహ్యించుకోడానికి, ఆవిడ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోడానికి పెద్ద కారణం ఉందనిపిస్తుందని, అది తెలుసుకోవాలని మహా అంటుంది.
జమున ఇంటికి చక్రి, మహా వెళ్తారు. కానీ, ఇంటికి తాళం వేసి ఉంటుంది. దొంగ అని తెలియగానే ఎక్కడికో జంప్ అయినట్లుందని చక్రి అంటాడు. మరోవైపు మాధవకు భోజనం తీసుకొస్తుంది మనీషా. ఏం తీసుకొచ్చావ్ అని మాధవ అడిగితే.. మనీషా గెస్ చేయమంటుంది. మనీషా వాళ్లు తినే కర్రీస్ అన్నీ చెబుతాడు. ఇవన్నీ ఎలా తెలుసని మనీషా ప్రేమగా చూస్తూ అడుగుతుంది.
స్టైలిష్ శైలు మెకానిక్ షాప్
ఇష్టమైనవాళ్లకు ఏం ఇష్టమే తెలుసుకోవాలిగా. తెలియడమే కాదు వండటం కూడా నేర్చుకున్నా అని మాధవ అంటాడు. ఇంతలో బన్సీ వస్తాడు. కన్నా తల్లి గురించి మాట్లాడుకుంటారు. ఏరోజు వాడికి తల్లి లేదన్న లోటు కనిపించేది కాదు. కానీ, ఇప్పుడు మాత్రం అమ్మ కోసం పరితపిస్తున్నాడు. పాలకోసం ఏడ్చే బిడ్డలా ఏడుస్తున్నాడు. సాయంత్రం వరకైనా ఆమె వస్తే బాగుండు అని మాధవ అంటాడు.
కచ్చితంగా వస్తుందని మనీషా అంటుంది. మరోవైపు కేశవ దగ్గరికి శైలు వస్తుంది. కేశవకు సారీ చెబుతుంది. తప్పు తెలుసుకుని వచ్చి సారీ చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పమని కేశవ అంటాడు. ఇద్దరు గొడవ పడతారు. అసిస్టెంట్ వస్తే నేమ్ బోర్డ్ గురించి అడుగుతాడు కేశవ. స్టైలిష్ శైలు మెకానిక్ షాప్ అని పెట్టమని శైలు చెబుతుంది. దాంతో కేశవ నవ్వుతాడు.
కన్నా వాళ్ల అమ్మ వెళ్లిపోయిందటగా. నిజమేనా అన్నా అని అసిస్టెంట్ అడుగుతాడు. నిజమేరా అని కేశవ అంటాడు. తర్వాత ఇంట్లో మళ్లీ తల్లి కోసం ఏడుస్తాడు కన్నా. అమ్మను తీసుకొచ్చిన నువ్వే మళ్లీ వస్తుందని కచ్చితంగా ఎందుకు చెప్పట్లేదని కన్నా అడుగుతాడు. ఇంతలో నారాయణ వస్తే మళ్లీ మా అమ్మను చంపేశావ్ అని గొడవ పడతాడు కన్నా.
మహాను నిలదీసిన కన్నా
ఈసారి కేశవ కూడా నువ్వే ఏదో చేశావని అంటాడు. ఇందులో ఆయనకు ఏ సంబంధం లేదని మహా అంటుంది. నీకు అంతా కచ్చితంగా ఎలా తెలుసు వదినా నారాయణ కారణం కాదని. నిజం చెప్పమని కన్నా నిలదీస్తాడు. మీకేమైనా తెలుసా అని పెద్ది అడుగుతాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.