...
...
Next Story

Podarillu October 6 Episode: పొదరిల్లు- మాధవకు మనీషా సేవలు- మహాకు 25 కోట్ల ప్రాజెక్ట్- కన్నా తల్లిని గెంటేసిన రెండో భర్త

Podarillu Serial October 6th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 6వ ఎపిసోడ్‌‌లో కన్నా తల్లి జమునను రెండో భర్త ముఖేష్ గెంటేస్తాడు. నీవల్లే నాకు శని పట్టుకుందని తిడతాడు. అప్పులతను వచ్చి ముఖేష్‌కు ఒకరోజు గడువు ఇస్తాడు. నారాయణ ఇంటికెళ్లిన మనీషా మాధవకు సేవలు చేస్తుంది. రోజంతా అక్కడే ఉండిపోతుంది.

Published on: Oct 6, 2026, 09:52:16 IST
Advertisement

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కన్నా తల్లిని తండ్రి గెంటేస్తాడు. సామాన్లన్నీ బయటపడేస్తాడు. నిన్ను అప్పులు చేసి మేపే రోజులు పోయాయని కన్నా తల్లి అంటుంది. నిన్ను పెళ్లి చేసుకున్నాకే ఇలా అయ్యాను. అప్పటివరకు చేతినిండా డబ్బు ఉండేదని రెండో భర్త అంటాడు.

డబ్బు సంపాదించడానికి చాలా దారులు

పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 6 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 6 ఎపిసోడ్

డబ్బు సంపాదించడానికి చాలా దారులున్నాయి. నీకు చేతకాక నన్ను అంటావ్. కిలో బియ్యమైనా తెచ్చావా అని భర్తను తిడుతుంది కన్నా తల్లి. ఫుట్‌పాత్ మీద బతికేవాళ్లు కూడా ఇలా బతకరు అని కన్నా తల్లి జమున అంటుంది. నీ బతుకు నువ్వు నా బతుకు నేను బతుకుతా వెళ్లిపో అని లోపలికి వెళ్తాడు భర్త. ఇంతలో ఒకతను వచ్చి భర్త గురించి అడుగుతాడు.

రేయ్ ముఖేష్ బయటకురా. కష్టపడి పనిచేసి ఇల్లు నడపాలి. అప్పులు తీర్చాలని అతను అంటాడు. నా జాతకంలో దోషం ఉంది. 2 వేలతో పూజ చేయిస్తే పోతుంది. రెండు వేలు ఇవ్వండని అడుగుతాడు ముఖేష్. చెప్పుతీస్తాను. ఇంకా నీ వెధవవేశాలు నమ్ముతాననుకుంటావా. నా అసలు వడ్డీ కట్టు అని అప్పులతను అంటాడు. మళ్లీ జాతకం, దోశాలు, రాహు కేతు అని అంటాడు ముఖేష్.

బనియన్ పట్టుకుని రేపటిలోపు నాలుగు నెలల వడ్డీ కట్టాలి, వారంలోపు అసలు కట్టు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. పెళ్లాం మీద కాదు ప్రతాపం ముందు అప్పు ఎలా తీర్చాలో చూడు అని తిడుతుంది జమున. నిన్ను చేసుకున్నాకా ఏలినాట శని పట్టుకుందని ముఖేష్ అంటాడు. ఈ దిక్కుమాలిన కాపురం నావల్ల కాదు ఏం చేయాలో ఏమో అని జమున ఆలోచిస్తుంది.

మాధవకు మనీషా సేవలు

సరేనని బయటకు వెళ్తుంది. ఏం చెప్పావురా అని కేశవ అడుగుతాడు. ఐ లవ్యూ అన్నా. తను ఐ లవ్యూ 2 చెప్పిందని చక్రి అంటాడు. కేశవ, కన్నా నమ్మరు. ఇంతలో మనీషా వస్తుంది. సచ్చా ఆద్మీకి కాలు బెణికిందని భాయ్ చెప్పాడు అని మాధవ గురించి అడుగుతుంది మనీషా. లోపల ఉన్నాడని పంపిస్తారు. మనీషా వెళ్తుంది. చక్రి వాళ్లంతా తొంగి చూస్తారు.

మాధవ కాలికి ఆయిల్ రాస్తుంది మనీషా. కన్నా వెళ్లి జావ ఇస్తాడు. మాధవ, మనీషా ఇబ్బందిపడతారు. కన్నాను లాక్కెళ్తాడు చక్రి. అన్నయ్య కాలు నొప్పి తగ్గిపోగానే పెళ్లి చేయాలని చక్రి అంటాడు. ఫోన్ చార్జింగ్‌లో పెట్టా. శైలు కాల్ లిఫ్ట్ చేయకుంటే చంపేస్తుందని లోపలికి వెళ్లి ఫోన్, చార్జర్ తెచ్చుకుంటాడు కేశవ. మాధవను ప్రేమగా, రొమాంటిక్‌గా చూస్తుంది మనీషా.

రొమాంటిక్‌గా మాధవ, మనీషా

ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. ఇంతలో నారాయణ వచ్చి నా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ బార్‌లో ఇస్తున్నాడు. షర్ట్‌కు బత్తాలు పోయాయి. కుట్టుకోవాలని అంటాడు. వీళ్లు కుడతారని మహా అంటుంది. మాకు కుట్టడం రాదని చక్రి అంటాడు. మర్యాదగా బటన్స్ కుట్టి ఇవ్వండని మహా అంటుంది. దాంతో కేశవ కుటడతాడు. కానీ సరిగా రాదు.

కన్నాకు ఇచ్చి కుట్టమంటాడు కేశవ. కన్నా బటన్స్ కుట్టి ఇస్తాడు. కానీ, బటన్స్ రివర్స్ అవుతాయి. ఏంట్రా ఇది అని నారాయణ అడిగితే.. కొంచెం కుండ కనిపిస్తుందని మహా అంటుంది. ఏదోక డ్రెస్ వేసుకుని వెళ్లు అని కేశవ అంటాడు. దాంతో వేరే షర్ట్ వేసుకుంటాడు నారాయణ. లోపలికి ఎందుకు వెళ్లనివ్వట్లేదని నారాయణ అడిగితే.. లోపల ప్రేమ పావురాలు ఉన్నాయని కేశవ అంటాడు.

వాళ్లను చూసి సంతోషంగా నవ్వుతూ వెళ్లిపోతాడు. ఇంతలో బన్సీ వస్తాడు. బన్సీ వచ్చింది మాధవకు చెబుతారు. మనీషా ఉదయం 9 గంటలకు వచ్చింది. ఇప్పుడు రాత్రి 10 అయింది అని బన్సీ అంటాడు. జావో జావో.. వెళ్లు అని చక్రి అంటాడు. దాంతో మనీషా వెళ్లిపోతుంది. అంతా చూస్తే మాధవ సిగ్గుపడతాడు. ఒకరికి తెలుగు రాదు ఇంకొకరికి హిందీ రాదు పొద్దున్నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడుకుని ఉండుంటారు అని చక్రి అంటాడు.

మహాకు 25 కోట్ల ప్రాజెక్ట్

దానికి అంతా నవ్వేస్తారు. మరుసటి రోజు ఉదయం ఆఫీస్‌లో విక్కీ రమ్మన్నాడని మహా కలుస్తుంది. మన కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. 24 వేల స్క్వైర్ ఫీట్స్ లగ్జరీ ప్యాలెస్ కట్టడానికి డిజైన్ ఇవ్వాలి. దీని విలువ రూ. 25 కోట్లు. ఇంత భారీ ప్రాజెక్ట్ రావడం ఇదే తొలిసారి. నువ్వు ఇలా మా కంపెనీలో అడుగుపెట్టావో లేదు ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయని విక్కీ అంటాడు.

నిజంగానే నువ్వు నా లక్కీ చామ్ అని విక్కీ అంటాడు. మనందరం కష్టపడితే ఇలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయని మహా అంటుంది. నీకో గుడ్ న్యూస్. ఈ భారీ ప్రాజెక్ట్ డిజైన్ చేసే బాధ్యత నీకే ఇస్తున్నా. నీ బెస్ట్ ఇవ్వు అని చెబుతాడు విక్కీ. దాంతో సంతోషంగా వెళ్తుంది మహాలక్ష్మీ. సంతోషంగా ఉన్నావ్. విక్కీ ఏమైనా ముద్దు పెట్టాడా ఏంటీ అని దివ్య అంటుంది.

దొరికిన కన్నా తల్లి అడ్రస్

దాంతో మహా వారిస్తుంది. తనకు ఇచ్చిన ప్రాజెక్ట్ గురించి చెబుతుంది. తర్వాత కన్నా తల్లి జమనును తన భర్త ముకేష్‌తో ఉండటాన్ని చూస్తాడు చక్రి. మహాకు కాల్ చేసి కన్నా తల్లి అడ్రస్ దొరికిందని చెబుతాడు. దాంతో యాహూ అని ఆఫీస్‌లోనే అరిచేస్తుంది మహా. కేశవకు కూడా ఇదే విషయం చెబుతాడు చక్రి. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks