...
...
Next Story

Podarillu September 19 Episode: పొదరిల్లు.. నార్త్ ఇండియా అమ్మాయి సౌతిండియా కోడలు.. బృందావనంలో పండగ.. నిజం తెలియడంతో..

Podarillu Serial September 19th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 19 ఎపిసోడ్ లో మాధవకు తమ్ముళ్లు కాపలా కాస్తారు. అయితే చివరికి నార్త్ ఇండియా అమ్మాయి సౌతిండియా కోడలు కాబోతోందన్న నిజం చక్రి తెలుసుకోవడంతో బృందావనంలో ఆనందం వెల్లివిరిసింది.

Published on: Sep 19, 2026, 06:51:38 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మాధవ మళ్లీ ఎక్కడ ఇల్లు వదిలి వెళ్లిపోతాడో అనే ఆందోళన తమ్ముళ్లలో కనిపించింది. మాధవ వింత ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఆ ప్రవర్తన వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చక్రి తెలుసుకుంటాడు. తమ్ముళ్లందరూ కలిసి అతన్ని ఆట పట్టిస్తారు.

గదిలోకి వెళ్లి తలుపేసిన చక్రి.. పెద్ది గురించి చెప్పి షాకిచ్చిన మహాలక్ష్మి

Podarillu September 19 Episode: పొదరిల్లు.. నార్త్ ఇండియా అమ్మాయి సౌతిండియా కోడలు.. బృందావనంలో పండగ.. నిజం తెలియడంతో..
Podarillu September 19 Episode: పొదరిల్లు.. నార్త్ ఇండియా అమ్మాయి సౌతిండియా కోడలు.. బృందావనంలో పండగ.. నిజం తెలియడంతో..

చక్రిని మహాలక్ష్మి గదిలోకి పిలవడంతో అతడు ఏదో ఊహించేసుకొని పర్ఫ్యూమ్ కొట్టుకొని మరీ రెడీ అయిపోయే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 19) ఎపిసోడ్ మొదలైంది. చక్రి చేసే ఓవరాక్షన్ చూసిన మహా.. అతన్ని తిట్టి లోనికి పిలుస్తుంది. ఆనందంగా లోనికి వెళ్లిన చక్రిని బయట ఎవరూ లేరు కదా అని మహా అడుగుతుంది. దీంతో అతడు మరింత సంతోషిస్తాడు. తలుపేయమని చెప్పడంతో చక్రి మేఘాల్లో తేలిపోతుంటాడు.

ఇప్పుడు మనం ఏం మాట్లాడినా బయటకు వినిపించదు కదా అని మహా అంటుంది. వినిపించదు అని చక్రి అంటాడు. అప్పుడు మెల్లగా పెద్ది గురించి చెబుతుంది. అప్పుడు జ్యోతిష్యుడు చెప్పిన మాట విని ఇల్లు వదిలేసి వెళ్లాడు.. ఇప్పుడు మళ్లీ బాధలో అలాంటి పని ఎక్కడ చేస్తాడో అని కంగారుగా ఉంది అని మహా అంటుంది. ఇది చెప్పడానికే గదిలోకి పిలిచారా అని చక్రి అడుగుతాడు. అవును అని ఆమె చెప్పడంతో చక్రి ఉసూరుమంటాడు. పెద్దిపై ఈ రాత్రికి ఓ కన్నేసి ఉంచండి అని చెప్పి బయటకు పంపిస్తుంది.

పెద్దిపై కన్నేసి ఉంచిన చక్రి..

ఎందుకు అని అడిగితే.. అన్నయ్య మళ్లీ ఎక్కడ ఇల్లు వదిలి వెళ్లిపోతాడో అని కంగారుగా ఉంది.. వచ్చినప్పటి నుంచీ బాధగా ఉంటాడనుకుంటే ప్రతిదానికీ నవ్వుతున్నాడు.. నాకు ఏదో తేడా కొడుతోంది.. ఇంతకుముందు ఇలాగే ఇల్లు వదిలి వెళ్లాడు.. ఇప్పుడు అలా చేయకుండా ఉండాలంటే మనం ఈ రాత్రంతా కాపలా కాయాలని చెబుతాడు.

డ్యూటీలు వేసుకొని కాపలా

ఆ తర్వాత అసలు మాధవ నిజంగానే పడుకున్నాడా లేదో అని ముగ్గురూ అనుకుంటారు. కన్నా వెళ్లి శ్వాస చూసి వస్తాడు. తర్వాత ముగ్గురూ బయటకు వెళ్లి మాట్లాడుకుంటారు. ఈ రాత్రంతా మనం కాపలా కాయాలి అని చక్రి చెబుతాడు. నువ్వే పెద్దవాడివి కదా ముందు నువ్వే ఉండు అని కన్నా, కేశవ అంటారు. కానీ చక్రి మాత్రం కేశవను బుక్ చేస్తాడు. రాత్రి 1.30 వరకు నువ్వు ఉండు.. ఆ తర్వాత నన్ను లేపు అని అంటాడు. అప్పుడు నువ్వు లేవకపోతే ఎలా అని కేశవ అడిగితే.. 24 గంటలూ అలెర్ట్ గా ఉంటానంటూ అతన్ని తిడతాడు.

కేశవకు హ్యాండిచ్చిన చక్రి.. బయటి నుంచి గడియ పెట్టిన కేశవ

ఆ తర్వాత కేశవ కాపలా మొదలవుతుంది. చక్రి, కన్నా పడుకుంటారు. మాధవ ఎక్కడికీ వెళ్లకుండా కేశవ కాపలా కాస్తుంటాడు. అలా అలా మెల్లగా రాత్రి 1.30 అవుతుంది. చక్రిని లేపడానికి ట్రై చేస్తే అతడు లేవడు. అటు కన్నాను కూడా లేపడానికి కేశవ ప్రయత్నిస్తాడు. కానీ అతడూ హ్యాండిస్తాడు. దీంతో కేశవకు ఏం చేయాలో పాలుపోదు. బయటకు వెళ్లి తాళం వేస్తే అన్నయ్య వెళ్లడు కదా అనుకొని వెళ్లి బయటి నుంచి డోరు లాక్ చేస్తాడు.

ఉదయాన్నే మాధవ లేచి డోరు తెరవడానికి ప్రయత్నిస్తే తెరుచుకోదు. దీంతో వెనుక నుంచి వెళ్లి చూస్తే కేశవ బయట డోరు దగ్గర పడుకొని ఉండటం చూసి అతన్ని లేపుతాడు. ఆ తర్వాత చక్రి, కన్నా కూడా నిద్రలో నుంచి లేచి మాధవ, కేశవ కనిపించకపోవడంతో కంగారు పడుతూ బయటకు వస్తారు. ఇద్దరూ కలిసి కేశవను తిడితే.. మీరే హ్యాండిచ్చారంటూ అతడు తిడతాడు. అసలేం జరుగుతోందని మాధవ అడిగితే.. మళ్లీ నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడ వెళ్లిపోతావో అని కంగారుతో రాత్రంతా కాపలా కాయాలని నిర్ణయించుకున్నామని చక్రి చెప్పడంతో పెద్ది షాక్ తింటాడు.

పెద్ది, మనీషా విషయం తెలుసుకున్న చక్రి

ఆ తర్వాత బన్సీ ఇంటికి వెళ్తాడు చక్రి. మీ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచీ మా అన్నయ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు.. అసలేమైందో ఏంటో అని చక్రి అంటాడు. ఏం కాలేదు.. మా మనీషాను పెళ్లి చేసుకుంటావా అని అడిగాం అంతే అని బన్సీ చెబుతాడు. అది విన్న చక్రి ఏంటీ.. నార్త్ ఇండియా అమ్మాయి సౌతిండియా కోడలు కాబోతోందా అని సంతోషిస్తాడు. వెంటనే ఇంటికి వెళ్లి అసలు విషయం అందరికీ చెబుతాడు. తమ్ముళ్లందరూ కలిసి మాధవను ఆట పట్టిస్తారు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks