...
...
Next Story

Podarillu September 1 Episode: పొదరిల్లు- రాఖీ కట్టిన మహా, నోరు జారిన ఆది- చక్రి ప్లాన్ రివర్స్- చక్రి కొత్త లవర్ గోపిక

Podarillu Serial September 1st Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 1వ ఎపిసోడ్‌‌లో విక్కీకి మహాతో రాఖీ కట్టించేందుకు చక్రి తీసుకెళ్తాడు. కానీ, అక్కడ విక్కీ, లక్కీ ఇద్దరు చక్రికే షాక్ ఇస్తారు. ఆది దగ్గరికి మాహాని తీసుకెళ్తే గొడవ పడతుంది. ఆదికి రాఖీ కడుతుంది. ఆఖరి నిమిషంలో ఘోరంగా నోరు జారుతాడు ఆది.

Published on: Sep 1, 2026, 09:14:20 IST
Advertisement

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బృందావనం తనకు పుట్టిల్లుతో సమానం అనుకుని నారాయణకు రాఖీ కట్టి హారతి ఇస్తుంది మేనకోడలు గాయత్రి. నారాయణ ఆశీర్వదిస్తాడు. నీకు ఏ సమస్య ఉన్న మాకు చెప్పు అని నారాయణ అంటాడు.

బిగ్ సర్‌ప్రైజ్ ఉంది

పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 1 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 1 ఎపిసోడ్

మహాలక్ష్మిని చక్రి కారులో బయటకు తీసుకెళ్తాడు. ఎక్కడికో చెప్పమని మహా అంటే చక్రి చెప్పడు. మీకు బిగ్ సర్‌ప్రైజ్ ఉంది. కానీ, మీరు ఒకరికి స్మాల్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని చక్రి అంటాడు. విక్కీ దగ్గరికి మహాను తీసుకెళ్లి ఇవాళ రాఖీ పండుగ అని చెబుతాడు. కట్టండి మీ అన్నయ్యకు అని విక్కీని చూపిస్తూ రాఖీని మహాలక్ష్మికి ఇస్తాడు చక్రి.

ఇద్దరు షాక్ అయి చూస్తారు. మహాను విక్కీ ఆప్యాయంగా చూసుకోవడం గురించి చెప్పి శాశ్వతంగా అన్నాచెల్లెళ్ల బంధం కలుపుకోండని చక్రి అంటాడు. నాకు కట్టాల్సిన వాళ్లు కట్టేశారు. ఇంకా ఎవరు లేరు అని విక్కీ అంటాడు. మీరేం చూస్తున్నారు కట్టండని చక్రి అంటాడు. ఓహో విక్కీ నాతో క్లోజ్‌గా ఉండటం ఈయనకు నచ్చట్లేదా. ఇన్‌సెక్యూర్‌గా, పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారా. ఈ మనిషిని అడ్డుకోడానికి నాకో ఆట వస్తువు దొరికింది అని మనసులో అనుకుంటుంది మహాలక్ష్మి.

నేను విక్కీని అన్నలా చూస్తున్నానని నేనెప్పుడు చెప్పానని మహాలక్ష్మి అంటుంది. ఒకే తల్లి కడుపున్న బిడ్డల మాదిరిగా లక్కీ, విక్కీ అని మీ పేర్లు ఎంత బాగా కలిసిపోయాయని చక్రి అంటాడు. నేను చచ్చినా కట్టను, ఎప్పుడు బ్రదర్‌లా చూడలేదంటుంది మహాలక్ష్మి. దానికి సర్‌ప్రైజ్ అయిన విక్కీ ఈ రాఖీ మీరు కట్టించుకోండి. ఎందుకంటే మీరే కద లక్కీ కజిన్ అని అంటాడు.

చక్రికే షాక్

ఆఫీస్ అన్నాక కలిసిపోయి పని చేసుకుంటారు. అయినా నేను ప్రపంచంలో ఎవరికైనా రాఖీ కడతాను కానీ విక్కీకి మాత్రం కట్టను అని తెగేసి చెబుతుంది మహాలక్ష్మి. అతను కాదు నేను షాక్ అయ్యానని చక్రి అంటాడు. అలా చక్రి ప్లాన్ రివర్స్ అవుతుంది. ఇంతలో చక్రికి కాల్ రావడంతో సరేనంటాడు. మీకు ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నా అని మహాను తీసుకెళ్తాడు చక్రి.

మరోవైపు రెస్టారెంట్‌లో ఆదితో ఇక్కడ ఏం జరిగిన కోపం తెచ్చుకోవద్దని మాట తీసుకుంటుంది భార్య హారిక. ఇంతలో చక్రి, మహాలక్ష్మి వస్తారు. సర్‌ప్రైజ్ ఏంటని మహా అడిగితే అన్నను చూపిస్తాడు చక్రి. హారిక రమ్మంటే మహాను రానంటుంది. పొగరని ఆది అంటాడు. బలవంతంగా హారిక తీసుకొస్తుంది. ఆది, మహాలక్ష్మి గొడవ పడతారు.

బొందపెట్టి వెళ్తా

బృందావనం ఇంట్లోవాళ్లంతా నిషాని గాళ్లే కదా అని ఆది అంటే.. ఆ ఇంటి వాళ్లను ఒక్క మాట అన్నా నిన్ను బొందపెట్టి వెళ్తానంటుంది మహాలక్ష్మి. ఈ సంవత్సరం రాఖీ కట్టలేదని ఫీల్ అయ్యావంటాగా అని హారిక అంటుంది. ఇద్దరు పొగరుగా ఉంటే.. ఒకే తల్లికన్నబిడ్డలు కదా పొగరు సేమ్ ఉంటుందని హారిక అంటుంది. ఇలాంటి బంధాలే అన్నాచెల్లెళ్లను కలుపుతాయని హారిక అంటుంది.

ఇప్పుడు రాఖీ కట్టి ఆస్తులు రాసి ఇవ్వమంటుంది. రాయమంటావా అని ఆది అంటాడు. నీ సంతకం సిరి పాప లీవ్ లెటర్‌పై తప్పా దేనికి పనికిరాదని మహా అంటుంది. ఇద్దరు అన్నాచెళ్లెళ్లు వాదించుకుంటూ తెగ గొడవ పడతారు. ఈ గ్యాప్‌లో రాఖీ కట్టేందుకు సెట్ చేస్తారు హారిక, చక్రి. తర్వాత తీరిగ్గా కొట్లాడండి ఇప్పుడు అయితే రాఖీ కట్టుకోండి అని హారిక అంటుంది.

చేయి ఇవ్వమంటే ఆది ఇవ్వడు. ఇస్తావా లేదా వేడి సాంబారు పోయమంటావా అని మహా అంటుంది. అదే కట్టొచ్చుగా అని ఆది అంటాడు. ఆదికి బొట్టు పెట్టి రాఖీ కడుతుంది మహాలక్ష్మి. కన్నీళ్లు పెట్టుకుంటుంది మహాలక్ష్మీ. ఆది చేతిపై మహా కన్నీళ్లు పడతాయి. ఏడుస్తూ కట్టడం దేనికి, ఎవరేమన్నారు అని ఆది అంటాడు. ఏడ్చావులే. నువ్వు ఏడిపిస్తే ఏడ్చే రోజులు పోయాయి. ఈ ఏడుపెందుకు నీకు మీ నాన్నకు తెలిస్తే నాకు ఈ ఏడుపెందుకు అని మహాలక్ష్మి అంటుంది.

కోపంలో ప్రేమలో తగ్గని అన్నాచెల్లి

ఆదికి స్వీట్ తినిపిస్తుంది. మహాకు ఆది తినిపిస్తాడు. ఆది ఏడుస్తాడు. మహా అంటుంది. ఈ ఏడుపెందుకు అర్థమైతే ఇంట్లోంచి ఎందుకు వెళ్తావని ఆది అంటాడు. ఆది, మహా ఇద్దరు ప్రేమలో, కోపంలో ఏమాత్రం తగ్గరు. ఆది కట్నంగా డబ్బులు పెడతాడు. నేనేం డబ్బుకోసం రాఖీ కట్టలేదు. అంతగా కావాలంటే ఆశీర్వదించమని అక్షింతలు ఇస్తుంది మహాలక్ష్మి.

ఆది ఆశీర్వదిస్తాడు. మహాలక్ష్మి వెళ్లిపోతుంటే.. ఈ డబ్బు తీసుకో. మీ బృందావనంలో నెలసరిపడా సరుకులు కొనుక్కోవచ్చు. దాంతో ఆ మంద అంతా కడుపు నిండా తినొచ్చు అని ఘోరంగా అవమానిస్తాడు ఆది. ఆఖరి నిమిషంలో నోరు జారారు ఏంటండి ఇది అని హారిక అంటుంది. నీలాంటి కుక్కలు ఎంతమంది వచ్చిన ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదురా. నువ్వు నా అన్నవని చెప్పుకోడానికే సిగ్గుగా ఉందని ఛీ కొడుతుంది మహా.

చక్రికి కొత్త లవర్ గోపిక

సోషల్ మీడియాలో గోపిక అనే అమ్మాయి తగిలిందని, ఇకనుంచి చాటింగ్, మీటింగ్ అని మహా ముందే అంటాడు చక్రి. అది తట్టుకోలేని మహా రాత్రి పడుకున్నాక చక్రిపై నీళ్లుపోస్తుంది. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe