...
...
Next Story

Podarillu September 21 Episode: పొదరిల్లు- మీ అన్నకు బుద్ధిలేదా, కేశవతో నోరు జారిన శైలు-విడాకుల కోసం కోర్టుకు మహా, చక్రి

Podarillu Serial September 21st Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 21వ ఎపిసోడ్‌‌లో బన్సీ ఇంటికి వెళ్లిన చక్రి మాధవ నవ్వుకు కారణం తెలుసుకుంటాడు. ఇంటికెళ్లి మనీషాతో పెళ్లి గురించి చెబుతాడు. మాధవకు మాత్రం బుద్ధి లేదా అని శైలు నోరు జారితే కేశవ ఫైర్ అవుతాడు. చక్రి, మహాకు లాయర్ కాల్ చేస్తాడు.

Published on: Sep 21, 2026, 09:46:05 IST
Advertisement

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మాధవకు రాత్రి అనుకున్న కాపల డ్యూటీ గురించి చెబుతాడు కన్నా. దాంతో మాధవ నవ్వుతాడు. మీ అమాయకత్వం చూస్తే నవ్వొస్తుంది. మీ అందరిని వదిలి ఎక్కడికి వెళ్లను. వెళ్లిన ఉండలేను అని మాధవ చెబుతాడు.

మనీషా బాగానే ఉందా

పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 21 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 21 ఎపిసోడ్

తర్వాత మనీషా ఇంటికి చక్రి వెళ్తాడు. మీరా అని మనీషా అంటే.. నీకు తెలుగు వచ్చా అని షాక్ అవుతాడు. కొంచెం కొంచెం అని మనీషా అంటుంది. బన్సీతో చక్రి మాట్లాడుతాడు. మనీషా తనలో తనే నవ్వుకోవడం చూసి బన్సీని అడుగుతాడు. తను బాగానే ఉందని అంటాడు బన్సీ. మాధవ గురించి చెబుతాడు చక్రి.

అన్నయ్య మీరు ఏం మాట్లాడుకున్నారు. మీ చెల్లి నవ్వుకు కారణం ఉన్నట్లే మా అన్నయ్య మాధవ నవ్వుకు కారణం ఉందా అని చక్రి అంటాడు. ఉంది. మా మనీషాను పెళ్లి చేసుకుంటావా అని మీ అన్నయ్యను అడిగాను అని బన్సీ చెబుతాడు. దాంతో షాకైన చక్రి.. తెగ సంతోషిస్తాడు. దీని వెనుక ఇంత బ్రహ్మాండమైన, అద్భుతమైన కారణం ఉందా. నార్త్ ఇండియా అమ్మాయి సౌతిండియా కోడలు కాబోతుందా అని తెగ సంబరపడిపోతాడు చక్రి.

మరి అన్నయ్య ఓకే చెప్పాడా అని చక్రి అంటే.. ఏం చెప్పలేదు. అలా నవ్వుకుంటూ వెళ్లిపోయాడని బన్సీ అంటాడు. ఒప్పుకుంటాడు అని చక్రి వెళ్లిపోతాడు. మరోవైపు చక్రి గురించి కేశవ అడిగితే.. కన్నా పంచ్‌లు వేస్తాడు. దాంతో కన్నా చెవిమెలిపెట్టి తనతో తిరిగి బాగా వెటకారం ఎక్కువైపోయిందిరా అని కేశవ అంటాడు.

మనీషా గురించి చెప్పిన చక్రి

నేను గ్యారెంటీ ఇవ్వలేను. నాకేం అవసరం అని మహా అంటుంది. దాంతో కేశవ, నారాయణ చెప్పమని బలవంతం చేస్తారు. బన్సీ ఇంటికి మాధవ అన్నయ్య వెళ్లాడు. అక్కడ ఒక మహా మలుపుకి నాంది పడింది అని చక్రి అంటాడు. దాంతో చక్రి గొంతు పట్టుకుని చెప్పమంటారు కేశవ, నారాయణ. దాంతో మనీషాను పెళ్లి చేసుకోవడం గురించి బన్సీ అడిగాడని, ఇద్దరు సిగ్గుపడి ప్రేమగా చూసుకున్నారట అని చక్రి చెబుతాడు.

ఇది చెప్పడానికా ఇంత సాగదీశావ్. ఆ పిల్ల ఈ పప్పుగాడిని ప్రేమిస్తుందని నాకు ఎప్పుడో తెలుసు అని నారాయణ ట్విస్ట్ ఇస్తాడు. ఆ కళ్లలో ప్రేమ చూసే మా మాధవను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. గుర్తులేదా అని గ్రామదేవత గుడిలో జరిగింది గుర్తు చేస్తాడు నారాయణ. వాడి జీవితంలో కూడా ఆ దేవుడు సంతోషం రాశాడా. గమ్మత్తుగా ఉందని నారాయణ ఎమోషనల్ అవుతాడు.

ఖానో ఖావో జీ

బయటకు వెళ్తాడు నారాయణ. మాధవ ఇంటికి వస్తాడు. ఆవో ఆవో.. బైఠో బైఠో అంటూ అంతా హిందీలోనే మాట్లాడుతారు. మాధవను ఆటపట్టిస్తారు. ఉప్పెన సినిమాలోని ఇష్క్ సిపాయా పాట పాడతారు. అంతా కలిసి చక్కిలిగింతలు పెడతారు. ఎందుకురా నాతో ఆడుకుంటున్నారు అని మాధవ అడుగుతాడు. బన్సీ ఇంటి దగ్గర ఏం జరిగిందని అడుగుతారు.

మాధవ చెప్పకుండా నవ్వుతాడు. పోని మనీషా ఏం చెప్పింది. మైనే ప్యార్ కియా అందా అని ఏడిపిస్తారు. దాంతో మాధవ వెళ్లిపోతాడు. జీ జీ అంటూ ఏడిపిస్తారు. బృందావనం సంతోషంగా విరిసిల్లి పోతుంది. మరోవైపు కేశవ షాప్‌లో హిందీ సాంగ్స్ పెట్టడం గురించి అసిస్టెంట్ అడిగితే.. సంతోషకరమైన రోజు అని కేశవ అంటాడు. ఇంతలో బుస్సు శైలు వస్తుంది.

అసిస్టెంట్ వెళ్లిపోతాడు. కేశవతో గొడవ పడుతుంది శైలు. మాధవ పెళ్లి గురించే గొడవ పడతారు. నేను పెళ్లి చేసుకోమంటే ఎవరిని పడితే వాళ్లను పెళ్లి చేసుకుంటాడా. ఏది మంచో ఏది చెడో మీ అన్నయ్యకు తెలియదా. ఆయనేమైనా చిన్న పిల్లాడా. ఆమాత్రం బుద్ధి కూడా లేదా తనకు అని నోరు జారుతుంది శైలు. దాంతో కేశవ మరింత కోపంతో ఊగిపోతాడు.

విడాకుల కోసం కోర్టుకు చక్రి, మహా

పళ్లు రాలతాయ్ అంటాడు. నీకోసం ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు ఇలా అంటావా. ఇంకోసారి మాట్లాడితే అస్సలు క్షమించను. ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని అంటాడు కేశవ. మీ అన్నయ్య మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నన్నెందుకు ప్రేమించడం. నీకోసం రావడం నాదే బుద్ధి తక్కువ అని కోపంగా వెళ్లిపోతుంది శైలు.

మరోవైపు మహాలక్ష్మికి లాయర్ కాల్ చేసి రేపు కోర్టులో హియరింగ్ ఉందని, రావాలని చెబుతాడు. చక్రికి కూడా కాల్ చేసి కోర్టులో కౌన్సిలింగ్ ఉందని, మీ ఆవిడ విడాకులు కావాలని పట్టుబట్టి కూర్చుందని, కోర్టుకు రావాలని లాయర్ చెబుతాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks