Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. తమ్ముళ్ల బాగు కోసం ఆలోచించిన మాధవ తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి బలంగా నిర్ణయించుకుంటాడు. పెళ్లిని అడ్డుకుంటామని కేశవ వార్నింగ్ ఇవ్వడంతో మాధవ మరింత కఠినంగా మాట్లాడతాడు. దీంతో బృందావనంలో అన్నతమ్ముళ్ల మధ్య చీలిక ఏర్పడుతుంది.
జోక్యం చేసుకోవద్దన్న పెద్ది.. లేచి వెళ్లిపోయిన నారాయణ

మాధవ పెళ్లి చూపుల సీన్ తోనే సీరియల్ శనివారం (సెప్టెంబర్ 5) ఎపిసోడ్ మొదలవుతుంది. విడాకులు కాగానే పెళ్లికి ఏర్పాట్లు చేద్దామని అమ్మాయి, ఆమె తండ్రి అంటారు. ఇంట్లో వాళ్లు అడ్డుపడబోతుంటే ఇందులో జోక్యం చేసుకోవద్దని మాధవ అంటాడు. దీంతో అందరూ షాకవుతారు.
మీ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడని నారాయణను అడిగితే ఆ విషయం అతడు చెప్పలేదా అని అంటాడు. ముహూర్తాల గురించి అడిగితే.. అన్ని విషయాలు మీ రెండో అల్లుడినే అడగండి అంటూ మధ్యలోనే నారాయణ లేచి వెళ్లిపోతాడు. అమ్మాయి తరఫు వాళ్లు వెళ్లిపోతుంటే సాగనంపడానికి కూడా ఎవరూ రాకపోవడంతో పెద్ది ఒక్కడే వెళ్తాడు.
పెద్దిని నిలదీసిన తమ్ముళ్లు, మహాలక్ష్మి.. నా ఇష్టమన్న మాధవ
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మాధవ ముఖం చాటేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ తమ్ముళ్లు, మహాలక్ష్మి నిలదీస్తారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నావని అడుగుతారు. కానీ మాధవ మాత్రం నా పెళ్లి నా ఇష్టం అని దురుసుగా సమాధానం చెప్పడంతో అందరూ కంగు తింటారు.
నీ పెళ్లి నీ ఇష్టమా.. ఇంత స్వార్థం నీలో ఎప్పుడు వచ్చింది అంటూ నారాయణ వస్తాడు. ఇలాంటివాడికా నువ్వు గుడి కట్టించాలని అన్నది అని మహాతో నారాయణ అంటాడు. నీ తమ్ముళ్లను వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకుంటావా అని తిడతాడు. వీడో పిచ్చోడు.. వాడి గురించి వాడికి ఆలోచించడం కూడా రాదు.. ఈ ఇంటి కోసం తన ప్రేమను త్యాగం చేశాడు.. గయ్యాలిలాంటి తాయరు అత్తకే ప్రేమ పంచినవాడు.. ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు కాస్త చెప్పండి అని చెప్పి నారాయణ వెళ్లిపోతాడు.
జయంతి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్న మహా
దీంతో మహాలక్ష్మి రంగంలోకి దిగుతుంది. అసలు ఆ అమ్మాయి నీకు ఏ విధంగానూ సూట్ కాదు.. ఆమె నిన్ను చూడటానికి కాదు నీ ఇంటిని చూడటానికి వచ్చింది.. కళ్లతోనే ఎన్ని గజాలు ఉందో కూడా చూసుకుంది.. ఆమెను మొదటి భర్త ఎందుకు వదిలించుకున్నాడో అర్థమవుతూనే ఉంది.. ఆమెకు చాలా అహంకారం ఉంది..
{{/usCountry}}దీంతో మహాలక్ష్మి రంగంలోకి దిగుతుంది. అసలు ఆ అమ్మాయి నీకు ఏ విధంగానూ సూట్ కాదు.. ఆమె నిన్ను చూడటానికి కాదు నీ ఇంటిని చూడటానికి వచ్చింది.. కళ్లతోనే ఎన్ని గజాలు ఉందో కూడా చూసుకుంది.. ఆమెను మొదటి భర్త ఎందుకు వదిలించుకున్నాడో అర్థమవుతూనే ఉంది.. ఆమెకు చాలా అహంకారం ఉంది..
{{/usCountry}}ఆమెను పెళ్లి చేసుకుంటే.. నీ తమ్ముళ్లను దూరం చేస్తుంది.. కలిసి ఉండనీయదు అని మహాలక్ష్మి అంటుంది. తన తమ్ముళ్లతోనే కలిసి ఉండాలని తాను కచ్చితంగా చెప్పానని మాధవ అంటాడు. నిన్ను అనుమానించడం లేదు కానీ.. ఆమె తీరు చూస్తుంటే అలా లేదు అంటూ గాయత్రి విషయం ప్రస్తావిస్తుంది.
వెనక్కి తగ్గని మాధవ.. పెళ్లి చెడగొడతామన్న కేశవ.. తెగించిన పెద్ది
మహాలక్ష్మి ఇంత చెప్పినా మాధవ మాత్రం వెనక్కి తగ్గడు. తాను పెళ్లి చేసుకొని తీరతానని స్పష్టం చేస్తాడు. దీంతో కేశవ సీరియస్ అవుతాడు. నీ స్థార్థం నువ్వు చూసుకుంటానంటే ఈ పెళ్లి జరగకుండా అడ్డుకుంటామని కేశవ తేల్చి చెబుతాడు. దీంతో మాధవ మరింత మొండికేస్తాడు.. నాకు నేనే ముఖ్యం.. నాకు ఆ పెళ్లి అంతకంటే ముఖ్యం అని తెగించి చెబుతాడు. మాధవ అంత కఠినంగా మాట్లాడుతున్నా.. చక్రి మాత్రం అన్నను సముదాయిస్తాడు.
నీకు అమ్మాయి అస్సలు వద్దు.. నీ జీవితం నాశనమవుతుంది.. అయినా ఇంత పట్టుబడుతున్నావంటే దీనికి వెనుక ఏదో బలమైన కారణం ఉందని చక్రి అంటాడు. కానీ మాధవ మాత్రం అదేంటో చెప్పడు. సరే నీ ఇష్టం.. పెళ్లి చేసుకో అని మహాలక్ష్మి వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత తన పెళ్లి వల్ల ఈ కుటుంబం విచ్ఛిన్నమవుతుందా.. నా తమ్ముళ్లు నాకు దూరమవుతారా.. అలా జరగకుండా చూడమని దేవుడిని వేడుకుంటాడు మాధవ.
మాధవ గురించి ఇంట్లో వాళ్ల ఆందోళన
ఆ తర్వాత మాధవ గురించి ఇంట్లో వాళ్లు ఆందోళన చెందుతుంటారు. అసలు ఇవాళ మనతో మాట్లాడింది మన అన్నయ్యేనా అని చక్రి అంటాడు. తన అన్నయ్య ఇలాంటి వాడు కాదని, ఇంత స్వార్థంగా ఆలోచించడు అని చెబుతాడు. కేశవ, కన్న కూడా అదే అంటారు. పెద్ది ఇంతలా మొండికేస్తున్నాడంటే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంది.. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకుండా అడ్డుకోవాల్సిందే అని మహాలక్ష్మి అంటుంది. ఏదో ఒకటి చేయాలని ఫిక్సవుతుంది.
కేశవ, శైలు గురించే ఆలోచించిన మాధవ
అటు మాధవ మాత్రం కేశవ, శైలు గురించి ఆలోచిస్తుంటాడు. మీరు పెళ్లి చేసుకోకపోతే మా పెళ్లి కాదు.. అలా అయితే మీలాగే నేను కూడా ఒంటరిగా మిగిలిపోవాల్సిందే అని శైలు తనతో అన్న మాటలను మాధవ గుర్తు చేసుకుంటాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు.
శైలును పెళ్లి చేసుకోనన్న కేశవ
అటు చక్రి బస్టాప్ ప్రేమను చూడలేక మహాలక్ష్మి కొత్త ప్లాన్ వేస్తుంది. ఇక నుంచి బస్సులో కాకుండా బండిపై వెళ్లాలని డిసైడవుతుంది. ఇదేంటని చక్రి అడిగితే.. బస్టాప్ విషయం చెబుతుంది. అయితే బండి స్టార్ట్ కాకపోవడంతో కేశవ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడే శైలును చక్రి, మహా కలుస్తారు. మాధవ పెళ్లి గురించి శైలు అడుగుతుంది. అసలు ఈ పెళ్లి తమకు ఇష్టం లేదని వాళ్లు చెబుతారు.
దీంతో వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మీకు పిచ్చి పట్టిందా అని కేశవతో శైలు అంటుంది. ఎందుకలా అంటున్నావంటే.. మాధవ పెళ్లి చేసుకుంటే మీకేంటి నష్టం.. అయినా ఆయన పెళ్లవుతేనే కదా మన పెళ్లి జరిగేది అని అంటుంది. అంత స్వార్థంగా ఎలా మాట్లాడుతున్నావ్.. అవసరమైతే నిన్ను పెళ్లి చేసుకోను కానీ.. అన్నయ్య జీవితం మాత్రం నాశనం కాకూడదు అని కేశవ అనడంతో శైలు షాకవుతుంది. అక్కడితో పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.