2025లో దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఊపేసిన పాటల్లో కూలీ సినిమాలోని ‘మోనికా’ సాంగ్ ఒకటి. బుట్టబొమ్మ పూజ హెగ్డే ఈ సాంగ్ లో తన డ్యాన్స్ తో అదరగొట్టింది. గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఈ సాంగ్ కు తనదైన స్టైల్లో స్టెప్స్ వేసింది. కానీ ఇదే సాంగ్ కు ఓ పిల్లాడి ఎనర్జీని పూజ ఇప్పుడు మ్యాచ్ చేయలేకపోయింది.
మోనికా సాంగ్

2025లో రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులోని మోనికా సాంగ్ తెగ వైరల్ గా మారింది. ఈ పాటలో పూజ హెగ్డే తన అందచందాలతో అలరించింది. అయితే తాజాగా ఓ ఈవెంట్లో ఇదే పాటకు ఓ నాలుగైదేళ్ల పిల్లాడు చేసిన డ్యాన్స్ కు పూజ ఫిదా అయింది.
వైరల్ వీడియో
తాజాగా చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ ఫెస్ట్ కు స్పెషల్ గెస్ట్ గా పూజ హెగ్డే అటెండ్ అయింది. ఇదే ఈవెంట్లో కొంతమంది చిన్నారులు మోనిక సాంగ్ కు డ్యాన్స్ చేశారు. వీళ్లతో కలిసి పూజ కూడా డ్యాన్స్ చేసింది. అయితే ఇందులో ఓ చిచ్చర పిడుగులాంటి పిల్లాడు.. పూజ ముందు నిలబడి మోనిక సాంగ్ కు డ్యాన్స్ అదరగొట్టాడు. అతని ఎనర్జీని పూజ మ్యాచ్ చేయలేకపోయింది.
ఆ పిల్లాడి డ్యాన్స్ కు పూజ ఫిదా అయింది. సాంగ్ ఆగిపోయిన తర్వాత ఆ పిల్లాడికి హెడ్ బో చేస్తూ అప్రిషియేషన్ ఇచ్చింది పూజ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
పూజ సినిమాలు
తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా కెరీర్ కొనసాగిస్తోంది పూజ హెగ్డే. ఆమె చివరగా సూర్య హీరోగా నటించిన రెట్రో మూవీలో హీరోయిన్ గా కనిపించింది. కూలీలో స్పెషల్ సాంగ్ తో మెరిసింది. ఇక దళపతి విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ లో పూజ హీరోయిన్. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.
{{/usCountry}}తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా కెరీర్ కొనసాగిస్తోంది పూజ హెగ్డే. ఆమె చివరగా సూర్య హీరోగా నటించిన రెట్రో మూవీలో హీరోయిన్ గా కనిపించింది. కూలీలో స్పెషల్ సాంగ్ తో మెరిసింది. ఇక దళపతి విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ లో పూజ హీరోయిన్. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.
{{/usCountry}}మరోవైపు హిందీలో హే జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలో నటిస్తోంది పూజ హెగ్డే. తమిళంలో కాంచన 4లో కూడా చేస్తుంది. తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ గా చేస్తోంది పూజ హెగ్డే.
ఆ మూవీతో
తమిళ సినిమా ముగమూడి (2012)తో కెరీర్ స్టార్ట్ చేసింది పూజ హెగ్డే. తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద, డీజే, సాక్ష్యం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్, ఆచార్య లాంటి సినిమాలు చేసింది పూజ హెగ్డే.