Poonam Kaur: టాలీవుడ్లో మరోసారి వివాదాల సెగలు రేపుతోంది నటి పూనమ్ కౌర్ (Poonam Kaur). సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఇండస్ట్రీలోని లోపాలను ఎండగట్టే పూనమ్, ఈసారి నేరుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) టార్గెట్‌గా ఇవాళ (అక్టోబర్ 15) ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో పెట్టిన పోస్టులు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
త్రివిక్రమ్‌లో మునుపటి ఫన్ లేదు

పూనమ్ కౌర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ స్టైల్‌ను ఎండగట్టింది. ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించే క్లాసిక్ ఎంటర్టైన్మెంట్, పంచ్ డైలాగులు, మునుపటి ఫన్ ఇప్పుడు ఆయనలో అస్సలు కనిపించడం లేదని పూనమ్ ఘాటుగా ట్రోల్ చేసింది. త్రివిక్రమ్ కేవలం ఒక బ్రాండ్‌గా మారిపోయారే తప్ప, కంటెంట్‌లో పస తగ్గిందంటూ ఇన్ డైరెక్ట్‌గా సెటైర్లు వేసింది.
‘‘నీలో ఫన్ లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ ప్లేస్ కు నువ్వు మళ్లీ వెళ్లలేవు’’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పూనమ్ కౌర్ రాసుకొచ్చింది.
భార్యను కోమాలోకి వెళ్లేలా కొట్టారా..?
పూనమ్ కౌర్ పెట్టిన మరో పోస్ట్ టాలీవుడ్‌ని ఒక్కసారిగా షేక్ చేసింది. "ఒక నటి కోసం భార్యను కోమాలోకి వెళ్లేలా కొట్టిన వ్యక్తిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'గురూజీ' అని పిలుస్తున్నారు" అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
{{/usCountry}}పూనమ్ కౌర్ పెట్టిన మరో పోస్ట్ టాలీవుడ్‌ని ఒక్కసారిగా షేక్ చేసింది. "ఒక నటి కోసం భార్యను కోమాలోకి వెళ్లేలా కొట్టిన వ్యక్తిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'గురూజీ' అని పిలుస్తున్నారు" అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
{{/usCountry}}నా ఫ్యామిలీ బలహీనతను వాడుకున్నారు
ఈ సంచలన వ్యాఖ్యలతో పాటు, రీసెంట్గా తన కుటుంబాన్ని త్రివిక్రమ్ వాడుకున్నాడంటూ పూనమ్ కౌర్ చేసిన పాత కామెంట్లు కూడా మళ్లీ తెరపైకి వచ్చాయి. "త్రివిక్రమ్ శ్రీనివాస్ మా కుటుంబ బలహీనతను ఆసరాగా చేసుకుని, వారితో బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పించారు" అని ఆమె గతంలో ఆరోపించింది.
తన కుటుంబానికి సమస్య వచ్చినప్పుడు పారిపోయి, అవసరం రాగానే ఇలా వాడుకోవడం చాలా దుర్మార్గమని, ఆ బలవంతపు ప్రకటనలకు తాను ఎంతమాత్రం కట్టుబడి ఉండబోనని పూనమ్ ఖరాకండీగా తేల్చి చెప్పింది.
'మా' అసోసియేషన్ మౌనంపై ప్రశ్నలు!
ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని పూనమ్ ప్రశ్నించింది. పెద్ద పెద్ద డైరెక్టర్లపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదని, ఎంతమంది జీవితాలు నాశనం కావాలని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ పెట్టిన ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, సంచలన కామెంట్లు టాలీవుడ్ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.