...
...
Next Story

Sonakshi Sinha: నన్ను ఎన్నిసార్లు నానమ్మను చేశారో లెక్కే లేదు.. హీరోయిన్ సోనాక్షి సిన్హా తల్లి పూనమ్ సిన్హా కామెంట్స్

Poonam Sinha About Sonakshi Sinha Pregnancy Rumours: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గర్భవతి అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె తల్లి పూనమ్ సిన్హా తొలిసారి స్పందించారు. కూతురు జీవితంలో ఆ మధుర క్షణం కచ్చితంగా వస్తుందని ఆకాంక్షించారు. పూనమ్ సిన్హా కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 5, 2026, 16:47:13 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ల వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా సోనాక్షి గర్భవతి అంటూ వస్తున్న వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సోనాక్షి ఎరుపు రంగు దుస్తుల్లో మెరవగా, ఆమె తన చేతిని పొట్టపై ఉంచుకున్న తీరు చూసి నెటిజన్లు రకరకాలుగా ఊహించుకున్నారు. తాజాగా ఈ పుకార్లపై సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా తనదైన శైలిలో స్పందించారు.

కూతురు పుట్టడమే మా జీవితంలో పెద్ద వేడుక!

నన్ను ఎన్నిసార్లు నానమ్మను చేశారో లెక్కే లేదు.. హీరోయిన్ సోనాక్షి సిన్హా తల్లి పూనమ్ సిన్హా కామెంట్స్
నన్ను ఎన్నిసార్లు నానమ్మను చేశారో లెక్కే లేదు.. హీరోయిన్ సోనాక్షి సిన్హా తల్లి పూనమ్ సిన్హా కామెంట్స్

ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన పూనమ్ సిన్హా, తన కూతురు సోనాక్షి పుట్టినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "మా ఇంట్లోకి ఆడపిల్ల అడుగుపెట్టిన ఆ క్షణం నా జీవితంలోనే అత్యంత అద్భుతమైన సమయం. ఆడపిల్లలు లేని జీవితం వెలితిగానే ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉండటం చాలా ముఖ్యం" అని పూనమ్ సిన్హా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

నానమ్మను చేసేశారుగా!

సోనాక్షి ప్రెగ్నెన్సీ వార్తల గురించి ప్రస్తావించగా పూనమ్ నవ్వుతూ ఇలా అన్నారు.. "సోషల్ మీడియా పుణ్యమా అని నన్ను ఇప్పటికే ఎన్నిసార్లు నానమ్మను చేసేశారో లెక్కే లేదు! అయితే ఆ సంతోషం మా జీవితంలోకి కచ్చితంగా వస్తుంది, అది జరిగేటప్పుడు అందరికీ తెలుస్తుంది" అని పూనమ్ సిన్హా క్లారిటీ ఇచ్చారు.

ఏడేళ్ల ప్రేమ.. ఆపై వివాహం

కాగా, సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఒక పార్టీలో 2013లో తొలిసారి కలుసుకున్న సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌.. దాదాపు ఏడేళ్ల పాటు రహస్యంగా ప్రేమలో ఉన్నారు. 2017లో 'ట్యూబ్‌లైట్' సినిమా సక్సెస్ పార్టీలో వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. 2024లో ముంబైలోని సోనాక్షి నివాసంలో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు.

పుకార్లపై సోనాక్షి, జహీర్ స్టైలే వేరు!

అటు జహీర్ ఇక్బాల్ కూడా ఒక దీపావళి వేడుకలో ఫోటోగ్రాఫర్ల ముందు సోనాక్షి సిన్హా పొట్టపై చేయి వేసి 'జాగ్రత్త' అంటూ సరదాగా ఆటపట్టించారు. మొత్తానికి ఈ దంపతులు పుకార్లను పట్టించుకోకుండా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks