...
...
Next Story

Irumudi: భక్తితో థియేటర్లో పూనకాలే.. రవితేజ ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి సాంగ్.. కన్ఫామ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్

Irumudi: మాస్ మహారాజా రవితేజ రూట్ మార్చి చేస్తున్న భక్తి కథా చిత్రం ‘ఇరుముడి’. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదిరిపోయే న్యూస్ వచ్చింది. థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఈ సినిమాలో ఓ పాపులర్ పాట ఉండబోతుంది.

Published on: May 14, 2026, 06:15:48 IST
Advertisement

Irumudi: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అయ్యప్ప పడిపూజ జరిగినా కచ్చితంగా వినిపించే పాట.. ‘‘మల్లెపూల పల్లకి’’. ఈ పాట పాడుతూ అయ్యప్ప స్వాములు భక్తి తన్మయత్వంతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. ఇప్పుడీ పాపులర్ సాంగ్ సినిమాల్లోకిి రాబోతుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం కోసం ఈ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నారు.

ఇరుముడి సాంగ్

ఇరుముడి మూవీ పోస్టర్ (x/RaviTeja_offl)
ఇరుముడి మూవీ పోస్టర్ (x/RaviTeja_offl)

రవితేజ హీరోగా నటిస్తున్న భక్తి నేపథ్య కథా చిత్రం ‘ఇరుముడి’. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ భక్తి పాట ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కన్ఫామ్ చేశాడు. అతను ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. ‘‘విల్లాలి వీరుడు.. వీర మణికంఠుడు’’ అని జీవీ ప్రకాష్ పోస్టు చేశాడు.

థియేటర్లో పూనకాలే

వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న రవితేజకు ఈ సమయంలో కచ్చితంగా ఓ హిట్ కావాల్సిందే. వరుసగా బాక్సాఫీస్ దగ్గర అతని సినిమాలు బోల్తా కొట్టడంతో రవితేజ మార్కెట్ కూడా పడిపోతోంది. ఈ నేపథ్యంలోనే భక్తిరస చిత్రం చేయాలని అతను ‘ఇరుముడి’ మూవీకి ఓకే చెప్పాడు. ఈ సినిమాకు శివ నిర్వాణ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్.

వరుసగా ఫ్లాప్ లు

రవితేజకు వరుసగా ఫ్లాప్ లు ఎదురయ్యాయి. 2022లో వచ్చిన ధమాకా సినిమాతో రవితేజ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. కానీ అక్కడి నుంచి రవితేజకు వరుసగా షాక్ లే తగిలాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, భర్త మహాశయులకు విజ్ణప్తి సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన భర్త మహాశయులకు విజ్ణప్తి మూవీపై రవితేజ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం కోసం తన మాస్ మహారాజా అనే పేరును కూడా వద్దనుకున్నాడు. కానీ ఈ మూవీ డిసప్పాయింట్ చేసింది. దీంతో ఇప్పుడు ఆశలన్నీ ‘ఇరుముడి’పైనే ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe