...
...
Next Story

భార్యాభర్తలైన పాపులర్ సింగర్స్ కారుపై అభిమానుల దాడి- పగిలిన అద్దం- న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని వస్తుండగా షాకింగ్ ఘటన!

పాపులర్ సింగర్స్‌గా సచేత్-పరంపర మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. భార్యాభర్తలైన వీరిద్దరు పశ్చిమ బెంగాల్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఈ సంగీత ద్వయం సచేత్-పరంపర కారును అభిమానులు చుట్టుముట్టారు. ఈ తోపులాటలో కారు వెనుక అద్దం పగిలిపోవడంతో సింగర్స్ షాక్‌కు గురయ్యారు.

Published on: Jan 1, 2026, 18:33:12 IST
Advertisement

2026 న్యూ ఇయర్ వేడుకల్లో పాటలు ఆలపించి అందరినీ ఉత్సాహపరచాలని వచ్చిన ఆ సంగీత కళాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్స్, సింగర్స్, భార్యాభర్తలు సచేత్ టాండన్, పరంపర ఠాకూర్ (సచేత్-పరంపర)కు మంచి క్రేజ్ ఉంది.

భార్యాభర్తలైన పాపులర్ సింగర్స్ కారుపై అభిమానుల దాడి- పగిలిన అద్దం- న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని వస్తుండగా షాకింగ్ ఘటన!
భార్యాభర్తలైన పాపులర్ సింగర్స్ కారుపై అభిమానుల దాడి- పగిలిన అద్దం- న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని వస్తుండగా షాకింగ్ ఘటన!

తాజాగా సచేత్-పరంపరకు న్యూ ఇయర్ వేడుకల్లో చేదు అనుభవం ఎదురైదంది. వీరు ప్రయాణిస్తున్న కారు అభిమానుల దాడికి గురైంది. కారును అభిమానులు చుట్టుముట్టడమే కాకుండా.. కారు అద్దాలను కూడా పగలగొట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘాట్‌లో న్యూ ఇయర్ ఈవ్ కాన్సర్ట్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సచేత్, పరంపరలు తమ కారులో ప్రయాణిస్తుండగా, వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా కారును చుట్టుముట్టారు. సచేత్ నవ్వుతూ అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో, ఎవరో కారు ముందు అద్దాన్ని బలంగా తట్టారు.

దీంతో సచేత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పరంపర "గాయ్స్.. కొంచెం రిలాక్స్ అవ్వండి.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్" అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, జనం అదుపు తప్పడంతో కారు వెనుక ఉన్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది.

ఆ శబ్దానికి సచేత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవ్వగా, "పోయింది.. అద్దం పగిలిపోయింది (గయా.. గయా)" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా అభిమానులు కారును వదలకుండా సెల్ఫీలు, వీడియోల కోసం ఎగబడ్డారు.

ఘటనపై మౌనం.. విషెస్ చెప్పిన సింగర్స్

అయితే, ఈ షాకింగ్ ఘటనపై సచేత్ పరంపర నేరుగా స్పందించలేదు. కానీ, సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. "మా వెన్నంటే నిలిచిన ప్రియమైన వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. మహా దేవుడు అందరినీ రక్షించుగాక" అంటూ పోస్ట్ చేశారు.

సచేత్ టాండన్, పరంపర ఠాకూర్ 2015లో 'ది వాయిస్ ఇండియా' ద్వారా గుర్తింపు పొందారు. ఆ తర్వాత జంటగా మారి 'కబీర్ సింగ్', 'తానాజీ', 'జెర్సీ', 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు.

2020లో వివాహం చేసుకున్న సచేత్-పరంపర జంట ఇటీవలే 'సయ్యారా', 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' వంటి చిత్రాల్లోనూ పాటలు పాడారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks