Prabhas Alia Bhatt: రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ 'కల్కి 2898 ఏడీ సీక్వెల్' (Kalki 2898 AD Sequel)లోకి బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న అలియా లేటెస్ట్ మూవీ 'ఆల్ఫా' ట్రైలర్‌పై ప్రభాస్ వేసిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఈ రూమర్లకు మరింత బలాన్నిచ్చింది.
ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.. అలియా భట్ సూర్యుడి ట్విస్ట్

అలియా భట్, శర్వరీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న 'ఆల్ఫా' మూవీ జులై 3న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ చూసిన ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మేకర్స్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. "ఆల్ఫా ట్రైలర్ చాలా అమేజింగ్‌గా, ప్రామిసింగ్‌గా ఉంది. జులై 3న రాబోతున్న ఈ సినిమా కోసం అలియా, వైఆర్ఎఫ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్" అంటూ ప్రభాస్ రాసుకొచ్చాడు.
ఈ స్టోరీని అలియా భట్ రీ-షేర్ చేస్తూ "థ్యాంక్స్.. థ్యాంక్యూ సో మచ్" అని పెట్టి పక్కన ఒక సూర్యుడి ఎమోజీని యాడ్ చేసింది. ఈ సూర్యుడి ఎమోజీని చూసిన కల్కి ఫ్యాన్స్ ఇదంతా కల్కి 2 లోని 'కర్ణుడి' పాత్రకు హింట్ అంటూ క్రేజీగా డీకోడ్ చేయడం స్టార్ట్ చేశారు.
గతంలోనే అలియాపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నిజానికి ప్రభాస్‌కు అలియా భట్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. గతంలో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నప్పుడు దీపికా పదుకోన్ కంటే అలియా భట్ మంచి నటి అంటూ ప్రభాస్ ఓపెన్‌గా చెప్పాడు.
అంతేకాదు తన లైఫ్‌లో ఎప్పటికైనా దీపికా, అలియా ఇద్దరితో కలిసి పని చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. ఇప్పటికే కల్కి ఫస్ట్ పార్ట్‌లో దీపికాతో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం అలియాను లైన్లో పెట్టాడనే టాక్ బాలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.
సాయి పల్లవి వర్సెస్ అలియా భట్.. అసలు మేకర్స్ ప్లాన్ ఏంటి?
{{/usCountry}}అంతేకాదు తన లైఫ్‌లో ఎప్పటికైనా దీపికా, అలియా ఇద్దరితో కలిసి పని చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. ఇప్పటికే కల్కి ఫస్ట్ పార్ట్‌లో దీపికాతో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం అలియాను లైన్లో పెట్టాడనే టాక్ బాలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.
సాయి పల్లవి వర్సెస్ అలియా భట్.. అసలు మేకర్స్ ప్లాన్ ఏంటి?
{{/usCountry}}కల్కి ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో దీపికా పదుకోన్ క్యారెక్టర్ ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో కల్కి 2లో ఆమె పాత్ర స్థానంలో వచ్చే 'SUM-80' రోల్ కోసం మేకర్స్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.
కొద్దిరోజుల క్రితం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు ఈ క్యారెక్టర్ కోసం గట్టిగా వినిపించింది. నాగ్ అశ్విన్ ఆమెను సంప్రదించాడని, షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ప్రొడక్షన్ టీమ్ మాత్రం ఇప్పటివరకు ఎవరినీ ఫైనలైజ్ చేయలేదని, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలని స్పష్టం చేసింది.
మరోవైపు జూన్ నెల మధ్యలో అలియా భట్ కల్కి 2 కోసం కొన్ని సీన్స్ షూట్ చేసిందనే టాక్ నడిచింది. దీనిపై ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇస్తూ, ఎలాంటి షూటింగ్ జరగలేదని రూమర్లకు చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్‌ను అందరూ కాపీ పేస్ట్ చేసి న్యూస్ లాగా ప్రెజెంట్ చేశారని, అలియా కాస్టింగ్‌పై ఇప్పటికైతే ఎలాంటి అఫీషియల్ క్లారిటీ లేదని టీమ్ తేల్చి చెప్పింది.
అలియా భట్ 'ఆల్ఫా' స్పై థ్రిల్లర్ విశేషాలు
ప్రస్తుతం అలియా భట్ ఫోకస్ అంతా జులై 3న రాబోతున్న 'ఆల్ఫా' సినిమాపైనే ఉంది. శివ్ రావల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆదిత్య చోప్రా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
ఏక్ థా టైగర్, వార్, పఠాన్ లాంటి బ్లాక్‌బస్టర్ల సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాలో అలియాతో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒకవేళ 'ఆల్ఫా' ప్రమోషన్స్ పూర్తయ్యాక నాగ్ అశ్విన్ అలియాను కల్కి 2898 ఏడీ సీక్వెల్ ప్రాజెక్ట్‌లోకి తీసుకుంటే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అది బిగ్గెస్ట్ కాస్టింగ్ క్రేజ్ కావడం ఖాయం.