రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మెరిశాడు. ఈ ఈవెంట్ శనివారం (డిసెంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న ప్రభాస్.. తనదైన స్టైల్లో డార్లింగ్స్ అంటూ మాట్లాడాడు. మూవీతోపాటు సంక్రాంతి సినిమాలు, డైరెక్టర్ మారుతి, సీనియర్ హీరోల గురించి కూడా అతడు మాట్లాడిన విధానం అభిమానులను బాగా ఆకట్టుకుంది.
సంక్రాంతి సినిమాలపై..

డార్లింగ్స్ ఎలా ఉన్నారు అంటూ ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన స్పీచ్ మొదలుపెట్టాడు ప్రభాస్. సంక్రాంతి సినిమాలన్నీ హిట్ కావాలని అతడు కోరుకున్నాడు. తమ సినిమా కూడా అయితే బాగుంటుంది అంటూ సింపుల్ గా చెప్పడం చాలా మందిని ఆకర్షించింది.
సీనియర్ హీరోలపై..
ఈసారి సంక్రాంతికి చిరంజీవి మూవీ మన శంకరవరప్రసాద్ గారు కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలుసు కదా. బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియాగా ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నా ప్రభాస్ మాత్రం సీనియర్ హీరోలకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో తాజా స్పీచ్ తో తెలిసింది.
“చాలా ఇంపార్టెంట్ సీనియర్ సీనియరే.. సీనియర్ల నుంచే మేము నేర్చుకున్నాం.. సీనియర్ తర్వాతే మేము.. హండ్రెడ్ పర్సెంట్.. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ కావాలి” అని ప్రభాస్ అనడంతో ఫ్యాన్స్ పెద్దగా అరిచారు. అతని సింప్లిసిటీ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ఏదో రోజు ఇరగదీస్తా
ఇక తన స్పీచ్ బోరింగ్‌గా అనిపిస్తుంది కదా అని తనపై తానే పంచ్‌లు వేసుకున్నాడు ప్రభాస్. అతడు మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్ అందరూ బాహుబలి 2లోని ఇంటర్వెల్ సీన్ ను రీక్రియేట్ చేస్తూ.. బాహుబలి జయహో అని అరవడం మొదలుపెట్టారు.
దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. “నా స్పీచు ఇలాగే ఉంటది.. బోరింగ్‌గా అని బాహుబలి జయహో అంటున్నారు కదా. ఎప్పుడిలాగే చెబుతాడు. ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా స్టేజ్ మీద.. షాకైపోతారు మీరందరూ. ఈరోజు మరీ ఎక్కువ మాట్లాడేశాను కదా. వస్తుంది వస్తుంది.. అప్పుడప్పుడూ వస్తుంది. ఒక రోజు ఇరగదీస్తాను” అని ప్రభాస్ అన్నాడు.
డైరెక్టర్ మారుతి, క్లైమ్యాక్స్పై..
{{/usCountry}}దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. “నా స్పీచు ఇలాగే ఉంటది.. బోరింగ్‌గా అని బాహుబలి జయహో అంటున్నారు కదా. ఎప్పుడిలాగే చెబుతాడు. ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా స్టేజ్ మీద.. షాకైపోతారు మీరందరూ. ఈరోజు మరీ ఎక్కువ మాట్లాడేశాను కదా. వస్తుంది వస్తుంది.. అప్పుడప్పుడూ వస్తుంది. ఒక రోజు ఇరగదీస్తాను” అని ప్రభాస్ అన్నాడు.
డైరెక్టర్ మారుతి, క్లైమ్యాక్స్పై..
{{/usCountry}}ఇక డైరెక్టర్ మారుతి గురించి మాట్లాడుతూ.. అతని భుజంపై చేయి వేసి ఈ డార్లింగ్ 15 ఏళ్ల తర్వాత మంచి ఎంర్టైన్మెంట్ అందించాడు అని అన్నాడు. ఇక మూవీ క్లైమ్యాక్స్ గురించి చెబుతూ.. “మారుతి డార్లింగ్ అది పెన్నుతో రాశావా, మిషన్ గన్నుతో రాశావా.. క్లైమ్యాక్స్ చూసి మతిపోయింది. మాటలు రాలేదు. కానీ ఫైనల్ గా దానిని చూసి జడ్జ్ చేయాల్సింది మీరు” అని ప్రభాస్ చెప్పాడు.