Prabhas Fauzi: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు వేడుకలకు మరికొద్ది గంటలే మిగిలి ఉన్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో ఉత్సాహం అంబరాన్ని తాకుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న రాబోయే ప్రాజెక్ట్‌ల నుంచి వరుస అప్‌డేట్‌ల కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 'సీతా రామం' ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ పిరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauzi) సినిమా నుంచి ఎలాంటి సర్‌ప్రైజ్ రాబోతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

తాజాగా ఈ బర్త్‌డే ట్రీట్‌కు సంబంధించిన అధికారిక వివరాలను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. ఈ మైత్రీ మూవీ మేకర్సే నిర్మించిన హారర్ చిత్రం '418' ప్రదర్శితమయ్యే థియేటర్లలో ఈ ప్రత్యేక వీడియోను వెండితెరపై ప్రదర్శించనుండటం విశేషం.
అసలు వీడియోలో ఏముండబోతోంది? మైత్రీ నిర్మాత వ్యాఖ్యలు
మౌళి తనుజ్ హీరోగా నటించిన 'దొంగ నా కొడుకు' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్.. ప్రభాస్ 'ఫౌజీ' అప్‌డేట్‌పై స్పష్టత ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్ బర్త్‌డే కానుకగా ఒక ప్రత్యేక షార్ట్ వీడియోను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో ద్వారా సినిమా ప్లాట్ (కథా నేపథ్యం) ఏంటి? దర్శకుడు హను రాఘవపూడి ఎలాంటి ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు? ప్రభాస్ పాత్ర స్వభావం ఎలా ఉండబోతోందనే విషయాలపై ప్రేక్షకులకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుందని చెప్పారు. అయితే, అభిమానులు మరీ ఆకాశాన్ని తాకే రేంజ్‌లో అంచనాలు, బాహుబలి రేంజ్ లో ఊహించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేయడం గమనార్హం.
'418' థియేటర్లలో బిగ్ స్క్రీన్ సర్‌ప్రైజ్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో బిగ్ సర్‌ప్రైజ్ ఏమిటంటే.. ఈ ప్రత్యేక వీడియో గ్లింప్స్‌ను కేవలం డిజిటల్ మాధ్యమాల్లోనే కాకుండా వెండితెరపై కూడా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన తొలి హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ ఈ శుక్రవారం (అక్టోబర్ 23) విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
{{/usCountry}}ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో బిగ్ సర్‌ప్రైజ్ ఏమిటంటే.. ఈ ప్రత్యేక వీడియో గ్లింప్స్‌ను కేవలం డిజిటల్ మాధ్యమాల్లోనే కాకుండా వెండితెరపై కూడా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన తొలి హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ ఈ శుక్రవారం (అక్టోబర్ 23) విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
{{/usCountry}}'418' సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ప్రభాస్ 'ఫౌజీ' వీడియో గ్లింప్స్‌ను పెద్ద తెరపై వేయనున్నారు. ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసి ఆస్వాదించాలనుకునే అభిమానులు వెంటనే '418' థియేటర్లకు వెళ్లాలని మేకర్స్ సూచించారు.
చారిత్రక నేపథ్యంలో 'ఫౌజీ' మ్యాజిక్
1940ల నాటి రజాకార్ల కాలం, స్వతంత్ర సమర నేపథ్యంతో ఈ చిత్రాన్ని హను రాఘవపూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడిగా భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. 'సీతా రామం' వంటి విజయం తర్వాత హను తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో అపారమైన అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి అక్టోబర్ 23న రాబోయే ఈ స్పెషల్ వీడియో ప్రభాస్ అభిమానులకు ఎలాంటి పూనకాలు తెప్పిస్తుందో చూడాలి.