పాన్ ఇండియా హీరోగా బాక్సాఫీస్ ను ఏలుతున్న ప్రభాస్ మరోసారి తన సత్తాచాటాడు. మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో దూసుకెళ్తున్న ది రాజా సాబ్ తో మరోసారి బాక్సాఫీస్ రారాజుగా నిలిచాడు. ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ డేనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఓపెనింగ్ పరంగా ప్రభాస్ ఓ అద్భుతమైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
రాజా సాబ్ కలెక్షన్లు

ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజా సాబ్ థియేటర్లో దుమ్ము రేపుతోంది. మిక్స్ డ్ టాక్ తోనూ కలెక్షన్లు కుమ్మేస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజైన ఈ మూవీకి భారీ ఓపెనింగ్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ తొలి రోజు రూ.112 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ప్రభాస్ రికార్డు
రాజా సాబ్ కలెక్షన్ల సెంచరీ కొట్టడంతో ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరే హీరోకు ఇప్పటివరకూ సాధ్యం కాని చరిత్ర అందుకున్నాడు ప్రభాస్. అదే రూ.100 కోట్ల ఓపెనింగ్ సినిమాలు. ప్రభాస్ కెరీర్ లో రూ.100 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించిన సినిమాలు ఆరు. మరే హీరో ఖాతాలో ఇన్ని సినిమాలు లేవు.
రూ.100 కోట్ల ఓపెనింగ్
బాహుబలి సినిమాలతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాక్సాఫీస్ మొనగాడిగా ఎదిగాడు. ఇప్పుడు ఫస్ట్ డేనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన ఆరు సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. రాజా సాబ్ రీసెంట్ గా రూ.112 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది.
ఫస్ట్ డేనే రూ.100 కోట్లు సాధించిన ప్రభాస్ సినిమాల్లో బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజా సాబ్ ఉన్నాయి.
సెంచరీ వసూళ్లు
{{/usCountry}}ఫస్ట్ డేనే రూ.100 కోట్లు సాధించిన ప్రభాస్ సినిమాల్లో బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజా సాబ్ ఉన్నాయి.
సెంచరీ వసూళ్లు
{{/usCountry}}బాహుబలి మూవీ విజయం, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఉత్కంఠతో బాహుబలి 2కి భారీ ఓపెనింగ్స్ దక్కాయి.
- బాహుబలి 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.212 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది.
- సాహో ఏమో రూ.130 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది.
- ఇక ప్రభాస్ కెరీర్ లోనే డిజాస్టర్లలో ఒకటిగా ఆది పురుష్ మూవీ నిలిచింది. కానీ వసూళ్లలో మాత్రం అదరగొట్టింది. తొలి రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.140 కోట్లు కొల్లగొట్టింది.
- సలార్ మూవీకి రూ.178 కోట్లు వచ్చాయి. కల్కి చిత్రానికి తొలి రోజు రూ.191 కోట్లు దక్కాయి.