Prabhas Fauzi Controversy Netaji Grandnephew: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన 'ఫైల్ నంబర్ 25' గ్లింప్స్ తీవ్ర దుమారం రేపుతోంది.
నేతాజీ ప్రతిష్టను దిగజార్చేలా చూపించారంటూ

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను ఫౌజీ చిత్రంలో అవమానపరిచేలా, ఆయన ప్రతిష్టను దిగజార్చేలా చూపించారంటూ నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ బహిరంగంగా మండిపడ్డారు. దేశ ప్రజలకు, స్వాతంత్ర్య పోరాటాన్ని గౌరవించే వారందరికీ దర్శకుడు హను రాఘవపూడి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మార్చడం నేరం!
సినిమా నిర్మించే క్రమంలో దర్శకులకు, నిపుణులకు సృజనాత్మక స్వేచ్ఛ (Creative Freedom) ఉంటుందనే విషయాన్ని ఒప్పుకున్న చంద్రకుమార్ బోస్, ఆ స్వేచ్ఛ చారిత్రక సత్యాలను మరుగున పరిచేలా ఉండకూడదని స్పష్టం చేశారు.
కల్పిత కథలతో నిజమైన చరిత్ర వక్రీకరించడం
జాతీయ నాయకుల, జాతిపితల పాత్రలను సినిమా కోసం కల్పిత కథలతో మార్చేయడం, వారి నిజమైన చరిత్రను వక్రీకరించడం తీవ్రమైన నేరమని చంద్రకుమార్ బోస్ వ్యాఖ్యానించారు. ఇటువంటి సన్నివేశాలు నేతాజీ వంటి మహానాయకుడి గంభీరమైన వ్యక్తిత్వాన్ని, సమాజంలో ఆయనకున్న స్థానాన్ని తగ్గించి చూపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హిట్లర్‌తో నేతాజీ భేటీ వెనుక నిజమైన చరిత్ర ఏంటి?
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు నేతాజీ జర్మనీ, జపాన్ దేశాల మద్దతు కోరారు. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను కలిసినప్పుడు నేతాజీ ఒక దేశ ప్రతినిధిగా, సమానమైన హోదాలోనే మాట్లాడారు తప్ప ఎప్పుడూ లోకువ కాలేదు.
హీరో పాత్రను ఎలివేట్చేయడం కోసం
ఫాసిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య హక్కులకు అనుకూలంగా నిలబడిన నాయకుడు నేతాజీ. అయితే, 'ఫౌజీ' గ్లింప్స్‌లో చూపించిన విధంగా కల్పిత కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేయడం కోసం నేతాజీని హిట్లర్ ముందు తక్కువ చేసి చూపించడం ఏమాత్రం సరికాదని, అందుకు దేశ ప్రజలకు మేకర్స్ క్షమాపణ చెప్పాలని చంద్రకుమార్ బోస్ డిమాండ్ చేశారు.
'ఫైల్ నంబర్ 25' సీన్లో ఏముంది?
{{/usCountry}}ఫాసిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య హక్కులకు అనుకూలంగా నిలబడిన నాయకుడు నేతాజీ. అయితే, 'ఫౌజీ' గ్లింప్స్‌లో చూపించిన విధంగా కల్పిత కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేయడం కోసం నేతాజీని హిట్లర్ ముందు తక్కువ చేసి చూపించడం ఏమాత్రం సరికాదని, అందుకు దేశ ప్రజలకు మేకర్స్ క్షమాపణ చెప్పాలని చంద్రకుమార్ బోస్ డిమాండ్ చేశారు.
'ఫైల్ నంబర్ 25' సీన్లో ఏముంది?
{{/usCountry}}ఈ వివాదానికి ప్రధాన కారణం ఫౌజీ సినిమా నుంచి వచ్చిన 'ఫైల్ నంబర్ 25' గ్లింప్స్. బెర్లిన్‌లో నేతాజీ, హిట్లర్ మధ్య సంభాషణతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. అందులో ప్రభాస్ నటించిన ఒక కల్పిత క్యారెక్టర్ గురించి నేతాజీ హిట్లర్‌కు వివరిస్తున్నట్లు చూపించారు.
తప్పుబట్టిన నెటిజన్లు
ఒక ఊహాజనిత హీరో పాత్రకు బిల్డప్ లేదా ఎలివేషన్ ఇవ్వడానికి, మనదేశ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిని వాడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రను సినిమా రంగుల కోసం వక్రీకరించకుండా అసలు నేపథ్యాన్ని సరిగ్గా చూపించాలని, ఈ విషయంలో చిత్ర యూనిట్ స్పందించాలని అభిమానులు, నెటిజన్లు సైతం కోరుతున్నారు.