...
...
Next Story

పాండవుల పక్షాన కర్ణుడు.. రేపే ప్రభాస్, హను రాఘవపూడి సినిమా టైటిల్ రివీల్.. మోస్ట్ వాంటెండ్ అంటూ పోస్టర్ రిలీజ్

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ను రేపు (అక్టోబర్ 23) రివీల్ చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. పాండవుల పక్షాన కర్ణుడు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.

Published on: Oct 22, 2025, 14:06:44 IST
Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో హను రాఘవపూడి దర్శకత్వం వహించిన పీరియడ్ యాక్షన్ చిత్రం ఒకటి. హను రాఘవపూడి-ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి.

వర్కింగ్ టైటిల్‌గా ఫౌజీ

పాండవుల పక్షాన కర్ణుడు.. రేపే ప్రభాస్, హను రాఘవపూడి సినిమా టైటిల్ రివీల్.. మోస్ట్ వాంటెండ్ అంటూ పోస్టర్ రిలీజ్
పాండవుల పక్షాన కర్ణుడు.. రేపే ప్రభాస్, హను రాఘవపూడి సినిమా టైటిల్ రివీల్.. మోస్ట్ వాంటెండ్ అంటూ పోస్టర్ రిలీజ్

ఈ సినిమాలో హీరోయిన్‌గా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ చేస్తోంది. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉందని విషయం తెలిసిందే. ఫౌజీ పూజా కార్యక్రమంలో ప్రభాస్, ఇమాన్వీ ఫొటోలు సోషల్ మీడియాను షేర్ చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా మేకర్స్ అదిరిపోయే న్యూస్ చెప్పారు.

టైటిల్ రివీల్ రేపు

ప్రభాస్-హను రాఘవపూడి సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను ఇవాళ (అక్టోబర్ 22) ప్రకటించారు. వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్‌ను రేపు అంటే అక్టోబర్ 23న రివీల్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

హైలెట్‌గా Z లెటర్

ఈ సందర్భంగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌ ప్రకటనను అదిరిపోయే పోస్టర్‌తో ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్. ప్రభాస్ బ్లాక్ సూట్‌లో ఓ బ్యాగ్ పట్టుకుని ఉంది ఆ ఫొటో. అయితే ప్రభాస్ మొహం చూపించకుండా కాళ్లు, షూస్ మాత్రమే చూపించారు. ఇక ఈ పోస్టర్‌లో 'Z' అనే అక్షరాన్ని హైలెట్ చేశారు.

ఒంటరిగా నడిచే యుద్ధవీరుడు

"పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు" అని అర్థం వచ్చే మాటలను హిందీలో రాసుకొచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. హను రాఘవపూడి-ప్రభాస్ కాంబినేషన్ సినిమా టైటిల్ ఏంటో అని అంతా ఆసక్తిగా చూస్తున్న తరుణంలో ఈ క్యాప్షన్ అన్నింటికి మించి ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ పోస్టర్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఫౌజీ టైటిల్ కాదా

అయితే, ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ఆలోచన ఈ సినిమా టైటిల్ ఫౌజీ కాదా అని. ఫౌజీ కాకుంటే మరి టైటిల్ ఏమై ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్స్ ఆలోచిస్తున్నారు. పోస్టర్‌లోని హింట్స్‌ను డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

రేపు ఉదయం కోసం

ఏది ఏమైనా ఒక్క పోస్టర్‌తోనే ఒక్కసారిగా ప్రభాస్-హను రాఘవపూడి సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశారు. దీంతో రేపు ఉదయం రివీల్ అవనున్న ఈ సినిమా టైటిల్ కోసం ఫ్యాన్స్‌తోపాటు తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks