...
...
Next Story

Prabhas Health: ప్రభాస్‌కు ఏమైంది? అపోలో డాక్టర్ పోస్ట్ చేసిన ఫొటోతో ఫ్యాన్స్‌లో ఆందోళన.. ఆ త్యాగాలు మీరు చూడరంటూ..

Prabhas Health: ప్రభాస్ తాజాగా అపోలో హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ తో ఫొటో దిగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Published on: Aug 20, 2026, 16:41:33 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prabhas Health: పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హెల్త్ కండిషన్‌పై సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌కి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి.. ప్రభాస్‌తో దిగిన పిక్‌ను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టడమే దీనికి కారణం. డార్లింగ్ కాళ్ల గాయాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

డాక్టర్ కేజే రెడ్డి పోస్ట్.. ‘స్క్రీన్ వెనుక త్యాగాలు’

Prabhas Health: ప్రభాస్‌కు ఏమైంది? అపోలో డాక్టర్ పోస్ట్ చేసిన ఫొటోతో ఫ్యాన్స్‌లో ఆందోళన.. ఆ త్యాగాలు మీరు చూడరంటూ..
Prabhas Health: ప్రభాస్‌కు ఏమైంది? అపోలో డాక్టర్ పోస్ట్ చేసిన ఫొటోతో ఫ్యాన్స్‌లో ఆందోళన.. ఆ త్యాగాలు మీరు చూడరంటూ..

ప్రభాస్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన డాక్టర్ కేజే రెడ్డి.. ఆయన స్వభావంపై ప్రశంసలు కురిపించారు. "కొందరు విజయం ద్వారా స్ఫూర్తినిస్తే, మరికొందరు తమ వినయంతో గుండెల్లో నిలిచిపోతారు. ప్రభాస్ ఆరోగ్య సంరక్షణ బాధ్యత నాపై ఉండటం సంతోషంగా ఉంది" అని సదరు డాక్టర్ రాసుకొచ్చారు.

స్క్రీన్‌పై కనిపించే వెలుగుల వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయని, ప్రభాస్ పాజిటివ్ ఆటిట్యూడ్ ఆయనను ఎంతో స్పెషల్‌గా నిలబెడుతుందని పేర్కొన్నారు. 35 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ ప్రముఖ సర్జన్ పోస్ట్ చేయడంతో ప్రభాస్‌కి ఏమైందంటూ అభిమానులు కంగారు పడుతున్నారు.

'బాహుబలి' నుంచి వరుస గాయాలు.. ఫ్యాన్స్ ఆందోళన

ప్రభాస్ కెరీర్‌లో ఎన్నో భారీ యాక్షన్ సినిమాలు చేశారు. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ నుంచి మొదలుపెడితే 'సాహో', 'సలార్', రీసెంట్‌గా వచ్చిన 'కల్కి 2898 ఏడీ' వరకు ప్రతి సినిమాలోనూ రియలిస్టిక్ స్టంట్స్ కోసం ప్రభాస్ ప్రాణం పెట్టి పనిచేశారు.

ఈ భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరణ సమయంలో ఆయన మోకాలుకి తీవ్ర గాయాలయ్యాయి. గతంలో మోకాలికి రెండుసార్లు సర్జరీ కూడా చేయించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ సెట్‌లో మళ్లీ చిన్న గాయమైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ తో పిక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా కామెంట్స్ సెక్షన్‌లో ఎమోషనల్ అవుతున్నారు.

"సినిమాలు ఆపి రెస్ట్ తీసుకో అన్నా": నెట్టింట ఎమోషనల్ కామెంట్స్

హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో జాయింట్ రీప్లేస్‌మెంట్స్, స్పోర్ట్స్ ఇంజురీస్‌లో డాక్టర్ కేజే రెడ్డికి గోల్డ్ మెడలిస్ట్‌గా పేరుంది. ఆయన సంరక్షణలో ప్రభాస్ కోలుకుంటున్నారని, పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

లైన్అప్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్.. షూటింగ్స్‌కి బ్రేక్?

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇండస్ట్రీని షేక్ చేసే భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్', హను రాఘవపూడి కాంబినేషన్‌లో పీరియాడిక్ వార్ డ్రామా 'ఫౌజీ' షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు 'కల్కి 2' కూడా లైన్‌లో ఉంది.

ఈ సినిమాల్లో హెవీ యాక్షన్ సీన్లు ఉన్నందున, ప్రభాస్ తగినంత విశ్రాంతి తీసుకుంటూనే షూటింగ్స్ పూర్తి చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రార్థిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks