స్టార్ హీరోయిన్ కూతురు సింగింగ్ డెబ్యూ.. హృద‌యం లోప‌లి నుంచి వ‌చ్చిందంటూ ప్ర‌భాస్ ఫిదా

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రవీనా టండన్ గుర్తుందా? ఈమె కూతురు రాషా థడానీ కూడా సినిమాలు చేస్తోంది. ఇక రీసెంట్ గా సింగర్ గానూ డెబ్యూ చేసింది. ఆమె పాట అదిరిపోయిందంటూ ప్రభాస్ ఫిదా అయిపోయాడు. 

Published on: Jan 29, 2026, 06:10:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రెబల్ స్టార్ ప్రభాస్ కు ఓ పాట తెగ నచ్చేసింది. ఆ పాట పాడిన గొంతుకు ఇంప్రెస్ అయిపోయాడు. అందుకే సోషల్ మీడియాలో ఆ సింగర్ ను పొగిడేస్తూ స్టోరీ పెట్టాడు. ఇంతకీ ఆ సింగర్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా థడానీ. 'లాయ్కే లాయ్కా' అనే తన రాబోయే చిత్రంలోని 'చాప్ తిలక్' పాటతో సింగింగ్ డెబ్యూ ఇచ్చినందుకు రాషాను ప్రభాస్ ప్రశంసించాడు.

రాషా థడానీ పాటకు ప్రభాస్ ఫిదా
రాషా థడానీ పాటకు ప్రభాస్ ఫిదా

ప్రభాస్ స్టోరీ

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రభాస్ రాషాకు అభినందనలు తెలుపుతూ ఒక స్వీట్ నోట్ పంచుకున్నాడు. ఆమె కూడా ఆయన సందేశానికి స్పందించింది. ప్రభాస్ రాషా థడానీ గాత్రాన్ని ప్రశంసించాడు. రాషా 'చాప్ తిలక్' పాడుతున్న వీడియోను పోస్ట్ చేసి.. "రాషా థడానీ మీ సింగింగ్ డెబ్యూ చాలా అద్భుతంగా ఉంది. చాప్ తిలక్ లో మీ సింగింగ్ నిజాయితీగా, హృదయపూర్వకంగా, నేరుగా హృద‌యం లోప‌లి నుంచి వచ్చింది" అని ప్రభాస్ రాసుకొచ్చాడు.

ఎప్పటికీ గ్రేట్ ఫుల్

ప్రభాస్ తన స్టోరీలో "అభినందనలు (వైట్ హార్ట్ ఎమోజీ)" అని కూడా యాడ్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాషా ఆ పోస్ట్‌ను రీ-షేర్ చేసి.. "ప్రభాస్ సార్ (రెడ్ హార్ట్, చేతులు జోడించిన ఎమోజీలు) ఎప్పటికీ కృతజ్ఞురాలిని (గ్రేట్ ఫుల్)!!" అని రాసింది.

రాషా స్టోరీ
రాషా స్టోరీ

రాషా డెబ్యూ పాట గురించి

రాషా, ఐపీ సింగ్ పాడిన ఈ పాటను ఫరీద్‌కోట్ (రాజర్షి సన్యాల్, ఐపీ సింగ్) స్వరపరిచారు. సాహిత్యాన్ని సిద్ధార్థ్-గరిమా, ఐపీ సింగ్ అందించారు. గతంలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాషా పాట విడుదల గురించి తన భావోద్వేగాలను పంచుకుంది. "మీ అందరి ఆశీర్వాదాలతో, నా మొదటి పాట" అని ఆమె రాసింది.

లాయ్కే లాయ్కా

లాయ్యే లాయ్కా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే ఈ సాంగ్ వార్త వచ్చింది. ఫాంటమ్ స్టూడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా పోస్టర్‌ను పంచుకుంది. ఇందులో ఒక అబ్బాయి, అమ్మాయిల రక్తంతో తడిసిన షూస్ మెట్లపై ఉన్నాయి. ఈ చిత్రానికి సౌరభ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

మహేష్ బాబు అన్న కొడుకుతో

సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు ఘ‌ట్ట‌మ‌నేని జ‌య‌కృష్ణ‌ డెబ్యూ ఫిల్మ్ ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో తెలుగులో రాషా అడుగుపెడుతోంది. దీనికి అజయ్ భూపతి డైరెక్టర్. రాషా 2025లో 'అజాద్' చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More