...
...
Next Story

Prabhas: ప్రభాస్ స్పీడ్.. డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 2026లోనే మరో మూవీ రిలీజ్.. ఇక రెబల్ మేనియా!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ పెంచాడు. ఈ ఏడాది మరో మూవీని థియేటర్లకు తీసుకురావడానికి జెట్ స్పీడ్ తో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఒకేసారి రెండు సినిమాలతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు.

Published on: Apr 1, 2026, 13:48:39 IST
Advertisement

రెబల్ స్టార్ ప్రభాస్ జోరు పెంచాడు. స్పీడ్ అందుకున్నాడు. 2026లోనే మరో సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకే ఒకేసారి రెండు మూవీస్ షూటింగ్ లతో డార్లింగ్ బిజీగా మారిపోబోతున్నాడని టాక్. ఓ వైపు ఫౌజీతో పాటు మరోవైపు కల్కి 2898 ఏడీ సీక్వెల్ పై ప్రభాస్ గురిపెట్టాడు.

ప్రభాస్ షూటింగ్

ఫౌజీ హీరోయిన్ ఇమాన్వితో ప్రభాస్
ఫౌజీ హీరోయిన్ ఇమాన్వితో ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 60 శాతం కంప్లీట్ అయిందని తెలిసింది. మిగిలిన షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసి దసరాకు లేదా దీపావళికి ఫౌజీని రిలీజ్ చేయాలని ప్రభాస్ చూస్తున్నాడని తెలిసింది. ఇందుకోసం డైరెక్టర్ హను రాఘవపూడి షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడని సమాచారం.

2026లో రెండో మూవీ

2026లో రెండో సినిమా రిలీజ్ చేయాలని ప్రభాస్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలిసింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రభాస్ హీరోగా చేసిన ‘ది రాజాసాబ్’ మూవీ రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

కల్కి సీక్వెల్

మరోవైపు కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ కూడా త్వరలోనే ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెడతాడని టాక్. ఇందులో ప్రభాస్ కర్ణుడి పాత్ర హైలైట్ గా నిలవబోతుందని అంటున్నారు.

స్పిరిట్

భారీ సినిమాలతో వచ్చే రెండేళ్లు ప్రభాస్ రెబల్ మేనియా బాక్సాఫీస్ ను గట్టిగానే షేక్ చేయనుంది. ఈ ఏడాది ఫౌజీ రిలీజ్ అవుతుంది. 2027 మార్చి 5న స్పిరిట్ మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక కల్కి 2898 ఏడీ సీక్వెల్ కూడా వచ్చే ఏడాదే విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఇవి కాకుండా ప్రభాస్ కంప్లీట్ చేయాల్సిన సలార్ 2 కూడా ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks