‘ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అని అంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ‘లెట్స్ రేస్’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది అతని మూవీ షూటింగ్ కాదు, కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కూడా కాదు. శర్వానంద్ బైకర్ మూవీకి సపోర్ట్ గా ప్రభాస్ ఇలా చేశాడు.
లెట్స్ రేస్

మిర్చి సినిమాలో స్టైలిష్ గా హార్లీ డేవిడ్సన్ బైక్ మీద ప్రభాస్ వెళ్తుండటం చూశాం. ఇప్పుడు మరోసారి అదే స్టైల్, స్వాగ్ తో డార్లింగ్ అదరగొట్టాడు. ‘‘శర్వా మా ఇంటి హీరో. ప్రమోద్, వంశీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్’’ అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ప్రభాస్ చెప్పిన మాటలు ప్లే అవుతుండగా వీడియోలో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. వచ్చి బైక్ పై కవర్ లాగేసిన ప్రభాస్.. ‘‘ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్, లెట్స్ రేస్’’ అని డైలాగ్ చెప్పాడు.
శర్వా థ్యాంక్స్
బైకర్ మూవీని ప్రమోట్ చేస్తున్న ప్రభాస్ కు హీరో శర్వానంద్ థ్యాంక్స్ చెప్పాడు. రీసెంట్ గా బైకర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ వైబ్ బాగుందని ఇప్పటికే ప్రభాస్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు పెట్టాడు. ఇప్పుడేమో ఏకంగా వీడియో చేశాడు.
‘‘థ్యాంక్ యూ ప్రభాస్ అన్న. లవ్ యూ. మీరెప్పుడూ నా కోసం నిలబడ్డారు. మన బంధం పట్ల చాలా సంతోషంగా ఉంది. అవును.. ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి. ఇండియా ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ ను డాల్బీ సినిమా, ఎపిక్, 4డీఎక్స్, పీసీఎక్స్ లో ఎక్స్ పీరియన్స్ చేయండి. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ్, మలయాళంలో బైకర్ గ్రాండ్ రిలీజ్ కానుంది’’ అని ప్రభాస్ వీడియోను శర్వా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
బైకర్ గురించి
నారీ నారీ నడుమ మురారి లాంటి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ నుంచి వస్తున్న మరో మూవీ ‘బైకర్’. ఇది ఇండియాలో ఫస్ట్ మోటో క్రాస్ సినిమాగా థియేటర్లకు రాబోతుంది. ఇందులో బైక్ రేసింగ్ తో పాటు తండ్రీకొడుకుల బాండింగ్ చుట్టూ కథ సాగనుంది.
{{/usCountry}}నారీ నారీ నడుమ మురారి లాంటి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ నుంచి వస్తున్న మరో మూవీ ‘బైకర్’. ఇది ఇండియాలో ఫస్ట్ మోటో క్రాస్ సినిమాగా థియేటర్లకు రాబోతుంది. ఇందులో బైక్ రేసింగ్ తో పాటు తండ్రీకొడుకుల బాండింగ్ చుట్టూ కథ సాగనుంది.
{{/usCountry}}సినిమాలో హీరో తండ్రి, మెంటార్ గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించాడు. బైకర్ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. దీన్ని యూవీ క్రియేషన్స్ పై ప్రమోద్, వంశీ నిర్మించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మాళవిక నాయర్ హీరోయిన్.