ఓటీటీలో రాజాసాబ్ బ్లాక్‌బస్టర్ షో.. ఇన్‌స్టాలో హీరోయిన్ రిద్ది కుమార్ హాట్ షో.. హీట్ పెంచేస్తున్న భామ.. ఫొటోలు వైరల్
ఓటీటీలో రాజాసాబ్ అదరగొడుతోంది. ఒక్క రోజులోనే ట్రెండింగ్ నంబర్ వన్ లోకి దూసుకొచ్చింది. మరోవైపు రాజాసాబ్ హీరోయిన్ రిద్ది కుమార్ హాట్ షోతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. రాజాసాబ్ షూటింగ్ సమయంలో తీసుకున్న పిక్స్ ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజైంది. డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. ఓటీటీలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. మరోవైపు రాజాసాబ్ హీరోయిన్ రిద్ది కుమార్ సోషల్ మీడియాలో హాట్ షోతో రెచ్చిపోయింది. తన పోజులతో హీట్ పెంచేస్తోంది.

రిద్ది కుమార్ హాట్ షో
రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు కలిసి ప్రభాస్ తో రాజాసాబ్ లో రొమాన్స్ చేశారు. తమ గ్లామర్ షోతో అదరగొట్టారు. ఇప్పుడు రిద్ది కుమార్ ఇన్ స్టాలో హాట్ ఫొటోలు పోస్టు చేసింది. రాజాసాబ్ ను ఓటీటీలో చూడండి అంటూ ఈ మూవీ షూటింగ్ లోని కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
తెలుగు మూవీతోనే డెబ్యూ
రిద్ది కుమార్ తెలుగు మూవీతోనే డెబ్యూ చేసింది. 2018లో వచ్చిన లవర్ సినిమాతో ఆమె సినిమా కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత తెలుగులో ‘అనగనగా ఓ ప్రేమకథ’ మూవీ కూడా చేసింది. మలయాళం, మరాఠీ, హిందీ సినిమాల్లోనూ అడుగుపెట్టింది. ప్రభాస్ తో రాధేశ్యామ్ లోనూ రిద్ది కుమార్ నటించింది.
రాజాసాబ్ ఓటీటీ
థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన రాజాసాబ్ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఫిబ్రవరి 6న జియోహాట్‌స్టార్‌లో ఓటీటీలో రిలీజైంది ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్. ఈ సినిమాకు మారుతి డైరెక్టర్. ఇందులో ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ తదితరులు నటించారు. ప్రభాస్ కెరీర్లో ఇదే ఫస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్.
ట్రెండింగ్
రాజాసాబ్ మూవీ ఓటీటీలోకి వచ్చిన ఒక్క రోజులోనే ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడలోనూ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది రాజాసాబ్. ఇక తమిళ్, మలయాళం ట్రెండింగ్ పరంగా చూసుకుంటే రాజాసాబ్ సెకండ్ ప్లేస్ లో ఉంది.
నానమ్మ కోరిక మేరకు తాతయ్యను తీసుకురావడానికి వెళ్లే ఓ మనవడి కథ ఇది. అలా రాజ్ మహల్ కు వెళ్లిన హీరోకు వింత పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడి చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతాయి. హీరో ప్రాణాలకు ప్రమాదం ఎదురవుతుంది. మరి వీటిని దాటి హీరో ఏం చేశాడు? అసలు తాతయ్య కథ ఏంటీ? అన్నది రాజాసాబ్ సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


