...
...
Next Story

Prabhas vs Balakrishna: బుల్లితెరపై ప్రభాస్ వర్సెస్ బాలకృష్ణ.. ఈ సండే జీ తెలుగులో అఖండ 2, స్టార్ మాలో ది రాజా సాబ్ ఫైట్

Prabhas vs Balakrishna: బుల్లితెరపై ప్రభాస్, బాలకృష్ణ పోటీ పడబోతున్నారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 26) ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు టీవీ ప్రీమియర్ కానున్నాయి. స్టార్ మాలో ది రాజా సాబ్, జీ తెలుగులో అఖండ 2 రాబోతుండటం విశేషం.

Published on: Apr 23, 2026, 17:36:03 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prabhas vs Balakrishna: థియేటర్లు, ఓటీటీ కాదు.. ఈసారి ఇద్దరు స్టార్ హీరోల ఫైట్ బుల్లితెరపై జరగనుంది. తెలుగులో రెండు లీడింగ్ ఛానెల్స్ అయిన స్టార్ మా, జీ తెలుగు రెండు భారీ బడ్జెట్ సినిమాలను ఒకే రోజు, ఒకే సమయానికి టెలికాస్ట్ చేయబోతున్నాయి. స్టార్ మాలో ఆదివారం (ఏప్రిల్ 26) సాయంత్రం 5. 30 గంటలకు ది రాజా సాబ్, అదే సమయానికి జీ తెలుగులో అఖండ 2 రాబోతున్నాయి.

జీ తెలుగులో అఖండ 2 ప్రీమియర్

Prabhas vs Balakrishna: బుల్లితెరపై ప్రభాస్ వర్సెస్ బాలకృష్ణ.. ఈ సండే జీ తెలుగులో అఖండ 2, స్టార్ మాలో ది రాజా సాబ్ ఫైట్
Prabhas vs Balakrishna: బుల్లితెరపై ప్రభాస్ వర్సెస్ బాలకృష్ణ.. ఈ సండే జీ తెలుగులో అఖండ 2, స్టార్ మాలో ది రాజా సాబ్ ఫైట్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ బ్లాక్ బస్టర్ 'అఖండ 2' బుల్లితెరపై సందడి చేయనుంది. ఏప్రిల్ 26న జీ తెలుగు ఛానల్‌లో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది. ఈ హై వోల్టేజ్ మూవీ ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.

దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు.. అఖండ రాక తప్పదు

ఈసారి అఖండ కేవలం దుష్టశిక్షణే కాదు, దేశాన్ని పెను ముప్పు నుండి కాపాడే సాహసోపేతమైన పోరాటం చేయబోతున్నాడు. కుంభమేళా వేదికగా శత్రువులు బయోవార్‌ దాడికి కుట్ర పన్నుతారు. ఈ విపత్తు నుండి కోట్లాది మంది ప్రాణాలను కాపాడేందుకు డీఆర్‌డీఓ శాస్త్రవేత్త జనని ఒక శక్తివంతమైన విరుగుడును కనిపెడుతుంది.

అయితే ఆమె ప్రాణాలకు హాని తలపెట్టే శత్రువుల నుండి అఖండ ఎలా రక్షించాడు? తన మాట కోసం ప్రాణాలకు తెగించి దేశాన్ని ఎలా కాపాడాడు? అన్నదే ఈ సినిమా అసలు కథ. అఘోరాగా బాలయ్య చేసే విన్యాసాలు, చెప్పే డైలాగులు బుల్లితెరపై మరోసారి ప్రకంపనలు సృష్టించడం ఖాయం.

స్టార్ మాలో ది రాాజా సాబ్

మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కూడా ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ఒక రోజు ముందే ఈ విషయాన్ని స్టార్ మా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా బుల్లితెరపై టీఆర్పీ రికార్డుల వేటకు సిద్ధమవుతోంది.

అయితే ఈసారి టీఆర్పీ రికార్డులు బ్రేకవడం అంత సులువైన పనిలా కనిపించడం లేదు. రెండు టాప్ ఛానెల్స్, రెండు పెద్ద సినిమాలను ఒకే రోజు ఒకే సమయానికి వేస్తుండటంతో ఆ మేరకు టీఆర్పీ రేటింగ్స్ పై ప్రభావం పడనుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుంది? ఈ ఇద్దరు స్టార్లలో ఎవరిని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe