దీపావళి సందర్భంగా విడుదలైన మూవీ 'డ్యూడ్'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన ఈ మూవీ కేవలం 5 రోజుల్లోనే రూ.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన ఈ వివరాలు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి.
డ్యూడ్ కలెక్షన్ల సునామీ

కీర్తిశ్వరన్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ఈ 'డ్యూడ్' (Dude). దీంట్లో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది. అతి త్వరలోనే ఈ మూవీ రూ.100 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
'డ్యూడ్' సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తమ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్లు వసూలు చేసినట్లు వాళ్లు తెలిపారు. ప్రదీప్ రంగనాథన్ కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణాన్ని 'డ్యూడ్' కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో డ్యూడ్ రూ.95 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది" అని వెల్లడించారు.
నిర్మాణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.66 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత నాలుగో రోజుకు అంటే దీపావళి సెలవు దినం కావడంతో కలెక్షన్లకు బాగా కలిసొచ్చింది. దీంతో నాలుగో రోజు కలెక్షన్లు కలుపుకొని రూ.83 కోట్లకు చేరుకున్నాయి.
అయితే ట్రేడ్ వెబ్సైట్ sacnilk రిపోర్టు ప్రకారం 'డ్యూడ్' ఇండియాలో రూ.50.3 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మంగళవారం (అక్టోబర్ 21) కలెక్షన్లలో కొద్దిగా తగ్గుదల కనిపించింది.
'లవ్ టుడే', 'డ్రాగన్'ను దాటి..
{{/usCountry}}అయితే ట్రేడ్ వెబ్సైట్ sacnilk రిపోర్టు ప్రకారం 'డ్యూడ్' ఇండియాలో రూ.50.3 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మంగళవారం (అక్టోబర్ 21) కలెక్షన్లలో కొద్దిగా తగ్గుదల కనిపించింది.
'లవ్ టుడే', 'డ్రాగన్'ను దాటి..
{{/usCountry}}కథనంపై విమర్శలు ఉన్నప్పటికీ 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇస్తోంది. ఈ సినిమా 2022లో వచ్చిన 'లవ్ టుడే', 2025లో విడుదలైన 'డ్రాగన్' సినిమాల కలెక్షన్లను అధిగమించింది. 'లవ్ టుడే' ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.19.90 కోట్లు వసూలు చేసింది.
ఇక 'డ్రాగన్' అయితే ఐదు రోజుల్లో రూ.64.50 కోట్లు సాధించింది. ఈ సినిమాల పూర్తి లైఫ్ టైం కలెక్షన్లు చూస్తే 'లవ్ టుడే' రూ.83.55 కోట్లు, 'డ్రాగన్' రూ.150.52 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేశాయి. మరి 'డ్యూడ్' సినిమా 'డ్రాగన్' సినిమా వసూళ్లను అధిగమిస్తుందో లేదో చూడాలి.
'డ్యూడ్' కథ గురించి..
'డ్యూడ్' సినిమా కథ కజిన్స్ అయిన అగన్ (ప్రదీప్), కురల్ (మమితా) చుట్టూ తిరుగుతుంది. అగన్ తల్లి పార్వతి (రోహిణి), కురల్ తండ్రి మంత్రి అథియామాన్ అళగప్పన్ (శరత్‌కుమార్) మధ్య గొడవలు ఉన్నప్పటికీ.. అగన్, కురల్ కలిసి పెరుగుతారు. కురల్ పెళ్లి కోసం అగన్‌ను అడిగినప్పుడు పాత కుటుంబ రహస్యాలు బయటకు వస్తాయి.
వాళ్ల నిజ స్వరూపాలు బయటపడతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ల పెళ్లి జరిగిందా లేదా అన్నది ఈ డ్యూడ్ మూవీలో చూడొచ్చు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా దూసుకెళ్తుండటం విశేషం. మూవీ రిలీజ్ కు ముందే అసలు మీరు హీరో మెటీరియలేనా అనే ప్రశ్నలకు ప్రదీప్ రంగనాథన్ తన వసూళ్ల ద్వారానే సమాధానం చెబుతున్నట్లుగా ఉంది.