...
...
Next Story

PR Show: ఆరుగురు డైరెక్టర్లు, నిర్మాతగా హీరో ప్రదీప్ రంగనాథన్- అదిరిపోయిన పీఆర్ షో లాంచ్ వీడియో- ది ఆల్ఫా యూనిట్ అంటూ!

Pradeep Ranganathan PR Show Launch: యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా మారారు. 'PR Show' బ్యానర్‌పై 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా సరికొత్త సినిమాను ప్రకటిస్తూ ఒక క్రేజీ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఆరుగురు డైరెక్టర్లను పరిచయం చేస్తూ ది ఆల్ఫా యూనిట్‌గా ప్రకటించారు.

Published on: Jul 6, 2026, 13:12:16 IST
Advertisement

Pradeep Ranganathan PR Show Launch: రచయితగా, దర్శకుడిగా, హీరోగా తక్కువ కాలంలోనే సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్. 'కోమాలి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను హీరోగా విపరీతంగా ఆకట్టుకున్నాడు.

పీఆర్ షో ప్రొడక్షన్ బ్యానర్

ఆరుగురు డైరెక్టర్లు, నిర్మాతగా హీరో ప్రదీప్ రంగనాథన్- అదిరిపోయిన పీఆర్ షో లాంచ్ వీడియో- ది ఆల్ఫా యూనిట్ అంటూ!
ఆరుగురు డైరెక్టర్లు, నిర్మాతగా హీరో ప్రదీప్ రంగనాథన్- అదిరిపోయిన పీఆర్ షో లాంచ్ వీడియో- ది ఆల్ఫా యూనిట్ అంటూ!

అలాంటి హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ పీఆర్ షో (PR Show) అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో రానున్న మొదటి సినిమాకు సంబంధించిన క్రేజీ అనౌన్స్‌మెంట్ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

నిర్మాతగా ప్రదీప్ రంగనాథన్ సరికొత్త ప్రయాణం

సినిమా ఇండస్ట్రీలో ఒక వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు కథలు రాస్తూ బిజీగా ఉన్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి రావడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. యువత పల్స్ బాగా తెలిసిన మేకర్‌గా పేరు తెచ్చుకున్న ప్రదీప్, తన మొదటి నిర్మాణంలోనే ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు.

ఈ సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం బాగా సుపరిచితమైన 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'ఓ మై కడవులే' (తెలుగులో ఓరి దేవుడా) చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.

ఆరుగురు దర్శకులతో క్రేజీ ప్రయోగం

ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం దీని మేకింగ్ శైలి. ఈ చిత్రానికి మూల కథను ప్రదీప్ రంగనాథన్ అందించారు. అయితే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను మాత్రం ఒక సరికొత్త టీమ్‌కు అప్పగించారు. 'ది ఆల్ఫా యూనిట్' (The Alpha Unit) పేరుతో ఆరుగురు యువ దర్శకులను ఈ సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు.

మమితా బైజు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ శివాజీ, స్వాసిక విజయ్, అనామిక మహి, లిజ్జీ ఆంటోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన వీడియో చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా యూత్‌ఫుల్ వైబ్‌తో సాగింది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన 'కచ్చి సేరా' మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ అనౌన్స్‌మెంట్ వీడియోను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

క్రేజీ కాంబినేషన్

ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. అశ్విన్ లారా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. కేవలం అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఈ సినిమా సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. కొత్త దర్శకుల టీమ్, క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks