Prakash Padukone on Dhurandhar: సినిమాలో హింస ఎక్కువైంది.. అల్లుడి 'ధురంధర్' సినిమాపై మామ ప్రకాష్ పదుకోన్ రివ్యూ
Prakash Padukone on Dhurandhar: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీ 'ధురంధర్' (Dhurandhar). తాజాగా ఈ రూ.1800 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీపై రణవీర్ సింగ్ మామ ప్రకాష్ పదుకోన్ రివ్యూ ఇచ్చారు.
Prakash Padukone on Dhurandhar: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రణ్‌వీర్ ను దేశంలోనే టాప్ యాక్టర్స్ లో ఒకరిగా మార్చేసింది. తాజాగా ఈ సినిమా గురించి రణ్‌వీర్ భార్య దీపికా పదుకోన్ తండ్రి ప్రకాష్ పదుకోన్ (Prakash Padukone) ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడారు. సినిమాలో హింస కాస్త ఎక్కువైందని చెప్తూనే, మేకింగ్ ను నటీనటుల పెర్ఫార్మెన్స్ ను ఆయన ప్రశంసించారు.

సినిమా చాలా బాగా తీశారు.. కానీ హింసే..
ఈ ధురంధర్ సినిమా గురించి ప్రకాష్ పదుకోన్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. "ధురంధర్ ఒక గ్రేట్ ఫిల్మ్. ప్రతి ఒక్కరూ అద్భుతంగా యాక్ట్ చేశారు, చాలా బాగా తీసిన సినిమా ఇది. అయితే మాకు మాత్రం సినిమాలో హింస కాస్త మోతాదుకు మించి ఎక్కువైంది అనిపించింది. కానీ మెజారిటీ ప్రేక్షకులకు ఆ యాక్షన్ ఎలిమెంట్స్ బాగా నచ్చాయి.. కాబట్టి అదే అన్నింటికంటే చాలా ముఖ్యం" అని చాలా నిజాయితీగా తన రివ్యూ ఇచ్చారు.
సొంత అల్లుడైన రణవీర్ సింగ్ తో తనకున్న బాండింగ్ గురించి కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
రణ్‌వీర్‌తో బాండింగ్.. ఇద్దరి భాష ఒక్కటే
బయటి వాళ్లకు ప్రకాష్ పదుకోన్, రణ్‌వీర్ సింగ్ ల మధ్య కామన్ పాయింట్స్ ఏమీ లేవని అనిపించవచ్చు. కానీ వీరిద్దరినీ కలిపే ఒకే ఒక్క కామన్ లాంగ్వేజ్ 'స్పోర్ట్స్' అని ప్రకాష్ పదుకోన్ రివీల్ చేశారు.
"మేము ఇరు కుటుంబాలు చాలా క్లోజ్ గా ఉంటాం. కనీసం ఏడాదికి ఒక్కసారైనా అందరం కలిసి ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్తాం. రణ్‌వీర్ కు స్పోర్ట్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్. నాతో ఎప్పుడూ ఫుట్‌బాల్, క్రికెట్ గురించే మాట్లాడుతుంటాడు. నేను కూడా సినిమా బిజినెస్ ఎలా నడుస్తుందో తెలుసుకోవడానికి రణ్‌వీర్ ను అడిగి విషయాలు తెలుసుకుంటా. వాళ్లు బిజీగా ఉండటం వల్ల మాకు ఎక్కువ టైమ్ దొరకదు. కానీ దొరికిన కాసేపైనా అందరం కూర్చుని ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఎంజాయ్ చేస్తాం. రణ్‌వీర్ ఆర్సెనల్ టీమ్ ఫ్యాన్ అయితే, నా రెండో కుమార్తె అనీషా మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్" అని ప్రకాష్ పదుకోన్ మురిసిపోయారు.
రూ. 1800 కోట్ల ఆల్-టైమ్ రికార్డ్
టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' ఈ మధ్యకాలంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. ఆమిర్ ఖాన్ 'దంగల్' తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్-టైమ్ సెకండ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా హిస్టరీ క్రియేట్ చేసింది.
ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన రెండు సినిమాలు కలిసి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 3000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హిందీ సినిమా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీగా రికార్డు నెలకొల్పాయి. ఈ భారీ సక్సెస్ తర్వాత రణవీర్ సింగ్ ప్రస్తుతం డైరెక్టర్ హన్సల్ మెహతా కొడుకు జై మెహతా డైరెక్షన్ లో 'ప్రళయ్' (Pralay) అనే హై-బడ్జెట్ జాంబీ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. దీని బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లు అని సమాచారం.
హెచ్‌టీ విశ్లేషణ
ఆదిత్య ధర్ 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' తర్వాత రణవీర్ సింగ్ ఇంటెన్సిటీని వాడుకుని ‘ధురంధర్’తో కొట్టిన దెబ్బకు గ్లోబల్ బాక్సాఫీస్ షేక్ అయింది. ప్రకాష్ పదుకోన్ లాంటి ఒక సీనియర్ స్పోర్ట్స్ లెజెండ్.. సినిమాలో హింస ఎక్కువైనా ఆడియన్స్ కు నచ్చడమే ముఖ్యం అని చెప్పడం ఆయన మెచ్యూరిటీని చూపిస్తుంది. రణవీర్ కు నార్త్ తో పాటు సౌత్ లో కూడా ఈ సినిమాతో భారీ మార్కెట్ క్రియేట్ అయింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


