...
...
Next Story

Prakash Raj: రాముడిని ఎగతాళి చేయలేదు..వాళ్ల ఏడుపు అర్థమవుతోంది..ఇలాగే వాగుతారా..వివాదంపై వీడియోతో ప్రకాష్ రాజ్ క్లారిటీ

Prakash Raj: రామాయణంపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు. తన మాటలను వక్రీకరించారని, తాను ఏ మతానికి వ్యతిరేకిని కాదని క్లారిటీ ఇచ్చాడు.

Published on: Apr 19, 2026 01:56 PM IST
Advertisement

Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇటీవల రామాయణంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన వివరణ ఇచ్చాడు. తన మాటలను వక్రీకరించారని పేర్కొన్నాడు. ఎక్స్ లో ఓ వీడియో పోస్టు చేశాడు.

ప్రకాష్ రాజ్ ఏమన్నాడంటే?

ప్రకాష్ రాజ్ (x/prakashraaj)
ప్రకాష్ రాజ్ (x/prakashraaj)

రామాయణంపై తాను చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చాడు. ‘‘ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్నా. అక్కడ నా ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని వక్రీకరించారు. నేనేదే అవతార పురుషుడు శ్రీరాముడిని ఎగతాళి చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసేలా మాట్లాడానని అంటున్నారు’’ అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు.

ఆ అవసరం లేదు

‘‘అన్ని ధర్మాలను, అందరిని ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయాలు చేసేవాళ్లు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక నన్ను యాంటీ హిందు, హిందు ధర్మ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పాపం వాళ్ల ఏడుపు, వాళ్ల కష్టం నాకు అర్థమవుతోంది. ఇప్పుడు నాకు కొన్ని పనులున్నాయి. త్వరలో వస్తా. అప్పటివరకూ ఇలాగే వాగుతుంటారా? ఊరుకుంటారా? అన్నది మీ ఇష్టం’’ అని వీడియోలో ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు.

అసలేం జరిగింది?

రాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హిందూ సంఘలు, ప్రజలు అతనిపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లలో ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదు చేశారు. మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ పై మండిపడ్డాడు.

చట్టపరమైన చిక్కులు

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్ కు నోటీసులు పంపించాడు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. ప్రకాష్ రాజ్ మాటలు ప్రాంతీయ వైరాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని భాను ప్రకాష్ మండిపడ్డాడు. ఇతిహాసాన్ని తీవ్రంగా వక్రీకరించాడని పేర్కొన్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe