...
...
Next Story

ది కేరళ స్టోరీ 2పై ప్రకాష్ రాజ్ కౌంటర్.. బీఫ్, పోర్క్ చిత్రాలు పోస్ట్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ

రిలీజ్ కు ముందే తీవ్ర వివాదాస్పదమైన మూవీ ‘ది కేరళ స్టోరీ 2’. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఓ సీన్ తో కాంట్రవర్సీ మరింత ముదిరింది. దీనిపై తాజాగా ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు.

Published on: Feb 22, 2026, 22:10:23 IST
Advertisement

ది కేరళ స్టోరీ 2 సినిమాపై వివాదాలు ఆగడం లేదు. రోజురోజుకూ కాంట్రవర్సీ ముదురుతోంది. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా పోస్టు ద్వారా ది కేరళ స్టోరీ 2 సినిమాపై కౌంటర్ వేశాడు. ఈ మూవీకి కామాఖ్య నారాయణ్ డైెరెక్టర్. విపుల్ విపుల్ అమృత లాల్ షా ప్రొడ్యూసర్. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ది కేరళ స్టోరీ 2 వివాదం

ప్రకాష్ రాజ్ (PTI)
ప్రకాష్ రాజ్ (PTI)

లవ్ జీహాద్, బలవంతపు మత మార్పిడుల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ‘ది కేరళ స్టోరీ 2 ’. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ లో ఓ సీన్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓ ముస్లిం కుటుంబం ఓ అమ్మాయికి బలవంతంగా బీఫ్ తినిపించినట్లు ఈ ట్రైలర్ లో చూపించారు. దీంతో కాంట్రవర్సీ కలకలం రేగింది.

ప్రకాష్ రాజ్ కౌంటర్

‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై ప్రకాష్ రాజ్ కౌంటర్ వైరల్ గా మారింది. ఆయన తన ఎక్స్ ఖాతాలో పోర్క్, బీఫ్, చేపలు, వెజ్ అన్నం వంటకాల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. "పంది మాంసం, బీఫ్, చేపలు, శాఖాహార సద్యా (వెజ్ తాలి)తో కలిసి సామరస్యంగా ఎలా ఉంటాయో అనేదే నిజమైన కేరళ స్టోరీ. దయచేసి ఆస్వాదించండి. జస్ట్ ఆస్కింగ్. అందరికీ హ్యాపీ సండే’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్.

అనురాగ్ కశ్యప్ విమర్శలు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ది కేరళ స్టోరీ మూవీని విమర్శించారు. "సుస్థిర అభివృద్ధిలో ముందుండి, శాంతిభద్రతల నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తున్న మత సామరస్య భూమి అయిన కేరళను తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే ప్రయత్నాలను మనం సమిష్టిగా తిరస్కరించాలి. కేరళ లౌకిక పునాదిని తప్పుడు ప్రచారంతో దెబ్బతీయకుండా చూసుకోవడం, లౌకికవాద, సోదరభావ విలువలను నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత" అని కేరళ సీఎం అన్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks