...
...
Next Story

Prakash Raj Spirit: స్పిరిట్ మూవీ నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్.. కనిపించని పేరు.. అతని స్థానంలో ఎవరు?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ (Prakash Raj Spirit) తప్పుకున్నట్లు మరోసారి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓసారి అతడు ఈ వార్తలను ఖండించినా.. తాజాగా మూవీ టైటిల్స్ లో అతని పేరు లేకపోవడంతో మరోసారి పుకార్లు మొదలయ్యాయి.

Published on: Feb 27, 2026, 21:34:16 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి వివేక్ ఒబేరాయ్ ఫస్ట్ లుక్ విడుదలవగా, ఆ పోస్ట్‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేరు లేకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూర్చుతోంది.

అసలేం జరిగింది?

Prakash Raj Spirit: స్పిరిట్ మూవీ నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్.. కనిపించని పేరు.. అతని స్థానంలో ఎవరు? (X/@prakashraaj)
Prakash Raj Spirit: స్పిరిట్ మూవీ నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్.. కనిపించని పేరు.. అతని స్థానంలో ఎవరు? (X/@prakashraaj)

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ 'స్పిరిట్'. శుక్రవారం (ఫిబ్రవరి 27) నాడు ఈ సినిమా నుంచి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ క్యారెక్టర్ పోస్టర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో సినిమాలో నటిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరినీ ట్యాగ్ చేశారు.

అయితే గతంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్ రాజ్ పేరు మాత్రం ఈ జాబితాలో కనిపించలేదు. దీంతో అతడు ఈ సినిమా నుంచి వైదొలిగాడనే ప్రచారం నిజమేనని స్పష్టమవుతోంది.

అప్పట్లో ఖండించిన ప్రకాష్ రాజ్

నిజానికి ఈ నెల ప్రారంభంలోనే ప్రకాష్ రాజ్ 'స్పిరిట్' నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ విషయంలో లేదా ఒక సీన్ చిత్రీకరణ విషయంలో దర్శకుడు సందీప్ వంగాతో అతనికి విభేదాలు వచ్చాయని, అందుకే సినిమా నుంచి వాకౌట్ చేశారని ప్రచారం జరిగింది.

అప్పట్లో ఈ వార్తలను ప్రకాష్ రాజ్ ఖండించాడు. "అసలు నా సీన్ల షూటింగే మొదలవ్వలేదు, అప్పుడే ఇలాంటి ఫేక్ న్యూస్ ఎలా రాస్తారు?" అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. కానీ తాజాగా విడుదలైన అఫీషియల్ పోస్ట్‌లో అతని పేరు లేకపోవడంతో.. అతడు ఈ ప్రాజెక్ట్‌లో లేరనే విషయం దాదాపు ఖాయమైందని విశ్వసనీయ వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ కు తెలిపాయి. అతని స్థానంలో ఎవరు నటిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

వివేక్ ఒబేరాయ్ ఫస్ట్ లుక్.. కొత్త హీరోయిన్ ఎంట్రీ!

'అర్జున్ రెడ్డి' తర్వాత సందీప్ వంగా తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో 'స్పిరిట్'పై భారీ అంచనాలు ఉన్నాయి. 'యానిమల్' సినిమాతో రూ. 915 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సందీప్.. ఇప్పుడు ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడు. సుమారు 8 భాషల్లో 'పాన్-వరల్డ్' ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe