...
...
Next Story

Preity Mukhundhan: స్టార్ హీరోయిన్లయినా ఆ పని చేయాల్సిందే.. అది చాలా కామన్: ప్రీతి ముకుందన్

Preity Mukhundhan: తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్లతో ప్రీతి ముకుందన్ జోరుమీదుంది. ఈ భామ తెలుగు ఆడియన్స్ కు కూడా పరిచయమే. తెలుగులో ఓం భీమ్ బుష్, కన్నప్ప, ఏమో ఏమో ఇది లాంటి సినిమాల్లో నటించింది. తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Oct 17, 2026, 16:38:23 IST
Advertisement

Preity Mukhundhan: కోలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ ధనుష్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం అంటే ఏ హీరోయిన్‌కైనా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. అలాంటి క్రేజీ ఛాన్స్‌ను కొట్టేసింది లేటెస్ట్ సెన్సేషన్ ప్రీతి ముకుందన్. ధనుష్ కెరీర్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక 56వ చిత్రం (D56) లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రీతి ముకుందన్ బోల్డ్ కామెంట్స్

స్టార్ హీరోయిన్లయినా ఆ పని చేయాల్సిందే.. అది చాలా కామన్: ప్రీతి ముకుందన్
స్టార్ హీరోయిన్లయినా ఆ పని చేయాల్సిందే.. అది చాలా కామన్: ప్రీతి ముకుందన్

ధనుష్ సినిమాలో తనకు అవకాశం రావడంపై తాజాగా ప్రీతి ముకుందన్ చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఛాన్స్ రావడంపై ప్రీతి ముకుందన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

"సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్లయినప్పటికీ, కొత్త సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల కోసం ఆడిషన్స్ ఇవ్వడం అనేది చాలా కామన్. ఆ పాత్రకు మనం సెట్ అవుతామా లేదా అని తెలుసుకోవడానికి ఆడిషన్స్ ఎంతో తోడ్పడతాయి" అని ప్రీతి ముకుందన్ స్పష్టం చేసింది. ధనుష్ లాంటి పెద్ద హీరో సినిమాకైనా తను ప్రాసెస్ ప్రకారమే ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యానని, ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం తన అదృష్టమని ఆమె పేర్కొంది.

మధురై బ్యాక్‌డ్రాప్‌లో ధనుష్ 56

ధనుష్ 56వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా, మధురై బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటోంది.

మ్యూజిక్ వీడియోస్, ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ప్రీతి ముకుందన్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రీసెంట్‌గా వచ్చిన సినిమాల్లో తన నటనతో, క్యూట్ లుక్స్‌తో కుర్రకారు మనసులు దోచుకుంది. తమిళంలో వచ్చిన బ్లాస్ట్ సినిమాలో ఫైటింగ్ సీన్స్ తోనూ ప్రీతి అదరగొట్టింది. ఈ మూవీతో ఆమెకు మంచి పేరు వచ్చింది.

ఇప్పుడు ఏకంగా ధనుష్ పక్కన మెయిన్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేయడంతో ఆమె కెరీర్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కోలీవుడ్‌లో టాప్ లీగ్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రీతికి ఇది ఒక గోల్డెన్ అపర్చునిటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks