బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ జట్టు యజమాని ప్రీతీ జింటా ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి వార్తల్లో నిలిచారు. బాంద్రాలోని అత్యంత సంపన్న ప్రాంతమైన పాలి హిల్‌లో తనకున్న విలాసవంతమైన (లగ్జరీ) అపార్ట్‌మెంట్‌ను ప్రీతి జింటా రూ. 18.50 కోట్లకు విక్రయించినట్లు ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది.
నాలుగు నెలల్లో రెండో విక్రయం

ప్రీతీ జింటా గత నాలుగు నెలల కాలంలో అపార్ట్‌మెంట్‌ను విక్రయించడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్‌లో ఇదే 'రుస్తోమ్‌జీ పరిశ్రమ్' భవనంలోని 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ప్రీతి జింటా రూ. 14 కోట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించారు.
రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు
తాజాగా మార్చి 2, 2026న రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ల ప్రకారం.. అదే భవనం, అదే అంతస్తులో ఉన్న మరో 1,770 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను తాజాగా ప్రీతి జింటా అమ్మేశారు.
భారతీయ సంతతికి చెందిన
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరులు ప్రియా నగర్, రాజీవ్ నగర్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఈ డీల్ కోసం సుమారు రూ. 1.11 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు సమాచారం.
రూ. 100 కోట్ల కొత్త ఇంటి కోసమేనా?
ప్రీతీ జింటా వరుసగా తన ఆస్తులను విక్రయించడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాంద్రా ప్రాంతంలోనే దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఒక భారీ ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు ప్రీతి జింటా సిద్ధమవుతున్నారని, గత విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును అందులో పెట్టుబడిగా పెట్టనున్నారని సమాచారం.
భవనం పునర్నిర్మాణం తర్వాత
ఈ అపార్ట్‌మెంట్‌ను 2023లో జరిగిన రీడెవలప్మెంట్ ఒప్పందంలో భాగంగా బిల్డర్ (రుస్తోమ్‌జీ/కీస్టోన్ రియల్టర్స్) ప్రీతి జింటాకు కేటాయించారు. అక్టోబర్ 23, 2023న కుదిరిన ఒప్పందం ప్రకారం పాత భవనం పునర్నిర్మాణం తర్వాత ఆమెకు ఈ ఫ్లాట్ దక్కింది. ఈ వ్యవహారంపై ప్రీతీ జింటా నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
బాలీవుడ్ తారల రియల్ ఎస్టేట్ హవా
{{/usCountry}}ఈ అపార్ట్‌మెంట్‌ను 2023లో జరిగిన రీడెవలప్మెంట్ ఒప్పందంలో భాగంగా బిల్డర్ (రుస్తోమ్‌జీ/కీస్టోన్ రియల్టర్స్) ప్రీతి జింటాకు కేటాయించారు. అక్టోబర్ 23, 2023న కుదిరిన ఒప్పందం ప్రకారం పాత భవనం పునర్నిర్మాణం తర్వాత ఆమెకు ఈ ఫ్లాట్ దక్కింది. ఈ వ్యవహారంపై ప్రీతీ జింటా నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
బాలీవుడ్ తారల రియల్ ఎస్టేట్ హవా
{{/usCountry}}కేవలం ప్రీతీ జింటా మాత్రమే కాదు, ఇటీవల కాలంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
100 కోట్ల విలువైన ఆస్తులు
2025లో అక్షయ్ కుమార్ తన వివిధ ఆస్తులను విక్రయించడం ద్వారా రూ. 100 కోట్లకు పైగా ఆర్జించగా, అమితాబ్ బచ్చన్ కూడా దాదాపు రూ. 100 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. తాజాగా జీతేంద్ర, ఏక్తా కపూర్ కూడా ముంబైలోని తమ అపార్ట్‌మెంట్‌ను రూ. 12.25 కోట్లకు అమ్మేశారు.