...
...
Next Story

OTT Telugu: మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి తెలుగు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. ప్రపోజ్ చేసేందుకు వెళ్తుంటే యాక్సిడెంట్!

OTT Telugu: యంగ్ హీరో త్రిగుణ్, గ్లామరస్ నటి మేఘా ఆకాష్ జంటగా నటించిన రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ప్రేమ దేశం’ మరో ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Aug 12, 2026, 06:12:33 IST
Advertisement

OTT Telugu: తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు నిరంతరం వైవిధ్యమైన సినిమాలను అందిస్తున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) మరొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తీసుకువస్తోంది. యువ నటుడు త్రిగుణ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ప్రేమ దేశం' (Prema desam) చిత్రం ఇదే ఓటీటీలో తన స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేసుకుంది.

ప్రేమ దేశం ఓటీటీ

మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి తెలుగు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. ప్రపోజ్ చేసేందుకు వెళ్తుంటే యాక్సిడెంట్!
మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి తెలుగు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. ప్రపోజ్ చేసేందుకు వెళ్తుంటే యాక్సిడెంట్!

ఐకానిక్ టైటిల్ ప్రేమ దేశం పేరుతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి రాబోతుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తెలుగు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లోకి రాబోతుంది.

ఎప్పటి నుంచంటే?

ప్రేమ దేశం సినిమా మరో ఓటీటీలో అడుగుపెట్టబోతుంది. ఆగస్టు 13 నుంచి అంటే రేపటి నుంచే ఈటీవీ ప్లాట్‌ఫామ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

రెండు ప్రేమ కథలు

శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ప్రేమ దేశం చిత్రం ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలో రిలీజైంది. రెండు వేర్వేరు జంటల మధ్య సాగే సమాంతర ప్రేమ కథలు, ఎమోషనల్ రైడ్ గా ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ ప్రేమ దేశం సినిమాలో త్రిగుణ్, మేఘా ఆకాష్‌లతో పాటు సీనియర్ నటి మధుబాల, అజయ్ కథుర్వార్, మాయ, తనికెళ్ల భరణి, వైష్ణవి చైతన్య, వైవా హర్ష కీలక పాత్రల్లో మెప్పించారు.

మణిశర్మ స్వరాలు

అర్జున్ (త్రిగున్), ఆద్య (మేఘా ఆకాష్) కాలేజీలో ఫ్రెండ్స్. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా బయటకు చెప్పాలనుకుంటారు. ‘ప్రేమ దేశం’ అనే ఓ కెఫేలో కలిసి ప్రపోజ్ చేయాలని ప్లాన్ వేసుకుంటారు. కానీ ఆ ప్లేస్ కు వెళ్తున్న వీళ్లకు యాక్సిడెంట్ అవుతుంది.

మరోవైపు రిషి, మాయ ప్రేమ పెళ్లికి రెడీ అవుతారు. కానీ అనూహ్యంగా మాయ పెళ్లిని శివతో ఫిక్స్ చేస్తారు. మరి రిషిమ, మాయ కలిశారా? అసలు అర్జున్, ఆద్యకు ఏమైంది? అనేది ఈ ప్రేమ దేశం సినిమాలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks