Premane Oorilo Title And First Look Released: తెలుగులో అచ్చతెలుగు సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలా పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, ఆత్మీయ అనుబంధాలకు నిలయమైన పల్లెటూరి నేపథ్యంలో మరో ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ప్రేమనే ఊరిలో టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఆ సినిమా పేరే 'ప్రేమనే ఊరిలో'. అయితే ప్రేమనే ఊరిలో సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా ఆవిష్కరించింది. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా ఈ ప్రేమనే ఊరిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హృదయానికి హత్తుకునే పల్లెటూరి వాతావరణం
"వెల్‌కమ్ టు ది ల్యాండ్ ఆఫ్ లవ్" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను ప్రేమనే ఊరిలో సినిమాకు పెట్టారు మేకర్స్. ప్రేమనే ఊరిలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగానే నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని పైర్లు, గాలిమరలు, ఎడ్లబండి, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దారు.
ప్రేమనే ఊరిలో నటీనటులు
టైటిల్‌కు తగినట్లే ప్రేమ, మానవ సంబంధాలు, భావోద్వేగాలను పల్లె అందాలతో ముడిపెట్టి కథను నడిపించనున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. కాగా, ప్రేమనే ఊరిలో చిత్రంలో శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
మనోజ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు
మనోజ్ కుమార్ స్వయంగా ప్రేమనే ఊరిలో సినిమాకు కథ, కథనం అందిస్తూ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు పనిచేస్తుండటం విశేషం. భారతీయ సినిమాలో సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్', 'కాంతార' వంటి చిత్రాలకు సంభాషణలు అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు.
మంచి కంటెంట్ సినిమాలను అందించడంలో
{{/usCountry}}మనోజ్ కుమార్ స్వయంగా ప్రేమనే ఊరిలో సినిమాకు కథ, కథనం అందిస్తూ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు పనిచేస్తుండటం విశేషం. భారతీయ సినిమాలో సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్', 'కాంతార' వంటి చిత్రాలకు సంభాషణలు అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు.
మంచి కంటెంట్ సినిమాలను అందించడంలో
{{/usCountry}}ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించగా, సునద్ గౌతమ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రాజ్‌కాంత్ ఎస్.కె కెమెరామెన్‌గా, హర్షిత్ ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో నిర్మాతలు సురేష్ కొండేటి, చందు శ్రీనివాస్‌లకు మంచి పేరుంది.
బలమైన కథాంశం, గ్రామీణ నేపథ్యం కలగలిపి ప్రేమనే ఊరిలో
ఈ క్రమంలోనే బలమైన కథాంశం, గ్రామీణ నేపథ్యం కలగలిసి వస్తున్న 'ప్రేమనే ఊరిలో' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందనే ధీమాను చిత్రయూనిట్ వ్యక్తం చేస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'ప్రేమనే ఊరిలో' చిత్రానికి దర్శకుడు ఎవరు?
ఈ చిత్రానికి మనోజ్ కుమార్ కథ, కథనం అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
2. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ క్యాప్షన్ ఏమిటి?
ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను "Welcome to the Land of Love" అనే క్యాప్షన్‌తో విడుదల చేశారు.
3. 'ప్రేమనే ఊరిలో' చిత్రానికి మాటలు రాసింది ఎవరు?
'కేజీఎఫ్', 'కాంతార' వంటి ప్రముఖ చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ సినిమాకు సంభాషణలు రాశారు.