Premane Oorilo Movie Review And Rating In Telugu: ఇటీవలి కాలంలో యాక్షన్, వయోలెన్స్ లేని స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథలు అరుదుగా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కన్నడ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ‘ప్రేమద ఊరలి’ చిత్రాన్ని ‘ప్రేమనే ఊరిలో’ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు మేకర్స్.
నటీనటులు ఎవరంటే?

శ్రీరామ్, తపస్విని పూనాచ జంటగా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. రంగయనా రఘు, రమికా శివు, గోవిందే గౌడ, సువీష్ చంద్ర, అభిషేక్ కల్మణి, అభి మహేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
మమతా దేవేంద్ర ఎమ్, సురేష్ కొండేటి నిర్మాతలగు నిర్మించిన భావోద్వేగ ప్రేమకథ ప్రేమనే ఊరిలో తెలుగులో అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి ప్రేమనే ఊరిలో రివ్యూలో తెలుసుకుందాం.
పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశం
సంతోష్ (శ్రీరామ్) చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తండ్రి నాగన్న (రంగాయన రఘు) అతడికి తల్లి లోటు తెలియకుండా బాధ్యతగా పెంచుతాడు. పొలం పనులు చూసుకుంటూ తండ్రికి అండగా నిలిచే సంతోష్‌ను, అదే ఊరిలో ఉండే వసంత (రమిక శివు) ప్రాణంగా ప్రేమిస్తుంది. తండ్రి నాగన్న మాత్రం తన కొడుక్కి చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆశిస్తాడు.
సంతోష్ పెళ్లి విషయానికి వస్తే రకరకాల నిబంధనలు పెడుతుండటంతో వచ్చే సంబంధాలన్నీ వెనక్కి పోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి వచ్చి బ్రేకప్ డిప్రెషన్‌లో ఉన్న రుక్మిణి (తపస్విని పూనాచ) సంతోష్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమె మాటలకు సంతోష్ ఆకర్షితుడవుతాడు.
అలరించే ట్విస్టులు
కథ కీలక మలుపు తిరిగే సమయంలో, తండ్రి నాగన్న తన స్నేహితుడి కూతురి పెళ్లి పీటలపై ఆగిపోయిందని చెప్పి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సంతోష్‌ను కోరతాడు. మరి తండ్రి కోరికను సంతోష్ మన్నించాడా? రుక్మిణిపై ఉన్న ప్రేమను వదులుకున్నాడా? వసంత తన ప్రేమను బావకు తెలియజేసిందా? చివరికీ ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
భావోద్వేగాలతో కూడిన కథనం
{{/usCountry}}కథ కీలక మలుపు తిరిగే సమయంలో, తండ్రి నాగన్న తన స్నేహితుడి కూతురి పెళ్లి పీటలపై ఆగిపోయిందని చెప్పి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సంతోష్‌ను కోరతాడు. మరి తండ్రి కోరికను సంతోష్ మన్నించాడా? రుక్మిణిపై ఉన్న ప్రేమను వదులుకున్నాడా? వసంత తన ప్రేమను బావకు తెలియజేసిందా? చివరికీ ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
భావోద్వేగాలతో కూడిన కథనం
{{/usCountry}}దర్శకుడు మనోజ్ కుమార్ ఫస్టాఫ్ అంతా పల్లెటూరి వాతావరణం, బావామరదళ్ల అల్లరితో సరదాగా నడిపించారు. ద్వితీయార్థంలో కథ పూర్తిగా భావోద్వేగాల వైపు మొగ్గుచూపుతుంది. తండ్రీ కొడుకుల అనుబంధం, నాగన్న ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.
క్లైమాక్స్ చివరి అరగంట బరువైన ఎమోషన్స్‌తో సాగుతుంది. కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించినా, పల్లెటూరి వాతావరణం, పాత్రల మధ్య ఉండే స్వచ్ఛమైన సంబంధాలు, ఎమోషన్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తాయి.
నటీనటుల ప్రతిభ..
అమాయకపు పల్లెటూరి యువకుడి పాత్రలో శ్రీరామ్ చక్కటి అభినయం కనబరిచారు. ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. రమిక శివు తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో అలరించగా, అమెరికా అమ్మాయిగా తపస్విని పూనాచ తన పాత్ర పరిధి మేర నటించింది.
సీనియర్ నటుడు రంగాయన రఘు నాగన్న పాత్రలో సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సాంకేతిక పరంగా రాజ్‌కాంత్ కెమెరా పనితనం పల్లెటూరి అందాలను కనులవిందుగా ఆవిష్కరించింది. విజువల్స్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపించి ఆహ్లాదకరంగా మార్చాయి.
సాంకేతిక బలం
సునద్ గౌతమ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథలోని మూడ్‌ను, సన్నివేశంలోని లోతైన భావాన్ని నిలబెట్టాయి. కేజీఎఫ్, కాంతార చిత్రాలకు సంభాషణలు రాసిన హనుమాన్ చౌదరి అందించిన తెలుగు డైలాగ్స్ హృదయానికి హత్తుకుంటాయి. హింస, రక్తపాతం లేని ప్రశాంతమైన కథతో వచ్చిన కుటుంబ కథా సినిమాగా చెప్పుకోవచ్చు.
ముగింపు
అయితే, కొన్ని సీన్లు ఊహకు అందేలా ఉన్నప్పటికీ, ఎలాంటి వయోలెన్స్ లేకుండా ఒక మంచి అనుభూతిని పంచే ప్రేమకథగా ‘ప్రేమనే ఊరిలో’ నిలుస్తుంది. పల్లెటూరి వాతారణంలో సాగే లవ్ స్టోరీలు మెచ్చే యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ఈ ప్రేమనే ఊరిలో.