Pretty Lethal OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌.. బంగ్లాలో అమ్మాయిలు.. ప్రాణల కోసం పోరాటం

Pretty Lethal OTT: సస్పెన్స్ తో ఉర్రూతలూగించేందుకు ఓ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఒక బంగ్లాలోకి వెళ్లే అమ్మాయిల తమ ప్రాణాల కోసం పోరాటం చేయాల్సి వస్తుంది.

Published on: Mar 25, 2026, 14:03:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యాక్షన్, సస్పెన్స్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు 'ప్రిటీ లీథల్' (Pretty Lethal) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ హాలీవుడ్ థ్రిల్లర్ ఇవాళ (మార్చి 25) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. విక్కీ జూసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న సౌత్ బై సౌత్ వెస్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అక్కడ ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ (x)

ప్రిటీ లీథల్ ఓటీటీ

హాలీవుడ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రిటీ లీథల్’ ఈ రోజు ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయింది. ఇంగ్లీష్ తో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

మూవీ కథ

ఒక బ్యాలెట్ డ్యాన్సర్ల గ్రూప్ ఓ కాంపిటీషన్ కు వెళ్తుంటుంది. ఈ అమ్మాయిల గ్యాంగ్ ఉన్న బస్సు మధ్యలో పాడైపోతుంది. ఆ గడ్డు పరిస్థితుల్లో వారు ఒక సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాల్సి వస్తుంది.

ఒక బంగ్లాలోకి ఈ అమ్మాయిలు వెళ్తారు. అయితే, ఊహించని విధంగా ఒక సాయుధ ముఠా అమ్మాయిలను చంపాలనుకుంటుంది. అప్పుడు ఆ డ్యాన్సర్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే పోరాటమే ప్రిటీ లీథల్ సినిమా.

డ్యాన్సర్లుగా మార్షల్ ఆర్ట్స్

ఈ సినిమాలో బ్యాలెట్ డ్యాన్సర్లు తమ డ్యాన్స్ శిక్షణను యుద్ధ విద్యగా మలుచుకోవడం హైలైట్ అని చెప్పాలి. శత్రువుల నుండి తప్పించుకోవడానికి వారు చేసే విన్యాసాలు, ఎదురుదాడి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. మాడీ జీగ్లర్, లానా కాండోర్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లలో అద్భుతంగా నటించారు.

భారీ తారాగణం

ప్రముఖ నటి ఉమా థుర్మాన్ ప్రిటీ లీథల్ సినిమాలో డెవోరా కాసిమర్‌గా కీలక పాత్ర పోషించారు. తొలుత 'బాలెరినా ఓవర్‌డ్రైవ్' అనే పేరుతో 2023లో ప్రకటించిన ఈ చిత్రం, అనేక మార్పుల తర్వాత 'ప్రిటీ లీథల్'గా ప్రేక్షకుల ముందుకు నేరుగా ఓటీటీలో వచ్చింది. సెర్బియా, బుడాపెస్ట్ వంటి ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది.

అమెజాన్ భారీ డీల్

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఈ సినిమా గ్లోబల్ రైట్స్ కోసం భారీగా వెచ్చించింది. దాదాపు 11 నుండి 12 మిలియన్ డాలర్లకు అమెరికా పంపిణీ హక్కులను దక్కించుకోవడం విశేషం. ఇప్పటికే రోటెన్ టొమాటోస్ వెబ్‌సైట్‌లో ఈ చిత్రానికి 63% పాజిటివ్ రేటింగ్ లభించింది.

ఓటీటీలో ఎందుకు చూడాలి?

సస్పెన్స్, యాక్షన్ ఇష్టపడే వారికి 'ప్రిటీ లీథల్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మ్యాడీ జీగ్లర్, ఇరిస్ అపటోవ్ నటన సినిమాకు ప్రధాన బలం. సాధారణ డ్యాన్సర్లు ప్రాణాపాయ స్థితిలో ఎలా వీరోచితంగా పోరాడారు అనే అంశం ఉత్కంఠను కలిగిస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో చూడాల్సిన బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More