Hanuman 2 Vs Jai Hanuman: ఒకే సినిమాకు ఒకే భాషలో రెండు వేర్వేరు సీక్వెల్స్ రావడం అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాకు ఒకే డైరెక్టర్ సీక్వెల్ తీస్తాడు. కానీ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్’ విషయంలో మాత్రం ఊహించనిది జరుగుతోంది. ఈ చిత్రానికి రెండు వేర్వేరు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి.
హనుమాన్ 2

ఉప్పెన సినిమాతో అదరగొట్టిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ ఇవాళ (నవంబర్ 21) ఓ సినిమాను ప్రకటించింది. ఆ సినిమా పేరు ‘హనుమాన్ 2’ కావడమే ఇక్కడ సంచలనం రేపుతోంది. ‘హనుమాన్ 2- ది రైజ్ ఆఫ్ వానరాస్’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి వీఐ ఆనంద్ డైరెక్టర్. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూసర్లు.
ఒరిజినల్ హనుమాన్
ఇదే ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ గతంలో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాను తీసి హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ప్రశాంత్ వర్మ, ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాతలకు మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు.
జై హనుమాన్
ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ తో విభేధాల నేపథ్యంలో తన సినిమా హనుమాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ సినిమాను స్టార్ట్ చేశాడు. ఇందులో రిషబ్ శెట్టి లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కొనసాగుతోంది.
హాట్ టాపిక్ గా
ఇప్పుడు హనుమాన్ ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్తున్నామంటూ ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాతలు హనుమాన్ 2ను ప్రకటించేశారు. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే సినిమాకు డైరెక్టర్ ఒక సీక్వెల్, ప్రొడ్యూసర్లు మరో సీక్వెల్ తీయడం అనేది సంచలనంగా మారింది.
అసలు సీక్వెల్ ఏది?
{{/usCountry}}ఇప్పుడు హనుమాన్ ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్తున్నామంటూ ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాతలు హనుమాన్ 2ను ప్రకటించేశారు. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే సినిమాకు డైరెక్టర్ ఒక సీక్వెల్, ప్రొడ్యూసర్లు మరో సీక్వెల్ తీయడం అనేది సంచలనంగా మారింది.
అసలు సీక్వెల్ ఏది?
{{/usCountry}}ఇటు ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాతలు, అటు ప్రశాంత్ వర్మ తాము తీసే సినిమాలే హనుమాన్ మూవీకి అసలైన సీక్వెల్స్ అని ప్రకటించుకుంటున్నారు. మరి ఇందులో అసలైన సీక్వెల్ ఏది అనేది రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.
అసలు ఈ రెండు చిత్రాలు ఎలాంటి వివాదాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అవుతాయి? ఆడియన్స్ ఈ సినిమాల్లో దేనికి ఓటు వేస్తారు? అనేదానిపై ఇప్పటి నుంచే క్యూరియాసిటీ ఏర్పడుతోంది.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.