మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. భయంకరమైన విలన్ గా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి కన్ఫామ్ చేశారు. ఇవాళ (నవంబర్ 15) హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ స్పీచ్ వైరల్ గా మారింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ స్పీచ్

శనివారం జరుగుతున్న గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్లు వైరల్ గా మారాయి. ‘‘గత పాతికేళ్లలో ఎన్నో ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేశా. కానీ ఇంత లెవల్లో, ఇంత మంది జనంతో ఓ సినిమా లాంఛ్ కావడం మాత్రం చూడలేదు’’ అని తెలుగులో పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు.
అదే మెసేజ్
‘‘చిన్నప్పటి నుంచి మలయాళ సినిమాల నుంచి ఎన్నో కథలు వింటూ పెరిగా. గొప్ప గర్వంగా మారే సినిమా కోసం మేం పని చేస్తున్నాం. ఈ సెలబ్రేషన్స్ లో భాగం కావడం నాకు ఎంతో ప్రత్యేకం. రాజమౌళి నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నా తర్వాతి సినిమాలో విలన్ క్యారెక్టర్ అద్భుతంగా ఉండబోతుంది. నువ్వు చేస్తావా? అని మెసేజ్ లో ఉంది’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు.
అయిదు నిమిషాలకే
‘‘రాజమౌళి సర్ నుంచి మెసేజ్ రాగానే కచ్చితంగా చేస్తానని వెళ్లి ఆఫీస్ లో కలిశా. స్టోరీ చెప్పారు. అయిదు నిమిషాలకే అదిరిపోయింది. ఆ తర్వాత మూడు గంటలు అలాగే వింటూ ఉండిపోయా. అంతలా ఎలా ఊహించుకోగలుగుతున్నారు. ఎలా ఆలోచించగలుగుతున్నారు అని ఆశ్చర్యపోయా. ప్రతి నటుడికి రాజమౌళి సినిమాలో చేయాలని ఉంటుంది. నాపై పెట్టుకున్న నమ్మకానికి థ్యాంక్స్. టార్చర్ పెట్టే షూటింగ్ ప్రాసెస్’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు.
ఎంతో స్పెషల్
‘‘థియేటర్లో నేను చూసిన తొలి తెలుగు సినిమా పోకిరి. అక్కడి నుంచి మీరు (మహేష్ బాబు) మీ లెగసీని బిల్డ్ చేసుకున్న తీరు ఎంతో స్పెషల్. ఈ సినిమాకు మీరు అర్హులు. అలాగే ప్రియాంక చోప్రాను మందాకినిగా చూడటం ఎంతో సంతోషంగా ఉంది’’ అని పృథ్వీరాజ్ ముగించారు.
{{/usCountry}}‘‘థియేటర్లో నేను చూసిన తొలి తెలుగు సినిమా పోకిరి. అక్కడి నుంచి మీరు (మహేష్ బాబు) మీ లెగసీని బిల్డ్ చేసుకున్న తీరు ఎంతో స్పెషల్. ఈ సినిమాకు మీరు అర్హులు. అలాగే ప్రియాంక చోప్రాను మందాకినిగా చూడటం ఎంతో సంతోషంగా ఉంది’’ అని పృథ్వీరాజ్ ముగించారు.
{{/usCountry}}