...
...
Next Story

హీరోల కంటే త‌క్కువ రెమ్యున‌రేష‌న్‌-ప్రియమణి సంచలన వ్యాఖ్యలు-మార్కెట్ వాల్యూ బ‌ట్టి డిమాండ్ చేస్తా-నార్త్‌లో టైమ్‌కు రారు

సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లకు రెమ్యునరేషన్ తక్కువే. ఇది ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉంది. దీనిపై రీసెంట్ గా ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Published on: Oct 28, 2025, 09:30:18 IST
Advertisement

సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న బర్నింగ్ టాపిక్ రెమ్యునరేషన్ పై ప్రియమని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువ పారితోషికం ఇవ్వడంపై స్పందించింది. ప్రియమణి తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి అనేక భాషల సినిమాల్లో అద్భుతమైన ప్రదర్శనలతో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ఈ నటి న్యూస్18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేల్ కో స్టార్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకోవడంపై రియాక్టయింది.

ప్రియమణి కామెంట్లు

ప్రియమణి
ప్రియమణి

ఇంటర్వ్యూలో ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది. రెమ్యునరేషన్ లో పక్షపాతాన్ని ఒప్పుకొంది.

“అది నిజమే. కానీ పర్వాలేదు. మీ మార్కెట్ విలువ ఎంత ఉంటే, మీరు దాన్ని బట్టి రెమ్యునరేషన్ అడగాలి. అంత మీకు లభిస్తుంది అని నేను నమ్ముతా. కొన్నిసార్లు నా పురుష సహనటుడి కంటే నాకు తక్కువ పారితోషికం ఇచ్చారు. అయితే, అది నన్ను ఇబ్బంది పెట్టదు. నా మార్కెట్ విలువ, నా అర్హత నాకు తెలుసు. ఇది నా అభిప్రాయం, నా అనుభవం. నేను దేనికైతే అర్హురాలిని అని నమ్ముతానో, అదే డిమాండ్ చేస్తాను. అనవసరమైన పెంపును అడగను" అని ప్రియమణి చెప్పింది.

షూటింగ్ టైమ్

8 గంటల షిఫ్ట్ మాత్రమే పని చేస్తాననే దీపికా పదుకొణె వివాదంతో షూటింగ్ టైమ్ పై చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ టైమ్ గురించి కూడా ప్రియమణి మాట్లాడింది.

“రెండు చోట్లా (సౌత్ , నార్త్) పని చేసే విధానం భిన్నంగా ఉంటుంది. సౌత్‌లో వారు సాధారణంగా సమయానికి ప్రారంభిస్తారు. ఉదయం 7 లేదా 8 గంటలకు స్టార్ట్ చేస్తారు. మేము 8 గంటలు అంటే, ఏమైనా సరే మేము 8 గంటలకే ప్రారంభిస్తాము. ఇక్కడ (నార్త్‌లో) మీరు 8 గంటలు అంటే, ఆ సమయానికి ప్రజలు సెట్‌కి వస్తారు అని నేను గమనించా" అని ఆమె చెప్పింది.

రాబోయే ప్రాజెక్ట్‌లు

మనోజ్ బాజ్‌పాయితో కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్' మూడవ సీజన్‌లో కూడా ప్రియమణి కనిపించనుంది. రాజ్ అండ్ డికె రూపొందించిన ఈ సిరీస్‌లో షారిబ్ హష్మి, జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్, ఆశ్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా కూడా నటిస్తున్నారు. ఇది త్వరలో ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks