...
...
Next Story

వారణాసి బడ్జెట్ రూ.1300 కోట్లు.. నీ రెమ్యునరేషన్ వల్లేనా అని ప్రియాంకను అడిగిన కమెడియన్.. ఆమె రియాక్షన్ ఇలా

వారణాసి మూవీ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తాజాగా కమెడియన్ కపిల్ శర్మ షోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె వారణాసి మూవీ గురించి కూడా మాట్లాడింది. మూవీ బడ్జెట్, తన రెమ్యునరేషన్ గురించి ఆమె ఏం చెప్పిందో చూడండి.

Published on: Dec 22, 2025, 13:59:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నెట్‌ఫ్లిక్స్‌లో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' కొత్త సీజన్ ప్రారంభమైంది. మొదటి గెస్ట్‌గా వచ్చిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' (Varanasi) సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 1300 కోట్లు అని కపిల్ శర్మ అడగగా.. ఆమె అవునని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది.

వారణాసి బడ్జెట్ రూ.1300 కోట్లా?

వారణాసి బడ్జెట్ రూ.1300 కోట్లు.. నీ రెమ్యునరేషన్ వల్లేనా అని ప్రియాంకను అడిగిన కమెడియన్.. ఆమె రియాక్షన్ ఇలా
వారణాసి బడ్జెట్ రూ.1300 కోట్లు.. నీ రెమ్యునరేషన్ వల్లేనా అని ప్రియాంకను అడిగిన కమెడియన్.. ఆమె రియాక్షన్ ఇలా

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'వారణాసి'. ఈ సినిమా బడ్జెట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ, ప్రియాంక చోప్రా 'కపిల్ శర్మ షో'లో క్లారిటీ ఇచ్చింది. ఆ షోలో జరిగిన ఆసక్తికర సంభాషణ గురించి ఇప్పుడు చూద్దాం.

ఈ షోలో కపిల్ శర్మ మాట్లాడుతూ.. "ప్రియాంక ఏం చేసినా అది భారీగానే ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు. ఆయన బడ్జెట్లు మనకు తెలిసిందే. కానీ ప్రియాంక ఈ సినిమాలో ఉన్నందు వల్ల బడ్జెట్ ఏకంగా రూ. 1300 కోట్లు అయ్యిందని విన్నాను. సినిమాకేనా లేక వారణాసిలో ఉన్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారా" అని అడిగాడు.

దీనిపై ప్రియాంక స్పందించింది. ఆ నంబర్ వినగానే ఆడియన్స్ షాక్ అయ్యారు. కానీ ప్రియాంక మాత్రం చిరునవ్వుతో "అవును" అని సమాధానం ఇచ్చింది. దీంతో ఈ సినిమా బడ్జెట్ 1300 కోట్లు అనేది దాదాపు ఖరారైనట్టేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నీ వల్లే బడ్జెట్ పెరిగిందా?

షోలో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ వారణాసి సినిమా కథ గురించి అడగడానికి ప్రయత్నించగా.. "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం సెకండ్ పార్ట్ వచ్చేదాకా ఎవరికీ తెలియలేదు. రాజమౌళి గారి సినిమాల గురించి ఇప్పుడే ఏం తెలుసుకోలేం" అని కపిల్ జోక్ చేశాడు.

'వారణాసి' సినిమా విశేషాలు

వారణాసి సినిమాలో మహేష్ బాబు (రుద్ర), ప్రియాంక చోప్రా (మందాకిని), పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ) లీడ్ రోల్స్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోని వివిధ ఖండాలు, కాలాల చుట్టూ తిరిగే అడ్వెంచర్ డ్రామా. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe