...
...
Next Story

Priyanka Chopra Oscars: ప్రియాంక చోప్రాకు తప్పిన పెను ప్రమాదం! గాల్లోకి లేచిన వాహనం.. భయంతో వణికిపోయిన నిక్ జోనాస్

Priyanka Chopra Oscars: ఆస్కార్స్ 2026 ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తళుక్కున మెరిసింది. తన భర్త నిక్ జోనాస్ తో కలిసి ఆమె ఈవెంట్ కు అటెండ్ అయింది. అయితే లోపలికి వెళ్లేముందు ప్రియాంక, జోనాస్ పెద్ద ప్రమాదం తప్పించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Published on: Mar 16, 2026, 11:04:55 IST
Advertisement

ఆస్కార్స్ 2026 ఈవెంట్లో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి మెరిసింది. అయితే మెయిన్ ఈవెంట్ కోసం వెన్యూకు వెళ్లే క్రమంలో ప్రియాంక, నిక్ జోనాస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. వాళ్లు ప్రయాణిస్తున్న గోల్ఫ్ కార్ట్ అదుపు తప్పి కిందపడబోయింది. కానీ డ్రైవర్ మళ్లీ కంట్రోల్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆస్కార్స్ లో ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కు తప్పిన ప్రమాదం
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కు తప్పిన ప్రమాదం

ఆస్కార్స్ 2026 కార్యక్రమానికి ప్రజెంటర్ గా ప్రియాంక చోప్రా స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. తన భర్త నిక్ జోనాస్ తో కలిసి ఆమె ఈవెంట్లో పాల్గొంది. అయితే ప్రియాంక, నిక్ జోనాస్ అకాడమీ అవార్డుల ప్రధాన వేదిక దగ్గరకు గోల్ఫ్ కార్టులో వెళ్లారు. ప్రియాంక, నిక్ జోనాస్ తదితరులు గోల్ఫ్ కోర్టు ఎక్కారు.

వీడియో వైరల్

ప్రియాంక, నిక్ జోనాస్ ను వేదిక వద్దకు త్వరగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో డ్రైవర్ ఒక్కసారిగా గోల్ఫ్ కార్టును వేగంగా టర్న్ చేసింది. దీంతో ఓ టైర్ గాల్లోకి లేచింది. కార్టులో నుంచి పడిపోకుండా ప్రియాంక, నిక్ గట్టిగా పట్టుకున్నారు. నిక్ కాస్త భయపడ్డట్లు కనిపించాడు. వెంటనే రియాక్టయిన డ్రైవర్ మళ్లీ గోల్ఫ్ కార్టును కంట్రలో చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

టీఎంజెడ్ ప్రకారం సోమవారం (మార్చి 15) ఉదయం జరిగిన ఆస్కార్స్ 2026 ఈవెంట్ కోసం డాల్బీ థియేటర్ కు నేరుగా వెళ్లేందుకు ప్రియాంక చోప్రా వెహికల్ కు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో నిర్వాహకులు వారిని గోల్ఫ్ కార్ట్‌లో మిగిలిన దూరం తీసుకెళ్లాల్సి వచ్చింది.

రెడ్ కార్పెట్ పై

నిక్ జోనాస్ ఏమో క్లాసిక్ బ్లాక్ టక్సేడోలో ప్రియాంకతో పాటు రెడ్ కార్పెట్‌పై నడిచాడు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 98వ అకాడమీ అవార్డులలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును ప్రెజెంట్ చేయడానికి జేవియర్ బార్డెమ్‌తో కలిసి ప్రియాంక స్టేజ్‌పైకి వచ్చింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks