గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తమ కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ పుట్టినప్పటి రోజులను, హాస్పిటల్ లో ఆమెకు జరిగిన ట్రీట్మెంట్ ను తలుచుకుని నిక్ ఎమోషనల్ అయ్యాడు.
ప్రియాంక చోప్రా కూతురు

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కు ఒక పాప ఉందనే సంగతి తెలిసిందే. 2022లో సరోగసీ ద్వారా మాల్తీ మేరీకి జన్మనిచ్చారు. అయితే పుట్టినప్పుడు మాల్తీ చాలా తక్కువ బరువుతో పుట్టిందని, మూడున్నర నెలల పాటు ఆమెను హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించామని నిక్ జోనస్ వెల్లడించాడు. జే శెట్టి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఇప్పుడు తన కుమార్తె ఎదుగుదలను, ఆమెలోని "మ్యాజిక్"ను చూస్తుంటే తనకు ఎంతో ఆశ్చర్యంగా ఉందని నిక్ చెప్పాడు.
765 గ్రాములే
మాల్తీ మేరీ పుట్టిన తర్వాత తాము అనుభవించిన భావోద్వేగాలను నిక్ పంచుకున్నాడు. "ఆమె (మాల్తీ) చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నిజానికి ఆమె ఏప్రిల్‌లో పుడుతుందని భావించాం. కానీ అంతకంటే ముందే డెలివరీ అవుతుందని మాకు కాల్ వచ్చింది. మేం హాస్పిటల్ వెళ్లాం. పుట్టినప్పుడు ఆమె బరువు కేవలం 1 పౌండ్ 11 ఔన్సులు (765 గ్రాములు) మాత్రమే. పుట్టినప్పుడు ఆమె శరీరం దాదాపు పర్పుల్ రంగులోకి మారిపోయింది’’ అని నిక్ తెలిపాడు.
12 గంటల షిఫ్టులు
మాల్తీని ఇంటికి తీసుకొచ్చే వరకు నిక్, ప్రియాంక ప్రతిరోజూ ఆసుపత్రిలో చెరో 12 గంటల పాటు షిఫ్టుల వారీగా ఉండేవారని నిక్ వెల్లడించాడు. "అది కోవిడ్ టైమ్. మేం మూడున్నర నెలల పాటు ఆసుపత్రిలోనే గడిపాము. ఇప్పటికీ నాకు ఆ ఆసుపత్రి వాసన గుర్తుంది. అక్కడ ప్రతిరోజూ ఉండటం, మాలాగే మరికొన్ని కుటుంబాలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే చూడటం ఒకవైపు భయంగానూ, మరోవైపు ఓదార్పుగానూ ఉండేది’’ అని నిక్ చెప్పాడు.
ఆరు సార్లు
‘‘మాల్తీ ఆ మూడున్నర నెలల పాటు ప్రతిరోజూ ప్రాణాల కోసం పోరాడింది. నెమ్మదిగా బరువు పెరిగింది. ఆరు సార్లు రక్తమార్పిడి (Blood transfusions) జరిగిన తర్వాత ఆమె కోలుకుంది. అలా మూడున్నర నెలల తర్వాత ఆమెను ఇంటికి తీసుకువచ్చాం" అని నిక్ ఎమోషనల్ అయ్యారు.
నిక్ కుటుంబం గురించి
{{/usCountry}}‘‘మాల్తీ ఆ మూడున్నర నెలల పాటు ప్రతిరోజూ ప్రాణాల కోసం పోరాడింది. నెమ్మదిగా బరువు పెరిగింది. ఆరు సార్లు రక్తమార్పిడి (Blood transfusions) జరిగిన తర్వాత ఆమె కోలుకుంది. అలా మూడున్నర నెలల తర్వాత ఆమెను ఇంటికి తీసుకువచ్చాం" అని నిక్ ఎమోషనల్ అయ్యారు.
నిక్ కుటుంబం గురించి
{{/usCountry}}నిక్, ప్రియాంక చోప్రా 2018లో రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. 2022 జనవరిలో వీరికి మొదటి సంతానంగా మాల్తీ జన్మించింది.
నిక్ జోనాస్ త్వరలో 'పవర్ బల్లాడ్' (Power Ballad) చిత్రంలో పాల్ రడ్డ్‌తో కలిసి కనిపించనున్నాడు. జాన్ కార్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ 5న విడుదల కానుంది. మరోవైపు వారణాసిలో ప్రియాంక చోప్రా నటిస్తోంది.