రాజమౌళి, మహేష్ బాబు మూవీ వారణాసిలో మందాకినిగా అలరించబోతున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడో కామెడీ షోలో గెస్టుగా వస్తోంది. 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 4 నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 20న ప్రారంభం కానుంది. మొదటి ఎపిసోడ్‌లో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా అతిథిగా రానుంది. ఇందులో 'వారణాసి' (Varanasi) విశేషాలతో పాటు కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్‌లతో ఆమె చేసిన కామెడీ హంగామా ప్రోమోలో ఆకట్టుకుంటోంది.
కామెడీ షోలో ప్రియాంకా చోప్రా

ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న పాపులర్ కామెడీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 4 గ్రాండ్‌గా మొదలుకాబోతోంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా 'దేశీ గర్ల్' ప్రియాంక చోప్రా వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 20న రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో తన భర్త నిక్ జోనస్‌తో పరిచయం పెరగడంలో ట్విట్టర్ కీలక పాత్ర పోషించిందని ప్రియాంక చెప్పగా.. కపిల్ స్పందిస్తూ "ట్విట్టర్ వల్ల మీకు జోడీ దొరికారు.. నాకైతే కేసులు దొరికాయి" అని సెటైర్ వేసి నవ్వించాడు.
అటు మరో కమెడియన్ సునీల్ గ్రోవర్ ప్రియాంకను ఉద్దేశించి.. "మార్కెట్లోకి ఎన్ని ల్యాప్‌టాప్‌లు వచ్చినా.. PC (Priyanka Chopra)లో ఉన్న కిక్ దేంట్లోనూ ఉండదు" అని డబుల్ మీనింగ్ పంచ్ వేయడం హైలైట్‌గా నిలిచింది.
ఇదే ప్రోమోలో"ఒకవేళ మీరు ఉదయం లేవగానే ప్రియాంక చోప్రాగా మారితే ఏం చేస్తారు?" అని ప్రియాంక అడగగా.. "వెంటనే కపిల్ శర్మకు ఫోన్ చేసి, నువ్వే నా నిజమైన ప్రేమ అని చెప్తాను" అంటూ కపిల్ తనదైన శైలిలో ఫ్లర్ట్ చేశాడు.
రాజమౌళి, మహేష్ బాబు మూవీ 'వారణాసి' అప్‌డేట్స్
ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ మూవీ ‘వారణాసి’లో నటిస్తుస్తోంది. ఇందులో మహేష్ బాబు 'రుద్ర'గా, ప్రియాంక చోప్రా 'మందాకిని'గా, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ'గా కనిపించనున్నారు.
{{/usCountry}}ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ మూవీ ‘వారణాసి’లో నటిస్తుస్తోంది. ఇందులో మహేష్ బాబు 'రుద్ర'గా, ప్రియాంక చోప్రా 'మందాకిని'గా, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ'గా కనిపించనున్నారు.
{{/usCountry}}ఇది టైమ్ ట్రావెల్, ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలగలిసిన కథ. వారణాసిని ఢీకొట్టబోయే ఒక గ్రహశకలం వల్ల జరిగే ప్రళయాన్ని ఆపడానికి.. వేర్వేరు కాలాల్లో, ఖండాల్లో ప్రయాణించే రక్షకుడి కథ ఇది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు. ఈ సినిమా ఏప్రిల్ 2027లో విడుదల కానుంది.