OTT: ఓటీటీలు ఆ సినిమాలనే తీసుకుంటున్నాయి, ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది, ఆ ఇన్నోసెన్స్ పోతుంది: నిర్మాత కామెంట్స్

Producer Dheeraj Mogilineni On OTT And Government: తెలుగులో నిర్మాతగా రాణిస్తున్నారు ప్రొడ్యూసర్ ధరీజ్ మొగలినేని. ఆయన నిర్మాతగా నిర్మించిన చిల్డ్రన్ మూవీ సమ్మర్ హాలీడేస్. ఈ సినిమా విడుదలకు ముందు పాల్గొన్న ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సినిమా, ఓటీటీల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Published on: Nov 10, 2026, 15:12:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Producer Dheeraj Mogilineni On OTT And Government: కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన లేటెస్ట్ చిల్డ్రన్ మూవీ "సమ్మర్ హాలీడేస్".

ఓటీటీలు ఆ సినిమాలనే తీసుకుంటున్నాయి, ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది, ఆ ఇన్నోసెన్స్ పోతుంది: నిర్మాత కామెంట్స్
ఓటీటీలు ఆ సినిమాలనే తీసుకుంటున్నాయి, ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది, ఆ ఇన్నోసెన్స్ పోతుంది: నిర్మాత కామెంట్స్

నిర్మాత ధీరజ్ మొగిలినేని కామెంట్స్

ఈ సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందించారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 6న థియేటర్లలో విడుదలైన సమ్మర్ హాలీడేస్ పర్వాలేదనిపించుకుంటుంది. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు నిర్మాత ధీరజ్ మొగిలినేని.

-ఈ కథ విన్నప్పుడు మనసును హత్తుకుంది. నా రియల్ లైఫ్, నా చైల్డ్ హుడ్ మెమొరీస్ గుర్తుకువచ్చాయి. ఈ సినిమాలో అమ్మమ్మ పాత్రలో జయసుధ చెప్పే డైలాగ్స్ మా అమ్మమ్మ చెప్పినట్లు, వాసుకి గారు చెప్పే మాటలు మా అమ్మ చెప్పినట్లు అనిపించాయి. మా అమ్మ అలాగే నాతో మాట్లాడేది.

ఆ ఇన్నోసెన్స్ పోతుంది

-నాతో పాటు ప్రేక్షకులకు కూడా అదే ఫీల్ కలుగుతుందని నమ్మాను. ఈ కథలో చిన్నపిల్లల పాత్రలను టీనేజ్‌లోకి మార్చి ఒక లవ్ స్టోరీ పెట్టి కమర్షియల్‌గా మార్చవచ్చు. కానీ బాల్యంలో ఉండే ఆ ఇన్నోసెన్స్ పోతుంది. పాత్రల్లోని ఆ సున్నితత్వమే ఈ కథలో కీలకమైంది.

-మనకు ట్రెండ్ బ్రేక్ చేసే సినిమాలో ఎన్నో వస్తుంటాయి. పెళ్లిచూపులు వంటి సినిమాల తర్వాత మన దగ్గర రొమాంటిక్ కామెడీ మూవీస్ ట్రెండ్ పోయింది అన్నారు. ఆ తర్వాత ప్రేమలు సినిమా తెలుగులో డబ్ అయి ఆదరణ పొందింది. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ వచ్చింది.

పిల్లల సినిమాలకు స్ఫూర్తిగా

-"సమ్మర్ హాలిడేస్" కథను చెబితే మళ్లీ పిల్లల సినిమాలు ఇండస్ట్రీలో నిర్మిస్తారని, ఆ చిత్రాలకు మా సినిమా స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్మాం. అమ్మమ్మగా నటించిన జయసుధ గారు మొన్న ట్రైలర్ లాంచ్‌కు రావాల్సిఉంది. ఆమె నెక్ట్స్ ఈవెంట్‌కు వస్తున్నారు.

-నేను నమ్మిన కథను బలంగా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నా. సమ్మర్ సీజన్‌లో మా సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నా కుదరలేదు. ఇప్పుడు రిలీజ్ కుదిరింది కాబట్టి దీపావళి పండక్కి కరెక్టేమో అనిపించింది. ఈ నెల 30న వచ్చే సినిమాలు నవంబర్ 6కు వాయిదా పడతాయని భయపడ్డాం. కానీ, అవేమీ రావడం లేదు. లక్కీగా మా సినిమాకు దాదాపు సోలో రిలీజ్ దొరికిందని అనుకోవచ్చు.

ప్రభుత్వం సపోర్ట్ ఇస్తే

-ఒక స్పెషల్ అటెంప్ట్ చేసే చిత్రాలకు, కొత్త నిర్మాతలు తీసే చిన్న చిత్రాలకు, స్థానికంగా రూపొందించే సినిమాలకు ప్రభుత్వం నుంచి ఏదైనా రాయితీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే థియేటర్స్ నుంచి రెవెన్యూ తగ్గిపోయింది. ఓటీటీలు పెద్ద సినిమాలనే తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న సినిమాకు ప్రభుత్వం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది.

-మా సినిమాలో మెసేజ్ ఏమీ ఉండదు. మంచి ఎమోషన్స్ ఉంటాయి. పిల్లలు రెండు నెలలు వేసవి సెలవులు గడిపి తిరిగి వెళ్లిపోతుంది అమ్మమ్మ, ఆ ఊరి స్నేహితులు ఎమోషనల్‌గా మారడం, అరుణ్, రోహన్ క్యారెక్టర్స్ మధ్య ఉండే బాండింగ్, తండ్రి కొడుకు ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. నేను నిర్మాతగా అవార్డ్స్ ఆశించడం లేదు. థియేటర్స్‌కు ప్రేక్షకులు వచ్చి మా సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More